వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గోధుమ పిండి ధర తగ్గించడానికి గోధుమ రిజర్వ్ ధరలు తగ్గించిన కేంద్రం


ఎన్సీసీఎఫ్/నాఫెడ్/కేంద్రీయ భండార్/రాష్ట్ర ప్రభుత్వ సహకార సంఘాలు/సమాఖ్యలకు విక్రయిస్తున్న కిలో గోధుమ ధర రూ.21.50కి తగ్గింపు

గోధుమలను పిండిగా మార్చి కిలోకు రూ.27.50 మించకుండా ఎంఆర్పీకి విక్రయించే ఎన్సీసీఎఫ్/ నాఫెడ్/ కేంద్రీయ భండార్/ రాష్ట్ర ప్రభుత్వ సహకార సంఘాలు/ సమాఖ్యలకు మాత్రమే రాయితీ రేటు వర్తింపు

బహిరంగ మార్కెట్ విక్రయ పథకం సాధారణ నాణ్యత గల గోధుమల అమ్మకానికి రిజర్వ్ ధర క్యూటీఎల్ (జాతీయ) రూ.2350గా, ఎలాంటి రవాణా ఖర్చులేకుండా యుఆర్ఎస్ గోధుమలకు రూ. 2300/ క్యూటీఎల్ (జాతీయ)ధర నిర్ణయం

Posted On: 10 FEB 2023 7:48PM by PIB Hyderabad

గోధుమలు,గోధుమ పిండి ధరలు తగ్గించడానికి ఆహార ప్రజా పంపిణీ విభాగం ఒఎంఎస్ఎస్ కింద గోధుమల అమ్మకానికి రిజర్వ్ ధర ఎఫ్ఎక్యూకు రూ .2350 / క్యూటిఎల్ (జాతీయ) , రబీ మార్కెట్ సీజన్ 2023-24 తో సహా అన్ని పంటల యుఆర్ఎస్ గోధుమలకు రూ .2300 / క్యూటిఎల్ (జాతీయ) గా నిర్ణయించింది.ఆర్థిక మంత్రిత్వ శాఖను సంప్రదించి  ఆహార ప్రజా పంపిణీ విభాగం ఈ నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రజా పంపిణీ విభాగం తీసుకున్న నిర్ణయం దేశంలో అన్ని ప్రాంతాల్లో సాధారణ ప్రజలకు సరసమైన ధరకు గోధుమలను సరఫరా చేయడానికి సహాయపడుతుంది.
అదనంగా, రాష్ట్రాలు ఈ-వేలంలో పాల్గొనకుండా తమ సొంత పథకానికి గోధుమలను రిజర్వ్ ధరల కంటే ఎక్కువ ధరకు భారత ఆహార సంస్థ నుంచి కొనుగోలు చేయడానికి అనుమతులు పొందుతాయి.
ఎన్సీసీఎఫ్/నాఫెడ్/కేంద్రీయ భండార్/రాష్ట్ర ప్రభుత్వ సహకార సంఘాలు/ సమాఖ్యలకు, వలస కూలీలు/ బలహీన వర్గాలకు సహాయ శిబిరాలు నిర్వహిస్తున్న  కమ్యూనిటీ కిచెన్/చారిటబుల్/ఎన్జీవో లకు విక్రయిస్తున్న గోధుమల ధరను కిలోకు రూ.21.50కి తగ్గించారు.
గోధుమలను పిండిగా మార్చి కిలోకు రూ .27.50 మించకుండా ఎమ్మార్పీ తో ప్రజలకు  విక్రయిస్తున్న ఎన్సీసీఎఫ్/ నాఫెడ్/ కేంద్రీయ భండార్/ రాష్ట్ర ప్రభుత్వ సహకార సంఘాలు/ ఫెడరేషన్లు మొదలైన వాటికి ఈ రాయితీ రేటు వర్తిస్తుంది.
నిత్యావసర వస్తువుల ధరలను సమీక్షించడానికి  హోం మంత్రి శ్రీ అమిత్ షా అధ్యక్షతన మంత్రుల కమిటీ సమావేశం 25.01.2023 న జరిగింది. బహిరంగ మార్కెట్ అమ్మకాల పథకం (ఓఎంఎస్ఎస్) ద్వారా భారత ఆహార  సంస్థ నిల్వల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను విడుదల చేయాలని కమిటీ నిర్ణయించింది.
భారత ఆహార  సంస్థ అనుసరించే సాధారణ ప్రక్రియ ప్రకారం వ్యాపారులు, పిండి మిల్లులు మొదలైన వాటికి ఈ-వేలం ద్వారా 25 ఎల్ఎంటిని అందిస్తారు. వేలంలో ఒక్కో ప్రాంతానికి గరిష్టంగా 3000 మెట్రిక్ టన్నుల వరకు బిడ్డర్లు ఈ-వేలంలో పాల్గొనవచ్చు.
ఈ-వేలం లేకుండా/రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం 2 ఎల్ఎంటీ గోధుమలు సరఫరా చేయాలని సమావేశం నిర్ణయించింది. ప్రతి రాష్ట్రం. కెంరపాలిట ప్రాంతానికి 10,000 మెట్రిక్ టన్నులు చొప్పున సరఫరా చేస్తారు.
కేంద్రీయ భండార్/ ఎన్సీసీఎఫ్/ నాఫెడ్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు / సహకార సంఘాలు/ సమాఖ్యలకు ఈ-వేలంతో సంబంధం లేకుండా 3 ఎల్ఎంటీ గోధుమలు సరఫరా చేస్తారు. అయితే, గోధుమలను అపిండిగా మార్చి కిలోకు రూ.29.50 మించకుండా  ప్రజలకు అందించే సంస్థలకు మాత్రమే ఈ రాయితీ రేటు వర్తిస్తుంది.
 కేంద్రీయ భండార్/ నాఫెడ్/ ఎన్సీసీ ఎఫ్ నుంచి అందిన ప్రతిపాదనల మేరకు  3 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను విడుదల చేయాలని సమావేశం నిర్ణయించింది. . కేంద్రీయ భండార్, నాఫెడ్, ఎన్సీసీ ఎఫ్ లకు వరుసగా 1.32 ఎల్ఎంటీ, 1 ఎల్ఎంటీ, 0.68 ఎల్ఎంటీ గోధుమలు కేటాయించారు.
2023 ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జరిగిన మొదటి ఈ-వేలం సందర్భంగా వ్యాపారులు, పిండి మిల్లులు మొదలైన వారికి 25 లక్షల మెట్రిక్ టన్నులలో 9.26 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను భారత ఆహార సంస్థ విక్రయించింది.
ఓఎంఎస్ఎస్ విధానాన్ని ప్రకటించిన తరువాత కూడా గోధుమల మార్కెట్ ధరలు ఎక్కువగా ఉన్నాయని భారత ప్రభుత్వం గమనించింది. ఓఎంఎస్ఎస్ కింద వేలం కోసం బేస్ ధరల్లో సరుకు రవాణా చార్జీలు  చేర్చడం వల్ల, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ లకు దూరంగా ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈశాన్య ప్రాంతం, తూర్పు ప్రాంతం, దక్షిణ ప్రాంతంలో వేలం రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని సమావేశం గుర్తించింది.

***


(Release ID: 1898352) Visitor Counter : 215


Read this release in: English , Urdu , Gujarati