పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ ఒకదానికొకటి విరుద్ధం కాదు .. వాస్తవానికి రెండు వ్యవస్థలు ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్నాయన్న అంశాన్ని భారతదేశం నిరూపిస్తోంది... శ్రీ హర్దీప్ సింగ్ పూరి
గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను నెరవేర్చడానికి భారతదేశం సామర్థ్యం కలిగి ఉంది: శ్రీ పూరీ
'లైఫ్' విధానం ప్రధాన అంశాలు అమలు చేసి ప్రపంచ స్థాయిలో సుస్థిర జీవనాన్ని ప్రోత్సహించడానికి జి 20 దేశాల వర్కింగ్ గ్రూప్ సహకరిస్తుంది .. శ్రీ పూరి
प्रविष्टि तिथि:
10 FEB 2023 11:07AM by PIB Hyderabad
భారతదేశం అధ్యక్షతన ఈ రోజు బెంగళూరులో జరిగిన జీ- 20 పర్యావరణ మరియు వాతావరణ సుస్థిరత వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశానికి జీ-20 దేశాలు, అతిథి దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, ఇతర ప్రముఖులకు వీడియో సందేశం ద్వారా కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి స్వాగతం పలికారు.
భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న టర్కీ దేశ ప్రజలకు సానుభూతి తెలిపిన శ్రీ పూరి కష్టకాలంలో డ్ దేశ ప్రజలకు భారతదేశం అండగా ఉంటుందని అన్నారు. మానవతా దృక్పధంతో టర్కీ దేశానికి భారతదేశం అండగా ఉండి అవసరమైన మానవతా , వైద్య సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. కష్ట కాలంలో టర్కీ దేశానికి ప్రపంచ దేశాలు,ప్రజలు అండగా ఉండడం పట్ల శ్రీ పూరి హర్షం వ్యక్తం చేశారు.ఒకరికి ఒకరు అండగా నిలవాలన్న స్ఫూర్తితో జీ-20 సమావేశం జరుగుతుందని అన్నారు. ఈ ఏడాది 'వసుధైవ కుటుంబకం - ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే నినాదంతో జీ-20 పని చేస్తుందని అన్నారు. సార్వజనీన ఏకత్వ భావన ను పెంపొందించడానికి ప్రతినిధులందరూ సమావేశమయ్యారని ఆయన చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేస్తూ శ్రేయస్సు, సంక్షేమం పెంపొందించే సమ్మిళిత, ప్రతిష్టాత్మక, కార్యాచరణ ఆధారిత ఎజెండాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
పర్యావరణం, సుస్థిర పర్యావరణ అభివృద్ధిపై ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ సమావేశంలో శ్రీ పురి ప్రసంగించారు. క్షీణిస్తున్న జీవవైవిద్యం, పర్యావరణం వల్ల అనవసర ఖర్చులు పెరుగుతున్నాయని, జీవితంలో సంక్లిష్ట పరిస్థితులు ఏర్పడుతున్నాయని మంత్రి అన్నారు. వాతావరణ మార్పులు, జీవవైవిద్య నాశనం వల్ల కలుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా సమిష్, క్రమబద్ధమైన చర్యలు అమలు జరగాలన్న అభిప్రాయాన్ని శ్రీ పూరి వ్యక్తం చేశారు. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల వాటా కలిగిన ఉన్న జీ-20 దేశాలు నిబద్ధత, దూరదృష్టితో పనిచేయాల్సి ఉంటుందని అన్నారు.
సమస్య పరిష్కారం కోసం ప్రపంచ దేశాలు ముఖ్యంగా గ్లోబల్ సౌత్ జీ -20లో జరిగే చర్చలు, అమలు చేసే కార్యక్రమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయని శ్రీ పూరి పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలను వాతావరణ సంక్షోభం, రుణ సంక్షోభం నుంచి రక్షించడానికి జీ-20 దేశాలు ఏకాభిప్రాయంతో పని చేయాలని ఆయన కోరారు.
గ్లోబల్ సౌత్ దేశాల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడానికి భారతదేశం సిద్ధంగా ఉందని శ్రీ పూరి అన్నారు.పర్యావరణ పరిరక్షణ కోసం గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందన్నారు. గ్లాస్గో లో జరిగిన కాప్-26 సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన పంచామృత కార్యాచరణ ప్రణాళికను శ్రీ పూరి ఈ సందర్భంగా ప్రస్తావించారు. 2070 నాటికి భారత్ నికర శూన్య ఉద్గారాల విడుదల లక్ష్యాన్ని సాధిస్తుందని శ్రీ పూరి ప్రకటించారు. ఒక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అతి తక్కువ కాలంలో గరిష్ట ఉద్గారాల విడుదల స్థాయి నుంచి నికర శూన్య స్థాయికి చేరే తొలి దేశంగా భారతదేశం అవతరిస్తుందని అన్నారు. ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ ఒకదానికొకటి విరుద్ధంగా లేవని, వాస్తవానికి మౌలికంగా రెండు వ్యవస్థలు కలిసి పనిచేస్తున్నాయని భారతదేశం నిరూపిస్తోంది అని శ్రీ పురి అన్నారు.
ఈ సంవత్సరం మాంట్రియల్ షర్మ్ ఎల్-షేక్ లో జరిగిన కాప్ -27, జీవవైవిధ్య సదస్సులో ఆమోదించిన తీర్మానాలు కార్యరూపం దాల్చడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను జీ-20 వర్కింగ్ గ్రూప్ సిద్ధం చేస్తుందని శ్రీ పూరి తెలిపారు.సహజ వనరుల వినియోగం అంశంలో ప్రపంచ దేశాల ఆలోచనా దృక్పథం మారేలా చూడడానికి వర్కింగ్ గ్రూప్ దోహదపడుతుందని ఆయన అన్నారు.
పర్యావరణ హిత జీవనశైలిని అలవరచుకోవడం తప్పనిసరి అని శ్రీ పూరి స్పష్టం చేశారు. ఈ వర్కింగ్ గ్రూప్ లో చర్చించడానికి గుర్తించిన మూడు గు ప్రాధాన్యతా రంగాలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్ (లైఫ్ ) మిషన్ కు అనుగుణంగా ఉన్నాయని శ్రీ పురి అన్నారు.
లైఫ్ ప్రతిపాదించిన ప్రధాన విధానాలు అమలు చేసి ప్రపంచ స్థాయిలో సుస్థిర జీవనాన్ని ప్రోత్సహించడానికి జీ-20 దేశాల వర్కింగ్ గ్రూప్కృషి చేయాలనీ శ్రీ పురి అన్నారు. పర్యావరణాన్ని, వాతావరణాన్ని పరిరక్షించడానికి సహజ వనరులను అవసరాల మేరకు మాత్రమే ఉపయోగించాలని, సహజ వనరుల వృధాను అరికట్టాలని లైఫ్ లో భారతదేశం సూచించిన అంశాన్ని శ్రీ పూరి గుర్తు చేశారు.
సమావేశంలో పర్యావరణం, పర్యావరణహిత పథకాల అమలుకు నిధుల సేకరణ లాంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగి ఏకాభిప్రాయం కుదురుతుందన్న ఆశాభావాన్ని శ్రీ పూరి వ్యక్తం చేశారు.
***
(रिलीज़ आईडी: 1898149)
आगंतुक पटल : 262