కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
యూనిఫైడ్ లైసెన్స్ కింద డిజిటల్ కనెక్టివిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ ఆథరైజేషన్ పరిచయంపై సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసిన ట్రాయ్
Posted On:
11 FEB 2023 2:37PM by PIB Hyderabad
యూనిఫైడ్ లైసెన్స్ (యుఎల్ - ఏకీకృత లైసెన్స్) కింద ఇంట్రడక్షన్ ఆఫ్ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ర్ఫాస్ట్రక్చర్ ప్రొవైడర్ ఆథరైజేషన్ (డిజిటల్ అనుసంధాన మౌలిక సదుపాయాలు అందచేసేందుకు అధికారమివ్వడాన్ని ప్రవేశపెట్టడం)పై సంప్రదింపుల పత్రాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా శనివారం విడుదల చేసింది.
దేశ వృద్ధి, శ్రేయస్సు కీలకమైన నిర్ణాయకాలుగా, సాధ్యత కలిగించే సేవలుగా, డిజిటల్ మౌలిక సదుపాయాలు అవతరిస్తున్నాయని డిజిటల్ కమ్యూనికేషన్ల పాలసీ (ఎన్‌డిసిపి-2018) డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రాధాన్యతను నొక్కి చెప్తుంది.
ప్రొపెల్ ఇండియా మిషన్ (భారత్‌ను ముందుకు నడిపించడం)ను నెరవేర్చేందుకు అవకలన లైసెన్సింగ్ ద్వారా భిన్న పొరలను (ఉదా- మౌలిక సదుపాయాలు, నెట్‌వర్క్, సేవలు, అప్లికేషన్ల పొర) అనుబంధ సంస్థలను బలోపేతం చేయాలని ఎన్‌డిసిపి-2018 ఉద్దేశ్యం.
బలమైన డిజిటల్ అనుసంధాన మౌలికసదుపాయాలు (డిసిఐ) అన్నది ఉత్పత్తిని పెంచడం, జీవన ప్రమాణాలను పెంచేందుకు సౌకర్యాలను అందించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి ప్రముఖంగా తోడ్పడుతుంది. డిసిఐ అభివృద్ధి నేపథ్యంలో వివిధ దేశాలు వనరులను (స్పెక్ట్రమ్ సహా) ఎక్కువగా విఇయోగించడం, ధరలను తగ్గించడం, పెట్టుబడులను ఆకర్షించడం, సేవల బట్వాడా రంగాన్ని బలోపేతం చేసేందుకు మౌలిక సదుపాయాలు/ నఎట్‌వర్క్ లేయర్ అండ్ సర్వీస్ / అప్లికేషన్ లేయర్లను విడివిడిగా పెట్టుకొని తమ టెలికాం లైసెన్సింగ్ చట్రాన్ని క్రమబద్ధం చేసుకున్నాయి. అటువంటి చట్రాల లాభం ఏమిటంటే, సాంకేతికతల కలయికను పరిగణనలోకి తీసుకొని, లైసెన్సింగ్ ప్రక్రియను సరళతరం చేసి, మార్కెట్ పెరిగేందుకు, సమాజ సామాజికఆర్థిక సంక్షేమం మెరుగుపడేందుకు అనువైన వాతావరణాన్ని అందిస్తున్నాయి.
డిజిటల్ ఇండియా కింద మేకిన్ ఇండియా, ఆయుష్మా్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం), స్మార్ట్ సిటీస్ అభివృద్ధి వంటి పలు ప్రభుత్వ పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో కీలక, ప్రధాన పాత్రను డిసిఐ పోలిస్తుంది. ఇటీవలే ప్రారంభించిన 5జి భారత్‌ను బ్రాడ్‌బ్యాండ్ సూపర్‌హైవేగా మార్చడమే కాక దేశ సామాజిక - ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఈ నేపథ్యంలో చురుకైన, సాత్వికమైన మౌలికసదుపాయాల సృష్టికి నూతన సంస్థలను, వ్యక్తులను అనుకూలమైన లైసెన్సింగ్ చట్రం ద్వారా ప్రోత్సహించడం ముఖ్యం. ఇది ఉమ్మడిగా పంచుకోదగిన డిసిఐ, నెట్‌వర్క్ వనరులు, ఖర్చు తగ్గడం, పెట్టుబడులను ఆకర్షించడం, సేవల బట్వాడా రంగాన్ని బలోపేతం చేయడం, పరిశ్రమ 4.0. విస్తరణ, వ్యవస్థాపకత రంగం, ఇతర రంగాలలోకి 5జి సేవల విస్తరణకు ఇది ఉత్రేరకంగా నిరూపితమవుతుంది. ఇటీవలే, ట్రాయ్ చట్టం, 1997లోని సెక్షన్ 11 (1) (ఎ) కింద టెలికాం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లైసెన్స్ (టిఐఎల్), అటువంటి లైసెన్స్ నిబంధనలు, షరతులు, వర్తించదగిన లైసెన్స్ ఫీజు తదితరాల పేరుతో ఒక కొత్త వర్గపు లైసెన్సును సృష్టించే విషయమై సూచనలను కోరుతూ ట్రాయ్ 11.08.2022న డిఒటి నుంచి ఒక ప్రస్తావనను అందుకుంది.
యూనిఫైడ్ లైసెన్స్ (యుఎల్ - ఏకీకృత లైసెన్స్) కింద ఇంట్రడక్షన్ ఆఫ్ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ర్ఫాస్ట్రక్చర్ ప్రొవైడర్ ఆథరైజేషన్ (డిజిటల్ అనుసంధాన మౌలిక సదుపాయాలు అందచేసేందుకు అధికారమివ్వడాన్ని ప్రవేశపెట్టడం)పై సంప్రదింపుల పత్రం ఉద్దేశం ఏకీకృత లైసెన్స్ (యుఎల్) కింద ప్రతిపాదిత డిసిఐపి ఆథారైజేషన్ గురించి భాగస్వాముల నుంచి అభిప్రాయాలను కోరడం దీని ఉద్దేశ్యం. ఈ సంప్రదింపుల పత్రాన్ని ట్రాయ్ వెబ్‌సైట్ డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. గవ్. ఇన్‌ను ఉంచారు. భాగస్వాములందరి నుంచి సంప్రదింపుల పత్రంపై లిఖిత వ్యాఖ్యలను, 09 మార్చి, 2023 నాటికి, ప్రతి వ్యాఖ్యలను 23 మార్చి 2023నాటికి పంపవలసిందిగా ఆహ్వానించింది.
ఈ వ్యాఖ్యలను ప్రధానంగా ఎలక్ట్రానిక్ రూపంలో advbbpa@trai.gov.inకు, jtadvbbpa-1@trai.gov.in.కు కాపీని పంపవలసిందిగా కోరింది. ఏదైనా స్పష్టీకరణ/ సమాచారం కోసం ట్రాయ్ సలహాదారు (బ్రాడ్‌బ్యాండ్ అండ్ పాలసీ అనాలసిస్) శ్రీ సంజీవ్ కుమార్ శర్మను టెలిఫోన్ నెంబర్ + 91-11-23236119కి ఫోన్ చేసి సంప్రదింపవచ్చు.
***
(Release ID: 1898453)
Visitor Counter : 162