కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఇఎస్ఐఎస్ ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను ఆధునీకరించేందుకు నిర్మాణ్ సె శక్తి చొరవను అందించిన ఇఎస్ఐసి
అగర్తాల (త్రిపుర)లోని శామ్లీ బజార్, ఇడుక్కి (కేరళ)లో నూతనంగా 100 పడకల ఇఎస్ఐసి ఆసుపత్రులను ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం
Posted On:
13 FEB 2023 6:26PM by PIB Hyderabad
డిసెంబర్ 2-4, 2022న జరిగిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి - ఉద్యోగుల రాష్ట్ర బీమా కార్పొరేషన్) సమావేశం సందర్భంగా, నిర్మాణ్ సె శక్తి అన్న చొరవ కింద మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంపై ఇఎస్ఐసి ఒక ప్రెజెంటేషన్‌ను ఇచ్చినట్టు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలి లోక్‌సభలో వేసిన ప్రశ్నకు లిఖిత పూర్వకరూపంలో సమాధానం ఇస్తూ తెలిపారు. ఈ చొరవలో ఇఎస్ఐ పథకం (ఇఎస్ఐఎస్) ఆసుపత్రులను, డిస్పెన్సరీలను దశలవారీగా ఆధునీకరించడం/ తాజాపరచడం, 100/ 200/ 500 పడకల ఆసుపత్రులను ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసేందుకు ప్రామాణికమైన డిజైన్‌ను రూపొందించడం, ప్రాజెక్టు పర్యవేక్షణ, సూర్‌విజన్ కోసం ఆన్‌లైన్ రియల్‌టైమ్ డాష్‌బోర్డు, నాణ్యమైన నిర్మాణానికి నూతన నిర్మాణ సాంకేతికలను అనుసరించేలా ఖరారు చేయడం, జాప్యాలను , అదనపు ఖర్చును నిర్మూలించడం తదితరాలు, భూమి/ ఆస్తి పత్రాలు తదితరాల డిజిటీకరణ.
ఇఎస్ఐ కార్పొరేషన్ 3-4 డిసెంబర్, 2022న జరిగిన సమావశంలో అగర్తాలలోని (త్రిపుర) శ్యామ్లీబజార్ లో, ఇడుక్కి (కేరళ)లో నూతన 100 పడకల ఇఎస్ఐసి ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదాన్ని తెలిపినట్టు శ్రీ తెలి అన్నారు. అలాగే, ఇఎస్ఐసి నర్సింగ్ కాలేజీలతో పాటు పిహెచ్.డి, మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (ఎండిఎస్), నర్సింగ్, పారామెడికల్ కోర్సులలో బీమా చేసుకున్న వ్యక్తుల పిల్లలకు సీట్ల సంఖ్యను చట్టబద్ధమైన ఆమోదం/ అనుమతితో దశలవారీగా పెంచాలని ఇఎస్ఐసి ప్రణాళికను రూపొందించింది.
ఇస్ఐ కార్పొరేషన్ 3-4 డిసెంబర్ 2022న నిర్వహించిన సమావేశంలో మిగుల నిధులలో కొంత భాగాన్ని ఎక్స్‌చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఇటిఎఫ్)కు పరిమితమైన ఈక్విటీలో పెట్టుబడి పెట్టేందుకు సూత్రప్రాయంగా అనుమతినిచ్చిందని లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.
***
(Release ID: 1898971)
Visitor Counter : 189