కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఐఈఈఈ సి-డాట్ గుర్తించిన టెలికాం ఎక్స్ పర్ట్ ప్రోగ్రామ్ (ఐసీసీటీపీ)ను ప్రారంభించిన శ్రీ కె.రాజారామన్

సి-డాట్, ఐఈఈఈ కలిసి ప్రవేశపెట్టిన ఐసిసిటిఇపి

విభిన్న రంగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞాన అంశాల్లో శిక్షణ అందించడం లక్ష్యంగా ఐసిసిటిఇపి రూపకల్పన

Posted On: 08 FEB 2023 9:35AM by PIB Hyderabad
ఐఈఈఈ సి-డాట్ గుర్తించిన టెలికాం ఎక్స్ పర్ట్ ప్రోగ్రామ్ (ఐసీసీటీపీ)నుకేంద్ర కార్యదర్శి ( టెలికాం), డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ శ్రీ కె.రాజారామన్ ప్రారంభించారు.నైపుణ్యాభివృద్ధి, 5జీ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్ వంటి టెలికాం రంగాలలో అభ్యసన అవకాశాలు అందుబాటులోకి తీసుకు రావడానికి ఐఈఈఈ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్), సీ-డాట్ (సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్) సహకారంతో 'ఐఈఈఈ సి-డాట్ సర్టిఫైడ్ టెలికాం ఎక్స్పర్ట్ ప్రోగ్రామ్ (ఐసీసీటీఈపీ)'ను రూపొందించాయి. 'నెక్ట్స్ జనరేషన్ కనెక్టివిటీ' అనే అంశంపై ఐఈఈఈ స్టాండర్డ్స్ అసోసియేషన్ (ఐఈఈఈ ఎస్ ఏ) నిన్న నిర్వహించిన వర్క్ షాప్ లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.  


ఐసిసిటిఇపిలో ప్రసంగిస్తున్న టెలికాం శాఖ కార్యదర్శి శ్రీ కె. .రాజారామన్



ఐసిసిటిఇపిని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన  శ్రీ కె.రాజారామన్ పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక అభివృద్ధి, ప్రామాణీకరణ రంగాల్లో  సి-డాట్ ఐఈఈఈ కలిసి పని చేస్తున్నాయని తెలిపారు. సి-డాట్ ఐఈఈఈ సాధించిన విజయాలు, అమలు చేసిన కీలక కార్యక్రమాలను వివరించారు. ఐసిసిటిఇపి లో ప్రపంచ స్థాయి టెలికాం సంస్థలు, సంఘాలు సభ్యత్వం కలిగి ఉన్నాయని అన్నారు. భాగస్వామ్యంతో ప్రపంచవ్యాప్త పరిధిని కలిగి ఉన్న వంటి నాణ్యమైన అభ్యాసం మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల యొక్క కీలక అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.వినియోగదారుల అవసరాల మేరకు టెలికాం ఉత్పత్తులను మరింత ప్రామాణికంగా, సురక్షితంగా, చౌకగా ఉత్పత్తి చేయడానికి నైపుణ్యం, అధ్యయనం అవసరం శ్రీ కె. .రాజారామన్ అన్నారు. శిక్షణ, అధ్యయన రంగాల్లో  ఐఈఈఈతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.

 


సమావేశంలో మాట్లాడుతున్న సి-డాట్ సీఈఓ డాక్టర్ రాజ్ కుమార్ ఉపాధ్యాయ్



విద్యారంగం, పరిశ్రమలు, అంకుర సంస్థలు, ఐఈఈఈ వంటి ప్రపంచ స్థాయి టెలికాం సంస్థలతో కలిసి పని చేస్తున్నామని సీ-డాట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ తెలిపారు. అందరికి ప్రయోజనం కలిగించే విధంగా  సీ-డాట్  నూతన సహకార విధానాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. శిక్షణ రంగంలో ఎదురవుతున్న సమస్యలు గుర్తించి సులభంగా అర్థమయ్యే రీతిలో అధునాతన సాంకేతిక అంశాలపై శిక్షణ కోర్సులను ఐసిసిటిఇపి ప్రారంభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 6జీ, క్వాంటమ్ కమ్యూనికేషన్, సైబర్ సెక్యూరిటీ తో సహా టెలికాం రంగంలో అభివృద్ధి చెందుతున్న ఇతర రంగాల్లో ప్రత్యేక కోర్సులను సి-డాట్,  ఐఈఈఈ కలిసి ప్రారంభిస్తాయని ఆయన వివరించారు.

