అంతరిక్ష విభాగం
ఇప్పటి వరకు అంతరిక్ష రంగంలో 135 ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌జీఈ) నుండి ఇన్-స్పేస్‌కి 135 దరఖాస్తులు అందాయని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
ఎన్‌జీఈలలో విదేశీ పెట్టుబడులను సులభతరం చేయడానికి అంతరిక్ష రంగంలో సవరించిన ఎఫ్‌డిఐ విధానం మరియు జాతీయ అంతరిక్ష విధానాలు ప్రభుత్వ తుది ఆమోదం ప్రక్రియలో ఉన్నాయి.
ప్రయోగ సేవలు, డేటా విక్రయాలు మరియు ఇన్-ఆర్బిట్ సపోర్ట్ సర్వీసెస్ మరియు పోస్ట్-లాంచ్ ఆపరేషన్ల ఎగుమతి ద్వారా 2021-22 లో రూ.175 కోట్లు వచ్చాయి: డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
08 FEB 2023 4:12PM by PIB Hyderabad
అంతరిక్ష రంగంలోని 135 ప్రభుత్వేతర సంస్థల (ఎన్‌జీఈలు) నుండి ఇన్-స్పెస్‌కి ఇప్పటి వరకు 135 దరఖాస్తులు అందాయని కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) ; ఎర్త్ సైన్సెస్ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) ; ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు తెలియజేసారు.
స్పేస్ స్టార్ట్ అప్‌లపై ఈ రోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ జితేంద్ర సింగ్ ఒక ప్రకటన విడుదల చేశారు. అలాగే భారతీయ అంతరిక్ష రంగానికి సంబంధించిన కొత్త సీడ్ ఫండ్ పథకాన్ని ఇన్-స్పేస్ బోర్డు ఆమోదించిందని తెలియజేసారు.
ఎన్‌జిఇలలో విదేశీ పెట్టుబడులను సులభతరం చేయడానికి అంతరిక్ష రంగంలో సవరించిన ఎఫ్‌డిఐ విధానం మరియు జాతీయ అంతరిక్ష విధానానికి సంబంధించి ప్రభుత్వ తుది ఆమోదం ప్రక్రియలో ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
దేశంలో స్పేస్ టెక్ ఆధారిత పరిశ్రమలో జరిగిన మొత్తం దిగుమతులు మరియు ఎగుమతుల వివరాల ప్రశ్నపై స్టేట్‌మెంట్ ఇస్తూ 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ ప్రాజెక్టులు/కార్యక్రమాలను అమలు చేయడం కోసం రూ. 2,114 కోట్లు (సుమారు) దిగుమతి చేయబడ్డాయని తెలిపారు.
దిగుమతి చేసుకున్న ప్రధాన వస్తువులలో ఈఈఈ భాగాలు, అధిక శక్తి గల కార్బన్-ఫైబర్‌లు, స్పేస్ క్వాలిఫైడ్ సోలార్ సెల్‌లు, డిటెక్టర్లు, ఆప్టిక్స్, పవర్ యాంప్లిఫైయర్‌లు మొదలైనవి ఉన్నాయి.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రయోగ సేవలు, డేటా విక్రయాలు మరియు ఇన్-ఆర్బిట్ సపోర్ట్ సర్వీసెస్ మరియు పోస్ట్-లాంచ్ కార్యకలాపాల ఎగుమతికి రూ.174.90 కోట్లు సమకూరింది.
02.10.2021 నాటి గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం భారతదేశంలోని అంతరిక్ష రంగంలో ప్రభుత్వేతర సంస్థలను ప్రోత్సహించడం, ప్రారంభించడం, అధికారం ఇవ్వడం మరియు పర్యవేక్షించడం కోసం ఇన్-స్పెస్ తప్పనిసరి చేయబడిందని ప్రకటన పేర్కొంది. ప్రైవేట్ కంపెనీలు/స్టార్టప్‌ల కోసం ఇస్రో సౌకర్యాల వినియోగం, ఇస్రో క్యాంపస్‌లలో సౌకర్యాల ఏర్పాటు, ఉపగ్రహాలు మరియు ప్రయోగ వాహనాల లాంచ్ మరియు మెంటర్‌షిప్ మద్దతు కోసం ఇన్-స్పేస్ భారతీయ అంతరిక్ష సంస్థలకు అధికారం ఇవ్వడం ప్రారంభించింది. స్పేస్ సెక్టార్ సంస్కరణల ప్రకటనతో ప్రైవేట్ ప్లేయర్స్ స్పేస్ ఎకానమీకి సహకారం అందించడం ప్రారంభించారు. తద్వారా వారి వాటా పెరుగుతోంది.
<><><><><>
(Release ID: 1897591)
Visitor Counter : 263