యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ మధ్యప్రదేశ్ ఎడిషన్ భాగస్వాములుగా ఎస్.బి.ఐ,


- భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్.బి.ఐ)తో పాటుగా ఇతర సంస్థల భాగస్వామ్యం

- దేశంలో క్రీడా పర్యావరణ వ్యవస్థను పెంపొందించే అవకాశాన్ని పొందడం విశేషంగా భావిస్తున్న సంస్థలు

Posted On: 14 FEB 2023 2:56PM by PIB Hyderabad

వరుసగా రెండో సంవత్సరం కూడా ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్.బి.ఐ) ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ (కె.ఐ.వై.జి) ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగింది.  మధ్యప్రదేశ్‌లో నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ (కె.ఐ.వై.జి) కోసం తన స్పాన్సర్‌షిప్‌ను బ్యాంక్ పొడిగించింది.  ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ (కె.ఐ.వై.జి) 2022 ఎడిషన్‌కు కూడా ఎస్.బి.ఐ ప్రధాన స్పాన్సర్‌గా కొనసాగింది. “భారతీయ యువత క్రీడల పట్ల ఉన్న ఆకాంక్షలకు మద్దతునిచ్చే మరియు ప్రోత్సహించే ఖేలో ఇండియాతో మా అనుబంధాన్ని కొనసాగించడానికి మేము సంతోషిస్తున్నాము. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో, యువ క్రీడాకారులు తమ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించడంలో తమ భాగస్వామ్యాన్ని చూసేందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ భాగస్వామ్యం ద్వారా భారతీయ యువతలో క్రీడలు మరియు ఫిట్‌నెస్ విలువను పెంపొందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము” అని ఎస్.బి.ఐ తెలిపింది.

దేశంలో క్రీడల మెరుగుకు..

ఎస్.బి.ఐతో పాటు, డ్రీమ్ స్పోర్ట్స్ కూడా మళ్లీ కె.ఐ.వై.జి.కి స్పాన్సరర్గా  వ్యవహరించింది. స్పాన్సరింగ్  ద్వారా వారి సహ-శక్తితో మరియు కె.ఐ.వై.జి బ్రాండ్‌తో మళ్లీ అనుబంధించబడినందుకు ఆనందంగా ఉందని సంస్థ తెలిపింది.  డ్రీమ్ స్పోర్ట్స్ సంస్థ  సీఓఓ & కో-ఫౌండర్  భవిత్ షేత్ మాట్లాడుతూ “భారతదేశంలోని యువతకు సాధికారత కల్పించాలనే మా అభిరుచిని మరియు క్రీడలను మెరుగుపరచాలనే మా దృష్టిని పంచుకునే ప్రక్రియలో భాగంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌ క్రీడా కార్యక్రమాలతో జట్టుకట్టడం మా అదృష్టం. ఈ భాగస్వామ్యం ద్వారా, భారతదేశ క్రీడా పర్యావరణ వ్యవస్థను పెంపొందించడం,  క్రీడలను కొనసాగించేందుకు మా వర్ధమాన అథ్లెట్లను ప్రోత్సహించడం అనేది మా ఉమ్మడి లక్ష్యం. ఇందుకోసం పని చేయడాన్ని కొనసాగించాలని మేము ఆశిస్తున్నాము” అని అన్నారు.  ఈ క్రీడల కోసం జట్టు కట్టడం ఖేలో ఇండియా మరియు స్పాన్సర్ సంస్థలు రెండింటికీ మేలు కలుగుతుంది. పని-పని సంబంధాన్ని సాధించే లక్ష్యంతో కె.ఐ.వై.జి. కోసం కార్పొరేట్ స్పాన్సర్‌షిప్‌కు ఖేలో ఇండియా ద్వారాలు తెరవడం వరుసగా ఇది రెండో సంవత్సరం.

 

పవర్డ్ బై స్పాన్సర్‌గా ఎస్ఎఫ్ఏ..

ఎస్.బి.ఐ మరియు డ్రీమ్ స్పోర్ట్స్ రెండూ గతంలో కె.ఐ.వై.జి తో భాగస్వామ్యాన్ని కలిగి ఉండగా.. కె.ఐ.వై.జి ఆధారితంగా స్పాన్సర్ సంస్థగా ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’ (ఎస్ఎఫ్ఏ)  రంగంలోకి దిగడం ఇదే తొలిసారి. కొత్తగా జట్టు కట్టడం గురించి ఎస్ఎప్ఏ వ్యవస్థాపకుడు & సీఈఓ రిషికేష్ జోషి మాట్లాడుతూ, "స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ఎస్ఎఫ్ఏ) సంస్థ కె.ఐ.వై.జి.  కోసం పవర్డ్ బై స్పాన్సర్‌గా బోర్డులోకి రావడం గౌరవంగా భావిస్తున్నాను. దేశవ్యాప్తంగా క్రీడా ఆకాంక్షను సృష్టించడం, పతకాలు గెలుచుకునే క్రీడాకారులను అందుబాటులోకి తేవాలన్న ఖేలో ఇండియా యొక్క లక్ష్యాన్ని ఎస్ఎఫ్ఎ గట్టిగా ప్రతిధ్వనింపజేస్తుందని అన్నారు.  అట్టడుగు స్థాయిలో క్రీడా సంస్కృతిని నిర్మించడంలో సహాయం చేయడానికి మా అవిశ్రాంత ప్రయత్నం మరియు అటువంటి లోతైన భాగస్వామ్యంతో భారతదేశం క్రీడాలలో మేటి దేశంగా వృద్ధి చెందే ప్రక్రియను  వేగవంతం చేస్తుందని మేము విశ్వసిస్తున్నామని అన్నారు.  ఖేలో ఇండియా యూత్ గేమ్స్ మధ్యప్రదేశ్ ఎడిషన్ జనవరి 30న మధ్యప్రదేశ్‌లోని ఎనిమిది నగరాల్లో ప్రారంభమై దిగ్విజయంగా కొనసాగింది. 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 6000 మంది యువ క్రీడాకారులు ఈ క్రీడల్లో పాలు పంచుకుంటున్నారు.  ఈ ఎడిషన్ గేమ్స్‌లో, కయాకింగ్, రోయింగ్ మరియు వాటర్ సలోమ్ వంటి జల క్రీడాల విభాగంలోను పోటీలను నిర్వహించారు. ఈ క్రీడలు అరంగేట్రం చేయడంతో మొత్తం 27 క్రీడా ఈవెంట్‌లలో క్రీడాకారులు తమ క్రీడా ప్రదర్శననిచ్చారు. 

***


(Release ID: 1899246) Visitor Counter : 157