ఆర్థిక మంత్రిత్వ శాఖ
సిఎస్ఆర్ చొరవల కింద టిఇఆర్ఐతో అవగాహనా ఒప్పందంపై సంతకం చేసిన ఎస్‌పిఎంసిఐఎల్
प्रविष्टि तिथि:
15 FEB 2023 4:17PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ యాజమాన్యంలోని మినీ రత్న కేటగిరీ -1 సిపిఎస్ ఇ అయిన సెక్యూరిటీ ప్రింటిండగ్ అండ్ మైనింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎస్‌పిఎంసిఐఎల్), ది ఎనర్జీ రీసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (టిఇఆర్ఐ) మంగళవారంనాడు ఎస్‌పిఎంసిఐఎల్ కార్పొరేట్ కార్యాలయంలో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయ
ఎస్‌పిఎంసిఐఎల్ సిఎస్ఆర్ చొరవల కింద రూ. 525.49 లక్షల అంచనా వ్యయంతో మధ్య ప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలోని సిరోలియాను సామాజిక అభివృద్ధి, సమాగ్రాభివృద్ధితో మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందకు అవగాహనా ఒప్పందం కుదిరింది.
ఈ సందర్భంగా ఎస్‌పిఎంసిఐఎల్ డైరెక్టర్ (హెచ్ఆర్) శ్రీ ఎస్.కె. సిన్హా, చీఫ్ జనరల్ మేనేజర్ (హెచ్ ఆర్) శ్రీ బిజె గుప్తా, జాయింట్ జిఎం (హెచ్ఆర్) శ్రీ ప్రకాశ్ కుమార్, కన్సల్టెంట్ శ్రీ వినోద శర్మ హాజరుకాగా, టిఇఆర్ఐకు అసోసియేట్ డైరెక్టర్ & సిఎస్ఆర్ శ్రీ అమిత్ కుమార్ ఠాకూర్ &రీసెర్చ్ అసోసియేట్ మితాక్షా రస్వంత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(रिलीज़ आईडी: 1899682)
आगंतुक पटल : 185