వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఆహారధాన్యాల నిర్వహణలో ఆధునిక సాంకేతికతలను ఉపయోగించాలి: శ్రీ గోయల్
రైతులు తమ ఉత్పత్తులను ఎఫ్‌సిఐకి లేదా మరే ఇతర ఏజెన్సీకి విక్రయించుకునే అవకాశం ఉండేలా ఎఫ్‌సిఐ అన్ని రెవెన్యూ జిల్లాలను కవర్ చేస్తూ మరిన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి: శ్రీ గోయల్
Posted On:
13 FEB 2023 1:11PM by PIB Hyderabad
ఫుడ్‌గ్రెయిన్ మేనేజ్‌మెంట్ మరియు క్వాలిటీ కంట్రోల్‌లో మరింత పారదర్శకత మరియు కనీస మానవ ఇంటర్‌ఫేస్‌ను తీసుకురావడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజాపంపిణీ, టెక్స్‌టైల్స్ మరియు వాణిజ్యం & పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్ లక్నోలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యుపి రీజియన్ కార్యకలాపాలను సమీక్షలో తెలిపారు.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పనితీరును మరింత సమర్ధవంతంగా, ఆధునికంగా మార్చేందుకు అధికారులందరూ తమ సూచనలను పంపాలని ఆయన పిలుపునిచ్చారు. ఆహారధాన్యాల నిర్వహణ రంగంలో తమ నైపుణ్యాన్ని ఉపయోగించాలని మరియు పరిమిత విస్తీర్ణంలో అధిక సామర్థ్యాలను సృష్టించేందుకు గోడౌన్ల మెరుగైన రూపకల్పనను సూచించాలని శ్రీ గోయల్ ఎఫ్‌సిఐ అధికారులను ఆదేశించారు.
గోధుమలు మరియు వరి సేకరణకు సంబంధించిన సమస్యలపై సమీక్షిస్తూ..దాదాపు అన్ని రెవెన్యూ జిల్లాల పరిధిలో ఎఫ్‌సిఐ మరిన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని, తద్వారా రైతులు తమ ఉత్పత్తులను ఎఫ్‌సిఐకి లేదా మరేదైనా ఏజెన్సీకి విక్రయించుకునే అవకాశం ఉంటుందని ఆయన ఆదేశించారు. యూపీలోని కొనుగోలు కేంద్రాల్లో ఈ-పాప్ యంత్రాన్ని ఉపయోగించడం అభినందనీయమన్న మంత్రి రైతుల నుంచి కొనుగోలు విధానంలో మరింత పారదర్శకత తీసుకురావడానికి ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
ఉత్తరప్రదేశ్‌లోని డిమాండ్, జనాభా మరియు విస్తారమైన భౌగోళిక ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని, గోధుమల మార్కెట్ ధరలు నియంత్రించడానికి ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్‌లో ఎక్కువ మొత్తంలో గోధుమలను అందించాలని కేంద్ర మంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలోని స్టోరేజీ సామర్థ్యాలను సమీక్షించిన సందర్భంగా శ్రీ గోయల్ మాట్లాడుతూ..ఎఫ్‌సిఐకి చెందిన అన్ని గోడౌన్‌ల యాజమాన్య మరియు అద్దె రెండూ అత్యున్నత ప్రమాణాలు కలిగి ఉండాలని తెలిపారు. నాసిరకంగా ఉన్న అన్ని గోడౌన్‌లను తక్షణమే అవసరమైన మరమ్మతులు చేపట్టి అప్‌గ్రేడ్ చేయాలని లేకుంటే నియామకం కోసం పరిగణించాలని స్పష్టం చేశారు.
***
(Release ID: 1898864)