ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

టెలీ మనస్ స్కీమ్


నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (ఎన్ టిఎంహెచ్ పి) కు రూ.120.98 కోట్లు కేటాయింపు

130 మంది మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, 173 మంది డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ సిబ్బంది, 580 మంది టెలీ మనస్ కౌన్సిలర్ల ద్వారా 20 భాషల్లో టెలీ మానస్ సేవలు అందుబాటు.

Posted On: 07 FEB 2023 3:34PM by PIB Hyderabad

దేశంలో నాణ్యమైన మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ , సంరక్షణ సేవల లభ్యతను మరింత మెరుగుపరచడానికి ప్రభుత్వం 2022 అక్టోబర్ 10 న "నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్" ను ప్రారంభించింది. బెంగళూరులోని నిమ్హాన్స్ జాతీయ అపెక్స్ సెంటర్, భారతదేశం అంతటా టెలీ మనస్ కార్యకలాపాలను సమన్వయం చేస్తుంది. 2022-23 సంవత్సరానికి నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (ఎన్ టిఎంహెచ్ పి)కు మొత్తం రూ.120.98 కోట్లు కేటాయించారు.

 

టెలీ-మనస్ కింద భారతదేశం అంతటా 31.01.2023 నాటికి మొత్తం 43,861 కాల్స్ వచ్చాయి. 130 మంది మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్, 173 మంది

డీఎంహెచ్ సి సిబ్బంది, 580 మంది టెలీ మనస్ కౌన్సిలర్ల ద్వారా టెలీ మానస్ ప్రోగ్రామ్ కింద సేవలు అందిస్తున్నారు.

ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్, కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, కొంకణి, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, బెంగాలీ, ఒడియా, పంజాబీ, కశ్మీరీ, బోడో, డోగ్రీ, ఉర్దూ, మణిపురి, మిజో, రాజస్థానీ వంటి రాష్ట్రాలు ఎంచుకున్న భాషల ఆధారంగా 20 భాషల్లో టెలి-మనస్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

 

బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) ద్వారా 2016 లో భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే (ఎన్ఎంహెచ్ఎస్) ప్రకారం 18 ఏళ్లు పైబడిన పెద్దలలో మానసిక రుగ్మతల ప్రాబల్యం 10.6% ఉంది. మానసిక రుగ్మతకు చికిత్స అంతరం వివిధ రుగ్మతలకు 70% నుండి 92% వరకు ఉంటుంది.

 

మంత్రిత్వ శాఖ పరిధిలోని మానసిక ఆరోగ్య సేవలకు కేటాయించిన బడ్జెట్, 2019 సంవత్సరానికి ఈ క్రింది సంస్థలకు కేటాయింపులు సహా ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 

1.నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (ఎన్ఎంహెచ్ పి)

2.డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (డీఎంహెచ్.పి)

3.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్), బెంగళూరు

4.లోకోప్రియా గోపీనాథ్ బోర్డోలోయ్ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (ఎల్జీబీఆర్ఐఎంహెచ్), తేజ్ పూర్,అస్సాం

5.సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ (సిఐపి), రాంచీ

 

వరస నెం.

సంవత్సరం

మొత్తం ఆరోగ్య  బడ్జెట్ (రూ. కోట్లలో)

మానసిక ఆరోగ్యానికి మొత్తం కేటాయింపులు (రూ. కోట్లలో)

1.

2019-20

62659.12

747.85

2.

2020-21

65011.80

713.01

3.

2021-22

71268.77

846.17

4.

2022-23

83000.00

949.74

 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతీ ప్రవీణ్ పవార్ రాజ్యసభలో ఒక లిఖితపూర్వక సమాధానం లో ఈ వివరాలు తెలిపారు.

 

****


(Release ID: 1897121) Visitor Counter : 196


Read this release in: English , Urdu , Tamil