సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగంలో పెట్టుబడి అత్యాధునిక సాంకేతికతల స్వీకరణ కోసం అమలు ఐన పథకాలు కార్యక్రమాలు; జూన్, 2022లో మొదటిసారిగా ఎగుమతి చేసేవారి సామర్థ్యాన్ని పెంపొందించే పథకం ప్రారంభం
प्रविष्टि तिथि:
13 FEB 2023 2:44PM by PIB Hyderabad
మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ (MSME) సాధారణ ఇంజనీరింగ్, ఫోర్జింగ్ వంటి రంగాలలో అనిముట్లు , సునిశిత పరికరాలు, అచ్చులు, డైస్, జిగ్‌లు వాటి రూపకల్పన, తయారీ ద్వారా పరిశ్రమలకు సాంకేతిక సహాయాన్ని అందించే సాంకేతిక కేంద్రాలను (TCలు) ఏర్పాటు చేసింది. ఫౌండ్రీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ తయారీ, ఎలక్ట్రికల్, సుగంధ ద్రవ్యా ఉత్పత్తులు, గాజు, పాదరక్షలు మరియు క్రీడా వస్తువులు. మంత్రిత్వ శాఖ MSME రంగంలో సరికొత్త సాంకేతికతలను స్వీకరించడానికి పెట్టుబడిని అందించే లక్ష్యంతో వివిధ పథకాలు కార్యక్రమాలను అమలు చేస్తుంది. MSME విజేతల పథకం, క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ (CGTMSE), ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP) సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల - క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్(MSE-CDP) వంటి పథకాల క్రింద ఈ పథకాలు / ప్రోగ్రామ్‌లు, ఇతర అంశాలలో ఆర్థిక సహాయాన్ని కలిగి ఉంటాయి..
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్, స్టాటిస్టిక్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం, 2021-22లో మొత్తం భారతదేశ ఎగుమతుల్లో పేర్కొన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల నుండి సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి వాటా క్రింది విధంగా ఉంది:
|
సం.
|
MSME సంబంధిత ఉత్పత్తుల సంవత్సర ఎగుమతి విలువ (మిలియన్ అమెరికన్ డాలర్లలో)
|
దేశవ్యాప్త ఎగుమతుల విలువ (మిలియన్ అమెరికన్ డాలర్లలో)
|
దేశ మొత్తం ఎగుమతుల్లో MSME సంబంధిత ఉత్పత్తుల ఎగుమతి వాటా శాతం - %
|
|
2021-22
|
190,019
|
422,004
|
45.03%
|
భారతీయ ఎగుమతుల్లో MSMEల సహకారాన్ని పెంచడానికి వారి పోటీతత్వాన్ని పెంపొందించడానికి, MSME మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ సహకార (IC) పథకాన్ని అమలు చేస్తోంది, దీని కింద అర్హత కలిగిన కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పరిశ్రమల సంఘాలకు ఆర్థిక సహాయం అందుతుంది. విదేశాల్లో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనలు/ఫెయిర్‌లు/కొనుగోలుదారుల-విక్రేత సమావేశాలలో MSMEలు పాల్గొనడం, భారతదేశంలో అంతర్జాతీయ సదస్సు/సెమినార్/వర్క్ షాప్ లను నిర్వహించడం కోసం టెక్నాలజీ అప్‌గ్రేడేషన్, ఆధునీకరణ, జాయింట్ వెంచర్ మొదలైన వాటి లక్ష్యంతో పాటు, విసేషీ సహకార పథకం కొత్త భాగం కింద అంటే జూన్ 2022లో ప్రారంభించిన మొదటిసారి ఎగుమతిదారులు ఐన వారి సామర్థ్య పెంపుదల (CBFTE), EPCలు, ఎగుమతి భీమా, ప్రీమియంతో రిజిస్ట్రేషన్-కమ్-మెంబర్‌షిప్ సర్టిఫికేషన్ (RCMC)పై అయ్యే ఖర్చుల కోసం కొత్త సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల (MSE) ఎగుమతిదారులకు ఎగుమతుల కోసం నాణ్యత ధృవీకరణ నగదును వెనక్కి చెల్లిస్తారు.. IC పథకం కింద ఈ జోక్యాలు చిన్న పరిశ్రమల రంగంలోని ఎగుమతిదారులకు అంతర్జాతీయ మార్కెట్‌లలో వారి ప్రాప్యతను పెంచడానికి సహాయపడతాయి.
సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు (MSEలు) అవసరమైన మార్గదర్శకత్వం, హ్యాండ్‌హోల్డింగ్ మద్దతును అందించే లక్ష్యంతో MSME మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 52 ఎగుమతి సులభతర కేంద్రాలు (EFCలు) ఏర్పాటు చేసింది.
సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ భాను ప్రతాప్ సింగ్ వర్మ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానం గా ఈ సమాచారం అందించారు.
*****
(रिलीज़ आईडी: 1898866)
आगंतुक पटल : 355