ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

నాలుగు ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ రోజు సమావేశమైన - కేంద్ర డి.ఓ.ఎన్.ఈ.ఆర్., పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి

Posted On: 15 FEB 2023 5:51PM by PIB Hyderabad

కేంద్ర డి.ఓ.ఎన్.ఈ.ఆర్., పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, ఈ రోజు నాలుగు ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. 

 

సి.ఎన్‌.ఎ. వ్యవస్థను సక్రమంగా అమలు చేయాలని, సి.ఎన్‌.ఎ. ఖాతాకు ఖర్చు చేయని నిల్వలను సకాలంలో తిరిగి ఇచ్చేలా చూడాలని, శ్రీ జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. 

 

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ వ్యయంపై కూడా శ్రీ రెడ్డి చర్చించారు.  డి.ఓ.ఎన్.ఈ.ఆర్. కి నాణ్యమైన ప్రతిపాదనలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.  అవసరమైన మద్దతు, సమన్వయాన్ని అందించడానికి, డి.ఓ.ఎన్.ఈ.ఆర్. కి చెందిన  రాష్ట్ర స్థాయి క్షేత్ర సాంకేతిక విభాగాలు (ఎఫ్,టి.ఎస్.యు) లను  రాష్ట్రాల్లో ఏర్పాటు చేసినట్లు, ఆయన రాష్ట్రాలకు తెలియజేశారు.,  బడ్జెట్ కేటాయింపుల్లో వంద శాతం వినియోగించుకునేందుకు రాష్ట్రాలు కృషి చేయాలని ఆయన సూచించారు. 

 

ఎమ్.డి.ఓ.ఎన్.ఈ.ఆర్. కి చెందిన వివిధ పథకాల కింద 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో మంజూరైన ప్రాజెక్టుల కోసం డి.పిఆర్. ల సమర్పణ స్థితిని కూడా మంత్రి సమీక్షించారు.  ప్రతి దశలోనూ సన్నిహిత సమన్వయాన్ని సాధించడం ద్వారా ఈ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు, డి.ఓ.ఎన్.ఈ.ఆర్. మంత్రిత్వ శాఖ అధికారులకు ఆయన పిలుపునిచ్చారు.

 

త్వరలో నిర్వహించే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు గురించి కూడా శ్రీ జి. కిషన్ రెడ్డి వివరంగా చర్చలు జరిపి, ఈ విషయంలో రాష్ట్రాలు పూర్తిగా సహకరించాలని కోరారు.   పెట్టుబడిదారులు ఈశాన్య ప్రాంత సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, అదేవిధంగా రాష్ట్రాల్లో వివిధ రంగాల్లో అందుబాటులో ఉన్న అనేక అవకాశాలను ప్రదర్శించడానికి ఈ సదస్సు ఒక గొప్ప అవకాశం  అని ఆయన పేర్కొన్నారు.   అనుమతులు, లైసెన్సులు త్వరిత గతిని అందించడం, ఏకగవాక్ష విధానాల స్థాయిని పెంచడం, పెట్టుబడిదారుల సందేహాలన్నింటినీ పరిష్కరించేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయి లో నోడల్ అధికారులను నియమించడం వంటి వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడానికి రాష్ట్రాలు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు.  భూమి లభ్యత, రుణ సదుపాయాలు, వెంటనే వినియోగించుకోడానికి వీలుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, సంబంధిత రాష్ట్రాల్లో అనువైన ప్రాంతాలను పెంచడానికి విధానాలు, ప్రోత్సాహకాలను రూపొందించడం వంటి వాటికి సంబంధించి మనం చేసే  అవసరమైన మార్పులు పెట్టుబడిదారుల ఆసక్తిని ఆకర్షించి, శిఖరాగ్ర సమావేశాన్ని విజయవంతం చేస్తాయని ఆయన వివరించారు. 

 

2023 మార్చి నెలలో అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సును నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తూ, ఈ విషయాన్ని ప్రచారం చేసి, భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని వారిని కోరారు. 

 

కొత్త ఈశాన్య పెట్టుబడి అభివృద్ధి పథకం ప్రారంభించడానికి వీలుగా  రాష్ట్రాలు తమ సమాచారాన్ని, సహాయసహకారాలు పంచుకోవాలని, కూడా, మంత్రి పిలుపునిచ్చారు.  ఈ కొత్త పథకాలు విజయవంతంగా అమలు చేయడంలో రాష్ట్రాలే ప్రాథమిక వాటాదారులు గా ఉంటాయని,  ఈ ప్రాంతానికి చెందిన లక్ష్యాలు, వాస్తవాలు ప్రతిబింబించేలా ఈ పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్రాల సహకారం కీలకమని, ఆయన వివరించారు. 

 

ఈశాన్య రాష్ట్రాలలో జి-20 శిఖరాగ్ర సమావేశానికి సన్నాహక పురోగతిని కూడా సమీక్షించారు.  కేంద్ర ప్రభుత్వం నుండి అవసరమైన పూర్తి సహకారం అందించడం జరుగుతుందని శ్రీ జి. కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

 

డి.ఓ.ఎన్.ఈ.ఆర్. మంత్రిత్వ శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖల మద్దతు తో కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నాయకత్వంలో నిర్వహించబడుతున్న "యువ సంగం" పర్యటనల గురించి కూడా శ్రీ జి. కిషన్ రెడ్డి చర్చించారు.   ఈ కార్యక్రమంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మిగిలిన భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తారని, అదే విధంగా మిగిలిన భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఈశాన్య రాష్ట్రాల్లో ప్రయాణిస్తారని ఆయన తెలియజేశారు.  సంప్రదాయం, పర్యాటకం, పురోగతి, సాంకేతికత, పరస్పర సహకారం అనే ఐదు సూత్రాలపై ఈ పర్యటనలను నిర్వహించడం జరుగుతోందని ఆయన వివరించారు.  ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించి, తమ పేర్లు నమోదు చేసుకునే విధంగా వారిని ప్రోత్సహించాలని ఆయన రాష్ట్రాలను కోరారు.

 

 

*****


(Release ID: 1899707) Visitor Counter : 166


Read this release in: English , Urdu , Hindi , Manipuri