వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
తప్పుదోవ పట్టించే ప్రకటనలను అరికట్టడానికి ,ప్రకటనల ద్వారా దోపిడీకి గురయ్యే లేదా ప్రభావితమయ్యే వినియోగదారులను రక్షించడానికి తప్పుదారి పట్టించే ప్రకటనలు, ప్రచారం కోసం మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
प्रविष्टि तिथि:
08 FEB 2023 5:28PM by PIB Hyderabad
వినియోగదారుల రక్షణ చట్టం, 2019 లోని సెక్షన్ 18 ద్వారా సంక్రమించిన అధికారాల మేరకు వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిటి ప్రకటనలకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తప్పుదోవ పట్టించే ప్రకటనల జారీని అరికట్టడానికి, తప్పుదోవ పట్టించే విధంగా ఉన్న ప్రకటనల కోసం ప్రచారం చేయడం లాంటి అంశాలకు సంబంధించి 2022 జూన్ 9, 2022న మార్గదర్శకాలు జారీ అయ్యాయని మంత్రి వివరించారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలను అరికట్టడం, అటువంటి ప్రకటనల వల్ల వినియోగదారులు దోపిడీకి గురి కాకుండా చూసి వారి ప్రయోజనాలు రక్షించడం లక్ష్యంగా కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిటి మార్గదర్శకాలను జారీ జేసింది. ఈ మార్గదర్శకాలు ప్రకటనకు అనుకూలంగా ప్రచారం చేసే ఒక వ్యక్తి లేదా సంస్థ అభిప్రాయం, నమ్మకం, నిర్ణయం లేదా అనుభవం వంటి అంశాలు ఏదైనా వస్తువులు, ఉత్పత్తి లేదా సేవకు వర్తిస్తాయి.
ప్రకటనలకు ప్రచారం చేయడానికి ఆమోదం తెలిపే ముందు తగిన శ్రద్ధ అవసరమని ఈ మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి.ఒక ప్రకటనకు ఆమోదం తెలిపి, అనుకూలంగా ప్రచారం చేసే వ్యక్తి, వ్యక్తులు లేదా సంస్థ నిజమైన, సహేతుకమైన ప్రస్తుత అభిప్రాయాన్ని ప్రతిబింబించాలి. ప్రకటనకు సంబంధించి తగిన సమాచారం లేదా అనుభవం కలిగి ఉండాలి. గుర్తించిన వస్తువులు, ఉత్పత్తి లేదా సేవ మోసం చేసే విధంగా ప్రస్తుతానికి అమలులో ఉన్న ఏదైనా చట్టం ప్రకారం ఏ ప్రకటనలో కనిపించ కుండా నిషేధించబడిన భారతీయ నిపుణులు, అటువంటి వృత్తికి చెందిన విదేశీ నిపుణులు భారతదేశంలో నివసిస్తున్న వ్యక్తి లేదా మరేదైనా అటువంటి ప్రకటనకు ప్రచారం చేయడానికి అనుమతి లభించదు.
వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 21(2) ప్రకారం తప్పుడు లేదా తప్పుదారి పట్టించే ప్రకటనల విషయంలో పదేపదే ఉల్లంఘనలకు పాల్పడితే రూ.10 లక్షలు లేదా రూ.50 లక్షల వరకు .తయారీదారు లేదా ఎండార్సర్‌పై కేంద్ర వినియోగదారుల హక్కుల పరిరక్షణ కమిటి జరిమానా విధించవచ్చు.
****
(रिलीज़ आईडी: 1897593)
आगंतुक पटल : 205