ఆర్థిక మంత్రిత్వ శాఖ

పీఎంఎల్ఏ కింద రూ.859.15 కోట్లు, ఫెమా చట్టం కింద రూ.189.28 కోట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ

Posted On: 07 FEB 2023 6:04PM by PIB Hyderabad

ఆర్బీఐ నియంత్రణ కింద ఉన్న  సంస్థలు (ఆర్ ఈ) ఉపయోగిస్తున్న డిజిటల్ లెండింగ్ యాప్ల (డిఎల్ఎ) జాబితాను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు (ఎంఇఐటివై) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అందించింది. ఆర్బీఐ నుంచి అందిన  జాబితాను సంబంధిత మధ్యవర్తి (యాప్ స్టోర్స్) సంస్థలకు పంపిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జాబితాలో ఉన్న యాప్లు మాత్రమే తమ యాప్ స్టోర్ లో హోస్ట్ చేసేలా చూడాలని సూచించింది. ఈ సమాచారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరాడ్ రాజ్యసభలో ఈ రోజు ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపారు.

చట్టవిరుద్ధంగా పని చేస్తున్న అక్రమ రుణ యాప్ ల ద్వారా జరుగుతున్న నగదు సరఫరాను అరికట్టేందుకు అమలు చేస్తున్న చర్యలను మంత్రి వివరించారు.  పిఎంఎల్ చట్టం, 2002 నిబంధనల ప్రకారం నగదు అక్రమ రవాణాను అరికట్టేందుకు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ (ఇడి) కు అధికారాలు అప్పగించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా ఆర్జించిన  ఆదాయాన్ని చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న రుణ యాప్ ల ద్వారా మళ్లిస్తున్న వ్యక్తులు సంస్థలను గుర్తించడానికి ఈడీ దర్యాప్తు ప్రారంభించిందని మంత్రి తెలిపారు.

ఇటువంటి కేసుల్లో లో ఇప్పటి వరకు .2,116 కోట్ల (సుమారు) రూపాయల వరకు నగదు అక్రమంగా రవాణా అయ్యిందని ఈడీ గుర్తించింది. ఇందులో రూ.859.15 కోట్ల మేర ఆదాయాన్ని పీఎంఎల్ఏ నిబంధనల ప్రకారం జప్తు చేయడం/ సీజ్ చేయడం/ స్తంభింపచేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం-1999 లోని సెక్షన్ 37 ఏ కింద రూ.289.28 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసిందని మంత్రి తెలిపారు.
నో యువర్ కస్టమర్ (కేవైసీ) నిబంధనలు/ యాంటీ మనీ లాండరింగ్ (ఏఎంఎల్) ప్రమాణాలు/ టెర్రరిజం ఫైనాన్సింగ్ (సీఎఫ్టీ)/ అంశాల్లో  బ్యాంకులు, ఆర్థిక సంస్థల బాధ్యతలపై మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) 2002 కింద ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ జారీ చేసిందని మంత్రి పేర్కొన్నారు. ఈ సర్క్యులర్ ప్రకారం, బ్యాంకులు ,ఆర్థిక సంస్థలు ఖాతాలను తెరవడానికి మరియు అనుమానాస్పద స్వభావం కలిగిన లావాదేవీలను పర్యవేక్షించడానికి ఖాతాలను ప్రారంభించే ముందు  ఖాతాదారులను గుర్తించడానికి  బ్యాంకులు ,ఆర్థిక సంస్థలు నిర్ణీత మార్గదర్శకాలు పాటించాలని ఆర్బీఐ తన సర్క్యులర్ ద్వారా సూచించింది. అదేవిధంగా అనుమానాస్పద లావాదేవీలపై నిఘా ఉంచి నగదు అక్రమ రవాణా అరికట్టాలని కూడా  ఆర్బీఐ సర్క్యులర్ సూచించింది. అనుమానాస్పద లావాదేవీల వివరాలను సంబంధిత అధీకృత సంస్థకు తెలియజేయాలని  బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
డిజిటల్ రుణాలకు సంబంధించి 2.9.2022 న ఆర్బీఐ మార్గదర్శకాలను ఆర్బిఐ జారీ చేసిందని మంత్రి తెలిపారు. రుణ సేవలు అందిస్తున్న సంస్థలు అనుసరించాల్సిన జాగ్రత్తలను మార్గదర్శకాల్లో ఆర్బిఐ స్పష్టం చేసింది.  రుణం పొందిన వ్యక్తి ఖాతా నుంచి ఎటువంటి పాస్-త్రూ / పూల్ లేదా థర్డ్ పార్టీ ఖాతా లేకుండా నేరుగా రుణాన్ని పంపిణీచేయాలని, ఆర్ ఈ నియమించిన డిఎల్ఎ, ఎల్ఎస్ ల జాబితా ప్రచురించడం, కార్యకలాపాల వివరాలు ప్రచురించడం లాంటి చర్యలను అమలు చేయాలని సూచిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయని మంత్రి తన సమాధానంలో వివరించారు.   వంటి చర్యలను సూచిస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఆర్ఈలచే నిమగ్నమైన పీలు మరియు అజ్ఞాతాన్ని నివారించడానికి కార్యకలాపాల వివరాలు.

***



(Release ID: 1897226) Visitor Counter : 133


Read this release in: English , Urdu