రక్షణ మంత్రిత్వ శాఖ
తమిళనాడు డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్
Posted On:
06 FEB 2023 3:12PM by PIB Hyderabad
తమిళనాడులోని డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్ (టిఎన్ఐడిసి - తమిళనాడు రక్షణ పారిశ్రామిక కారిడార్)లో చెన్నై, కోయంబత్తోర్, హోసూర్, సాలెం, తిరుచారపల్లిని05 (ఐదు) కీలక కేంద్రాలుగా గుర్తించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి అందిన సమాచారం ప్రకారం టిఎన్‌డిఐసి కింద రూ.11,794 కోట్ల సంభావ్య పెట్టుబడితో 53 పరిశ్రమలు& సంస్థలను అవగాహనా పత్రాల ద్వారా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. నేటి వరకూ, రూ. 3,861 కోట్లను పరిశ్రమలు/ సంస్థలలో పెట్టుబడులను పెట్టడం జరిగింది. ఒక ప్రాంతంలో నూతన పరిశ్రమలు పెట్టడం వల్ల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధికి అవకాశాలను కల్పిస్తుంది. టిఎన్‌డిఐసి అభివృద్ధి కోసం తమిళనాడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు కోరుతున్న తోడ్పాటును తగినవిధంగా అందించడం జరుగుతోంది.
ఈ సమాచారాన్ని రక్షణ శాఖ సహాయమంత్రి శ్రీ అజయ్ భట్ రాజ్యసభలో డాక్టర్ అంబుమణి రామదాస్ వేసిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ వెల్లడించారు.
***
(Release ID: 1896817)
Visitor Counter : 160