సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి ఎంఎస్‌ఎంఈ ఛాంపియన్స్ పథకం కింద ఎంఎస్‌ఎంఈ ఆవిష్కరణల పథకం అమలు

Posted On: 13 FEB 2023 2:42PM by PIB Hyderabad

దేశంలో ఇంక్యుబేషన్ కేంద్రాల సంఖ్య పెరుగుతోంది. నీతి ఆయోగ్, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లు (ఏఐసీ) అందించిన సమాచారం ప్రకారం, ఏఐసీల సంఖ్య 2017లోని 13 నుంచి 2022లో 69కి పెరిగింది. దీనికి తోడు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఎంఎస్‌ఎంఈ ఛాంపియన్స్ పథకం కింద ఎంఎస్‌ఎంఈ ఆవిష్కరణల పథకాన్ని అమలు చేస్తోంది. వినూత్న ఆలోచనలను ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి 2022 మార్చిలో దీనిని ప్రారంభించింది. ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి, వ్యాపార ఇంక్యుబేటర్‌లుగా పని చేయడానికి 632 హోస్ట్ ఇన్‌స్టిట్యూట్‌లను (హెచ్‌ఐలు) గుర్తించడం జరిగింది.

గత ఐదు సంవత్సరాల్లో, దేశవ్యాప్తంగా 56 అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాలు (ఏఐసీలు), 14 అటల్ సామాజిక ఆవిష్కరణల కేంద్రాలను అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఎయిమ్‌) ఏర్పాటు చేసింది. గత ఐదు సంవత్సరాలలో స్థాపించిన అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాల జాబితా అనుబంధం-Iలో జత చేయడం జరిగింది.

ఎయిమ్‌ మార్గదర్శకాల ప్రకారం, అంకుర సంస్థలకు తగిన భౌతిక మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు వాటికి మార్గదర్శకత్వం చేయడానికి 5-6 మంది సభ్యుల బృందాన్ని కలిగి ఉండడం, ఆయా రంగాల నిపుణుల అందుబాటును నిర్ధరించడం ప్రతి ఇంక్యుబేషన్ కేంద్రానికి తప్పనిసరి. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అనేది మన దేశంలో ఆవిష్కరణలు, వ్యవస్థాపకత సంస్కృతిని ప్రోత్సహించడానికి 2016లో ప్రారంభించిన ఒక కార్యక్రమం. ఈ మిషన్‌లో భాగంగా విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు మొదలైన వాటిలో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాల పేరుతో ప్రపంచ స్థాయి ఇంక్యుబేటర్లను ఎయిమ్‌ ఏర్పాటు చేస్తోంది. నీతి ఆయోగ్ అందించిన సమాచారం ప్రకారం, ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి 69 ఏఐసీల ద్వారా 3052 అంకుర సంస్థలు ద్వారా రూపుదిద్దుకున్నాయి. వీటిలో 954 మహిళల నేతృత్వంలోని అంకుర సంస్థలు. ఈ అంకుర సంస్థలు దేశవ్యాప్తంగా 15,506 ఉద్యోగాలను సృష్టించాయి.

***



(Release ID: 1898954) Visitor Counter : 134


Read this release in: English , Urdu , Tamil