జల శక్తి మంత్రిత్వ శాఖ
నీటి లభ్యతను పెంచడానికి, నీటి సంరక్షణను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు
Posted On:
09 FEB 2023 1:15PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం నీటి లభ్యత, దాని సంరక్షణ, పంపిణీ కోసం అనేక పథకాలను ప్రారంభించింది. వివిధ పథకాలు/కార్యక్రమాలను ప్రారంభించింది. కొన్ని ప్రధాన పథకాలు/ ప్రోగ్రామ్‌ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:
(i) నీటి సంరక్షణ, వృధాను తగ్గించడం సమీకృత నీటి వనరుల అభివృద్ధి, నిర్వహణ ద్వారా రాష్ట్రాలు అంతటా, లోపల దాని మరింత సమానమైన పంపిణీని నిర్ధారించే లక్ష్యంతో జాతీయ నీటి మిషన్ ప్రారంభించారు.
ఈ మిషన్ కింద, డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా, తక్కువ నీటిని వినియోగించే వ్యవసాయ పంటలకు అనుకూలంగా, వ్యవసాయంలో నీటిని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేలా రైతులను ప్రోత్సహించడానికి "సహి ఫసల్" అనే ప్రచార కార్యక్రమం కూడా ప్రారంభించింది.
అలాగే, వివిధ రకాల నీటి సంబంధిత అంశాలపై పాల్గొనే వారి మధ్య సంభాషణ, సమాచార భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, అవగాహన కల్పించడానికి, వాటాదారుల సామర్థ్యాలను పెంపొందించడానికి నీటి పొదుపు, పరిరక్షణలో చురుకుగా పాల్గొనేలా ప్రజలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన నెలవారీ సెమినార్ సిరీస్ - “వాటర్ టాక్” ప్రారంభం అయింది.
(ii) అటల్ భూజల్ యోజన, కేంద్ర రంగ పథకం, సమాజ భాగస్వామ్యం, డిమాండ్ వైపు జోక్యాలు, స్థిరమైన భూగర్భ జల నిర్వహణ కోసం కొనసాగుతున్న పథకాల కలయికపై దృష్టి సారించి ఏడు రాష్ట్రాలు - గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లో 2020 ఏప్రిల్ 1 నుండి అమలు జరుగుతున్నాయి. . ,
(iii) హర్ ఖేత్ కో పానీ (హెచ్కేకేపి), ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంకేఎస్వై ), రిపేర్, రినోవేషన్ అండ్ రిస్టోరేషన్ (ఆర్ఆర్ఆర్) వాటర్ బాడీస్ స్కీమ్ ప్రారంభించారు. ఇది నీటి వనరుల అభివృద్ధి, పునరుద్ధరణ ద్వారా నీటిపారుదల సామర్థ్యాన్ని పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ట్యాంక్ నిల్వ సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా, భూగర్భ జలాలను రీఛార్జ్ చేయడం, త్రాగునీటి లభ్యత పెరగడం, ట్యాంక్ కమాండ్‌ల క్యాచ్‌మెంట్‌ను మెరుగుపరచడం మొదలైన బహుళ లక్ష్యాలతో ఈ పథకం ప్రారంభమైంది.
(iv) పునరుజ్జీవనం, పట్టణ పరివర్తన కోసం అటల్ మిషన్ (అమృత్) కేంద్ర ప్రభుత్వంచేత జూన్ 25, 2015న దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 500 నగరాలు, పట్టణాలలో 5 సంవత్సరాల వ్యవధిలో అంటే 2015-2016 ఆర్థిక సంవత్సరం నుండి 2019 -2020,వరకు చేపట్టడం జరిగింది. అప్పటికే పనులు ప్రారంభమైన ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికిపొడిగించారు. మిషన్ నగరాల్లో నీటి సరఫరా, మురుగునీటి పారుదల, సీపేజ్ నిర్వహణ, వరద నీటి డ్రైనేజీ , హరిత ప్రదేశాలు, ఉద్యానవనాలు, మోటారు రహిత పట్టణ రవాణా రంగాలలో ప్రాథమిక పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై మిషన్ దృష్టి సారించింది.
(v) జల్ జీవన్ మిషన్-హర్ ఘర్ జల్‌ను భారత ప్రభుత్వం, ఆగస్టు, 2019 నుండి రాష్ట్రాల భాగస్వామ్యంతో అమలు చేస్తోంది, దీని లక్ష్యం నిర్దేశించిన నాణ్యత (బిఐఎస్ : 10500) 2024 నాటికి ప్రతి గ్రామీణ గృహానికి కుళాయి నీటి కనెక్షన్ ద్వారా రెగ్యులర్, దీర్ఘకాలిక ప్రాతిపదికన నీరు సరఫరా చేయాలి.
ఆగస్టు 2019లో జల్ జీవన్ మిషన్ ప్రకటించే సమయానికి, 3.23 కోట్ల (17%) గ్రామీణ కుటుంబాలు కుళాయి నీటి కనెక్షన్‌లను కలిగి ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటివరకు, 06.02.2023 నాటికి రాష్ట్రాలు/యూటీలు నివేదించిన ప్రకారం, జేజేఎం కింద గత మూడున్నరేళ్లలో దాదాపు 7.87 కోట్ల గ్రామీణ కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్లు అందించారు. ఈ విధంగా, 06.02.2023 నాటికి, దేశంలోని 19.36 కోట్ల గ్రామీణ కుటుంబాలలో, దాదాపు 11.10 కోట్ల (57%) కుటుంబాలు తమ ఇళ్లలో కుళాయి నీటి సరఫరాను కలిగి ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
(vi) నీటి సంరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, పునరుద్ధరణ వంటి జోక్యాల వేగవంతమైన అమలుపై దృష్టి సారించడం ద్వారా నీటి సంరక్షణ, నీటి వనరుల నిర్వహణను ప్రోత్సహించడానికి 256 నీటి ఒత్తిడి జిల్లాల్లో 2019లో జల శక్తి అభియాన్-I (జెఎస్ఏ-I) ప్రారంభించారు. సాంప్రదాయ, ఇతర నీటి వనరులు/ట్యాంకులు, బోరు బావుల పునర్వినియోగం, రీఛార్జ్, వాటర్‌షెడ్ అభివృద్ధి మరియు తీవ్రమైన అటవీ నిర్మూలనపై దృష్టి సారించారు.
ఇంకా, 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో 2021-22 నుండి 2025-26 వరకు, నీరు, పారిశుద్ధ్య సంబంధిత కార్యకలాపాలకు 60 శాతం గ్రాంట్‌లను కేటాయించింది, ఇందులో 50 శాతం నీటి భాగం గ్రామీణ స్థానిక సంస్థలు/ పంచాయతీ రాజ్ సంస్థలు ఉపయోగించాలి.
ఈ సమాచారాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈరోజు లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
(Release ID: 1897843)
Visitor Counter : 200