 


సి-డాట్,  ఐఈఈఈ మధ్య అమలు జరుగుతున్న సహకారాన్ని మరింత పటిష్టం చేయడానికి  ఐసిసిటిఇపి సహకరిస్తుంది . ఐసిసిటిఇపి  ద్వారా  టెలికాం రంగంలో  విభిన్న అంశాల్లో లో నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రత్యేకంగా రూపొందించిన సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ను అందిస్తుంది. అంతర్జాతీయంగా పోటీపడే టెలికాం సంస్థలు, సమస్య పరిష్కార సంస్థలను అభివృద్ధి చేయడంలో విద్యార్థులు, విద్యావేత్తలు, సాంకేతిక నిపుణులు, పరిశ్రమలు, స్టార్టప్ లు, ఇతర సంబంధిత భాగస్వాముల భాగస్వామ్యాన్ని వేగవంతం చేసే నైపుణ్యాలను పెంపొందించే అంశంపై కార్యక్రమం ప్రధానంగా దృష్టి సారిస్తోంది. దీనిలో భాగంగా 5 జి మరియు అంతకు మించిన రంగంలో మొదటి కార్యక్రమం ప్రారంభమైంది.

'టెలికమ్యూనికేషన్ కోర్సులను కలిసి ప్రారంభించడం, విద్యార్థులు, నిపుణులను ప్రోత్సహించి శిక్షణ ఇవ్వడం, ఉద్యోగ అవకాశాలు కల్పించడం, డిజిటల్ అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా రెండు సంస్థలు పనిచేస్తాయి. వైర్లెస్, ఆప్టికల్, సమాచారం, టెలికాం వాలిడేషన్, భద్రత రంగాల్లో  యువ నిపుణులను ఐఈఈఈ బ్లెండెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (బీఎల్పీ) సిద్ధం చేస్తుంది" అని ఐఈఈఈ ఇండియా ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్ శ్రీకాంత్ చంద్రశేఖరన్ తెలిపారు.
పరిశ్రమ వర్గాలతో విస్తృత చర్చలు జరిపిన తర్వాత నిపుణులు బిఎల్పి సర్టిఫికేషన్ కోర్సును రూపొందించారు. పరిశ్రమ అవసరాలు తీర్చే విధంగా అంశాలు, శిక్షణ కార్యక్రమాలు సిద్ధం చేశారు. మైక్రో-లెర్నింగ్ మాడ్యూల్స్, అప్లికేషన్ మాడ్యూల్స్ మరియు డేటా అనలిటిక్స్ ద్వారా శిక్షణా కార్యక్రమాలు సాగుతాయి. నైపుణ్య రంగంలో ఎదురవుతున్న కొరతను తీర్చడానికి అవసరమైన మానవ వనరులను అందుబాటులోకి తెస్తుంది.


మానవాళి ప్రయోజనాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న సంస్థల్లో ప్రపంచంలో అతిపెద్ద సాంకేతిక ప్రొఫెషనల్ సంస్థగా ఐఈఈఈ గుర్తింపు పొందింది.  ఐఈఈఈ, ఐఈఈఈ సభ్యులు  ప్రచురణలు, సదస్సులు, సాంకేతిక ప్రమాణాలు, వృత్తిపరమైన, విద్యా కార్యకలాపాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు.
సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సి-డాట్) అనేది భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన ప్రధాన ఆర్ అండ్ డి కేంద్రం. 4జీ/5జీ, డిజాస్టర్ మేనేజ్ మెంట్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ సహా పలు అత్యాధునిక టెలికాం టెక్నాలజీలను సి-డాట్ దేశీయంగా రూపొందించింది.

***



(Release ID: 1897380) Visitor Counter : 150


Read this release in: Tamil , English , Urdu , Hindi