వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

FY24లో చేసిన రూ.1.45 లక్షల కోట్ల కేటాయింపులు ధాన్యం సేకరణ ఖర్చులు/పీడీఎస్‌ కార్యకలాపాల నిర్వహణ కోసం భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) స్వల్పకాలిక నిర్వహణ మూలధన అవసర అంచనాను సూచిస్తున్నాయి

Posted On: 07 FEB 2023 3:43PM by PIB Hyderabad

బడ్జెట్ అంచనా (బీఈ) FY24లో, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) కోసం అంతర్గత, అదనపు బడ్జెట్ వనరులుగా (ఐఈబీఆర్‌) చూపిన రూ.1.45 లక్షల కోట్ల కేటాయింపులు ధాన్యం సేకరణ ఖర్చులు/పీడీఎస్‌ కార్యకలాపాల నిర్వహణ కోసం ఆ సంస్థ స్వల్పకాలిక నిర్వహణ మూలధన అవసరాలను సూచిస్తున్నాయి.

ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ఔట్‌లెట్ల ద్వారా ఆహార పదార్థాలను పంపిణీకి అందుబాటులో ఉంచిన తర్వాత, కేంద్ర బడ్జెట్ నుంచి రీయింబర్స్‌మెంట్ ప్రాతిపదికన ఆహార సబ్సిడీ (ఆర్థిక వ్యయం - కేంద్ర ధర మధ్య వ్యత్యాసం) ఎఫ్‌సీఐకి విడుదల అవుతుంది. బ్యాంకుల కన్సార్టియం, స్వల్పకాలిక రుణాలు (90 రోజుల వరకు), అడ్వాన్సులు మొదలైన మార్గాల నుంచి రుణాలు పొందడం ద్వారా, తన నిర్వహణ మూలధన అవసరాలు లేదా సేకరణ కార్యకలాపాలు, స్థాపన, సరకు రవాణా, నిల్వ వంటి వాటి వ్యయాలను ఎఫ్‌సీఐ భరిస్తుంది. కేంద్ర బడ్జెట్ నుంచి ఎఫ్‌సీఐకి విడుదల చేసిన ఆహార సబ్సిడీలో నిర్వహణ మూలధన అవసరాల ఖర్చులను చేర్చడం జరిగింది.

బడ్జెట్ పారదర్శకతలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతలో భాగంగా, తదుపరి ఆర్థిక సంవత్సరం కోసం ఎఫ్‌సీఐకి అవసరమైన నిర్వహణ మూలధన అవసరాలను FY 2023-24 బడ్జెట్ పత్రాలు వెల్లడిస్తాయి. ఇది ఎఫ్‌సీఐ కోసం అందుబాటులోకి తెచ్చిన ఏర్పాటు. ఉదాహరణకు, ప్రస్తుత FY 2022-23 బడ్జెట్ అంచనాల్లో ఐఈబీఆర్‌ వ్యయం రూ.89,425 కోట్లుగా ఉంది. తగ్గిన నిల్వ వ్యయాల కారణంగా, సవరించిన అంచనాల్లో దానిని రూ.56,935 కోట్లకు తగ్గించడం జరిగింది.

FY 2023-24లో అధిక అంచనాకు అర్ధం, ఆ సంవత్సరంలో ఆహార ధాన్యాల పెరిగే దిగుబడి, సేకరణ వ్యయాలు, అనుకోని ఖర్చులను సూచిస్తుంది. లబ్ధిదారులకు ఆహార ధాన్యాల పంపిణీకి అవసరమైన అన్ని అంచనా వ్యయాల కోసం, 2023-24 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఆహార సబ్సిడీకి చేసిన కేటాయింపులు సరిపోతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

 

***


(Release ID: 1897125) Visitor Counter : 142


Read this release in: Tamil , English , Urdu , Hindi