సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
డిజిటల్ సాధికారతను ప్రోత్సహించడం.. ఎంఎస్ఎంఈ ల వ్యాపారం సులభతరం..
- ఈ దిశగా వివిధ డిజిటల్ కార్యక్రమాలను చేపట్టిన కేంద్ర ప్రభుత్వం
Posted On:
13 FEB 2023 2:40PM by PIB Hyderabad
డిజిటల్ సాధికారతను ప్రోత్సహించడానికి మరియు ఎంఎస్ఎంఈల వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం వివిధ డిజిటల్ కార్యక్రమాలను చేపట్టింది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఉదయం రిజిస్ట్రేషన్ పోర్టల్, ఎంఎస్ఎంఈ ల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఛాంపియన్స్ పోర్టల్, ఆన్‌లైన్ సేకరణ కోసం ప్రభుత్వ ఇ-మార్కెట్‌ప్లేస్ (జీఈఎం), డిస్కౌంట్ ఇన్‌వాయిస్‌ల కోసం ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్ (టీఆర్ఈడీఎస్) మరియు ఆన్‌లైన్ మార్కెటింగ్ సపోర్టింగ్ కోసం ఎంఎస్ఎంఈమార్ట్ డాట్ కామ్ ఉన్నాయి. దీనికి తోడుగా కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు / సీపీఎస్ఈలు / రాష్ట్ర ప్రభుత్వాలు మొదలైన వాటి ద్వారా ఆలస్యంగా చెల్లింపులకు సంబంధించిన దరఖాస్తులను పూరించడానికి మైక్రో మరియు స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్ఈలు) మరియు ఎంఎస్ఎంఈ సమాధాన్ పోర్టల్, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (సీపీఎస్ఈలు) ద్వారా సేకరణను పర్యవేక్షించడానికి ఎంఎస్ఎంఈ సంబంధ్ మొదలైనవి అందుబాటులోకి తెచ్చారు. దీనికి తోడు దేశంలోని ఎంఎస్ఎంఈల డిజిటల్ సాధికారత కోసం ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఎంఎస్ఎంఈ ఛాంపియన్స్ స్కీమ్‌ల క్రింద అవగాహన పెంచడానికి, క్లౌడ్ ఆధారిత డిజిటల్ సాధనాల వినియోగానికి 'డిజిటల్ ఎంఎస్ఎంఈ స్కీమ్'ను కూడీ అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు రూ. 1.39 కోట్ల ఎంఎస్ఎంఈలు ఉదయం రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో నమోదు చేయబడ్డాయి. వివిధ కార్యక్రమాల ద్వారా మరింత ప్రయోజనం పొందుతున్నాయి. కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు / సీపీఎస్ఈల నుండి కొనుగోళ్లు సుమారు రూ.139018 కోట్లుగా నిలిచాయి. ఎంఎస్ఈల కోసం పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పాలసీ (పీపీపీ) కింద ఎంఎస్ఈల నుండి మరియు ఎంఎస్ఎంఈలు దాఖలు చేసిన 22,974 దరఖాస్తులను ఎంఎస్ఈఎఫ్సీ కౌన్సిల్ పరిష్కరించింది. సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.
***
(Release ID: 1898959)
Visitor Counter : 133