భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రస్తుతం భారతదేశంలో ఉపయోగిస్తున్న హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య 16,73,115

Posted On: 07 FEB 2023 4:32PM by PIB Hyderabad

ఈరోజు లోక్‌సభలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్ ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో దేశంలో హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికిప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల ఫాస్టర్ అడాప్షన్ మరియు తయారీ (FAME ఇండియా) స్కీమ్ ని 2015 లో ప్రారంభించింది. ప్రస్తుతం, మన దేశంలో ఈ పథకం రెండవ దశ అమలులో ఉంది. 2019, ఏప్రిల్ 1 నుంచి ఇప్పటివరకు సుమారుగా పది వేల కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతు ద్వారా ఈ పథకం అమలవుతోంది. ఈ పథకం యొక్క వ్యవధి 5 సంవత్సరాలు.

ఇంకాదేశంలో హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ క్రింది చర్యలు చేపట్టింది:

       i.          దేశంలో బ్యాటరీ ధరలను తగ్గించేందుకు దేశంలో అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్ (ACC) తయారీకి సంబంధించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని 12 మే2021న ప్రభుత్వం ఆమోదించింది.

      ii.          ఎలక్ట్రిక్ వాహనాలను ఆటోమొబైల్ మరియు ఆటో కాంపోనెంట్‌ల కోసం ప్రోడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కింద కవర్ చేయడం జరుగుతుంది. దీనిని 15 సెప్టెంబర్2021న ఐదేళ్ల కాలానికి రూ. 25,938 కోట్లు బడ్జెట్ వ్యయంతో ఆమోదించడం జరిగింది.

     iii.          ఎలక్ట్రిక్ వాహనాలపై GST ని 12% నుండి 5%కి తగ్గించారుఎలక్ట్రిక్ వాహనాల ఛార్జర్లు/ఛార్జింగ్ స్టేషన్లపై గల జీఎస్టీని 18% నుంచి 5%కి తగ్గించారు.

     iv.          రోడ్ ట్రాన్స్‌పోర్ట్ హైవేస్ మంత్రిత్వ శాఖ (MoRTH) బ్యాటరీతో నడిచే వాహనాలకు గ్రీన్ లైసెన్స్ ప్లేట్‌లు ఇవ్వడం జరుగుతుందని; అలాగే పర్మిట్ అవసరాల నుండి మినహాయింపు కూడా ఉంటుందని ప్రకటించింది.

      v.          ఎలక్ట్రిక్ వాహనాలపై రహదారి పన్నును మినహాయించాలని రాష్ట్రాలకు సలహా ఇస్తూ MoRTH నోటిఫికేషన్ జారీ చేసిందిఇది విద్యుత్ వాహనాల ప్రారంభ ధరను తగ్గించడంలో సహాయపడుతుంది.

 

ఇ-వాహన్ పోర్టల్ (మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్) ప్రకారంప్రస్తుతం దేశంలో ఉపయోగిస్తున్న హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ వ్యక్తిగత వాహనాల వివరాలుగుజరాత్ రాష్ట్రంతో సహా రాష్ట్రాల వారీగా దిగువన ఉన్నాయి.

క్రమ. సంఖ్య.

రాష్ట్రం పేరు

Fuel Type

మొత్తం

ఎలక్ట్రిక్

(BOV)

డీజిల్/హైబ్రిడ్

పెట్రోల్/హైబ్రిడ్

1

అండమాన్ & నికోబార్ ద్వీపం

87

0

56

143

2

ఆంధ్రప్రదేశ్

40,370

8

4,017

44,395

3

అరుణాచల్ ప్రదేశ్

22

70

505

597

4

అస్సాం

2,908

1,375

10,410

14,693

5

బీహార్

15,713

1,719

10,550

27,982

6

చండీఘర్

1,772

563

3,794

6,129

7

ఛత్తీస్‌ఘడ్

25,064

781

15,231

41,076

8

దిల్లీ

57,013

16,697

38,552

1,12,262

9

గోవా

7,645

629

3,884

12,158

10

గుజరాత్

86,116

20,355

41,109

1,47,580

11

హర్యానా

20,181

7,534

25,511

53,226

12

హిమాచల్ ప్రదేశ్

1,452

888

3,548

5,888

13

జమ్మూ అండ్ కాశ్మీర్

3,637

1,202

3,198

8,037

14

ఝార్ఖండ్

10,311

3,626

11,823

25,760

15

కర్ణాటక

1,48,494

4,626

50,472

2,03,592

16

కేరళ

53,008

9,161

34,694

96,863

17

లడఖ్

37

11

119

167

18

మధ్య ప్రదేశ్

36,162

6

5,938

42,106

19

మహారాష్ట్ర

1,93,498

33,568

69,120

2,96,186

20

మణిపూర్

220

156

754

1,130

21

మేఘాలయ

68

135

566

769

22

మిజోరాం

56

26

231

313

23

నాగాలాండ్

56

63

518

637

24

ఒడిశా

37,663

1,958

15,247

54,868

25

పుదుచ్చేరి

3,028

563

1,969

5,560

26

పంజాబ్

14,186

3,901

13,770

31,857

27

రాజస్థాన్

81,977

8,636

20,296

1,10,909

28

సిక్కిం

10

87

101

198

29

తమిళనాడు

1,11,604

7,579

49,823

1,69,006

30

త్రిపుర

277

47

460

784

31

డయ్యు డమన్ మరియు దాద్రానగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతం

195

328

894

1,417

32

ఉత్తర్ ప్రదేశ్

42,906

14,516

47,614

1,05,036

33

ఉత్తరాఖండ్

9,056

2,564

4,799

16,419

34

పశ్చిమ బెంగాల్

12,625

4,830

17,917

35,372

మొత్తం

10,17,417

1,48,208

5,07,490

16,73,115

 

గమనిక:

 

1. ఆంధ్రప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్‌లలో విద్యుత్ వాహనాలకు మారే ప్రక్రియ అమల్లో ఉంది. కాబట్టి పైన పట్టికలో చూపిన డేటా కేవలం పాక్షికం మాత్రమే. వాహన్ డీబీలో అందుబాటులో ఉన్న డేటా మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది.

2. ఆన్‌లైన్ వాహన్ DBలో తెలంగాణ మరియు లక్షద్వీప్ డేటా అందుబాటులో లేదు కాబట్టి  వాటిని అందించడానికి వీలు కాలేదు.

***


(Release ID: 1897137) Visitor Counter : 180


Read this release in: English , Urdu , Tamil