ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో ఆరోగ్య వ్యవస్థల నవీకరణ
ఆరోగ్య కేంద్రాల వద్ద ఏకరీతి ప్రమాణాలతో నాణ్యతపరమైన మరియు పాలనాపరమైన మెరుగైన ఆరోగ్య సేవలను అందించడానికి భారతీయ ప్రజారోగ్య ప్రమాణాలు, 2022 నిర్దేశిస్తుంది.
గిరిజన మరియు గ్రామీణ జనాభాతో పాటు ఇతరులకు సేవలందించడం కోసం దేశవ్యాప్తంగా 22 ఎయిమ్స్ స్థాపన కోసం ఆమోదం
Posted On:
07 FEB 2023 3:27PM by PIB Hyderabad
దేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లో భాగంగా సబ్ హెల్త్ సెంటర్ ( పట్టణ మరియు గ్రామీణ), ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పట్టణ మరియు గ్రామీణ) మరియు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (పట్టణ మరియు గ్రామీణ) లతో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ లో మూడు స్తంభాలుగా మూడు-స్థాయి వ్యవస్థను కలిగి ఉంటుంది.
నిబంధనల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 20,000 (కొండలు మరియు గిరిజన ప్రాంతాలలో) మరియు 30,000 (మైదానాలలో) ఒక పీ హెచ్ సీ ని మరియు 5,000 (సాధారణ) మరియు 3000 (కొండలు మరియు కొండ ప్రాంతాల్లో) జనాభా కోసం ఉప కేంద్రం, అలాగే గిరిజన ప్రాంతం (కొండలు మరియు గిరిజన ప్రాంతంలో) 80,000 జనాభాకు మైదానాలలో 1,20,000 జనాభా కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ (DH), సబ్-డిస్ట్రిక్ట్ హాస్పిటల్ (SDH) మరియు ఫస్ట్ రెఫరల్ యూనిట్-కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు సెకండరీ కేర్ సేవలను అందిస్తాయి.
గ్రామీణ ఆరోగ్య గణాంకాలు (RHS) రాష్ట్రాలు/ యూ టీ లు నివేదించిన హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేటివ్ డేటా ఆధారంగా వెలువరించే వార్షిక ప్రచురణ.2021-22 లో గ్రామీణ & గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న సబ్-సెంటర్లు, పీ హెచ్ సీ లు, సీ హెచ్ సీ లు, సబ్-డివిజనల్ హాస్పిటల్, జిల్లా హాస్పిటల్ & మెడికల్ కాలేజీల రాష్ట్ర/యూటీ వారీగా ఉన్న వివరాలతో పాటు మానవ వనరుల కొరత వివరాలను ఆర్ హెచ్ ఎస్ యొక్క క్రింది లింక్‌లో చూడవచ్చు.
https://main.mohfw.gov.in/sites/default/files/RHS%202021%2022.pdf
దేశంలోని వివిధ ప్రాంతాల్లో 22 ఎయిమ్సలను ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ఎయిమ్స్ ఏర్పాటైన తర్వాత, గిరిజన మరియు గ్రామీణ జనాభాతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు సేవలందిస్తుంది.
భారత ప్రభుత్వం భారతీయ ప్రజారోగ్య ప్రమాణాలు, 2022 ను ప్రారంభించింది, ఇది ఆరోగ్య కేంద్రాల వద్ద ఆరోగ్య సేవలను అందించడానికి మౌలిక సదుపాయాల నాణ్యత, మానవ వనరులు, మందులు, డయాగ్నస్టిక్స్, పరికరాలు, నాణ్యత మరియు పాలన అవసరాల కోసం ఏకరీతి ప్రమాణాలను నిర్దేశించే విధానం.
జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) ప్రజల అవసరాలకు జవాబుదారీగా ప్రతిస్పందించే సరసమైన & నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు సార్వత్రిక సమానత్వ ప్రాప్యతను సాధించాలని భావిస్తుంది. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాతీయ ఆరోగ్య మిషన్ కింద ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్ (PIPలు) రూపంలో అందిన ప్రతిపాదనల ఆధారంగా ప్రజారోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్రాలు/ యూ టీ లకు సాంకేతిక మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. నిబంధనలు, అలాగే అందుబాటులో ఉన్న వనరుల ప్రకారం రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్ (RoPs) రూపంలో వచ్చిన ప్రతిపాదనలకు భారత ప్రభుత్వం ఆమోదం అందిస్తుంది.
15 వ ఫైనాన్స్ కమీషన్ రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు స్థానిక ప్రభుత్వం ద్వారా ఐదేళ్ల కాలంలో (2021-2026) రూ.70,051 కోట్లు మొత్తం గ్రాంట్లను,ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) కింద రూ. 64,180 కోట్లు మొత్తం తో సబ్-హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలు మరియు క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్‌ల కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఈరోజు రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని తెలిపారు.
***
(Release ID: 1897139)
Visitor Counter : 228