ఆర్థిక మంత్రిత్వ శాఖ
2022-23 సంవత్సరానికి 35.4 శాతం మేర పెరిగిన మూలధన వ్యయం
- ఏప్రిల్-డిసెంబర్ 2022 మధ్యకాలంలో ఖర్చు చేసిన సుమారు 67 శాతంతో భారీగా పెరిగిన మూలధన వ్యయం
- 2015 నుండి 2023 వరకు వయాబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకం కింద డీఈఏ ద్వారా ₹2982.4 కోట్ల పంపిణీ
- రూ.108 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో ‘నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్’ కింద చేపట్టిన 8,964 ప్రాజెక్ట్‌లు వివిధ దశల్లో అమలులో ఉన్నాయి
- జాతీయ మానిటైజేషన్ పైప్‌లైన్ కింద 2022 ఆర్థిక సంవత్సరంలో ₹0.9 లక్షల కోట్ల లక్ష్యం కంటే రోడ్లు, విద్యుత్తు, బొగ్గు మరియు గనుల ద్వారా ₹0.97 లక్షల కోట్ల మానిటైజేషన్ సాధన
- 2022 ఆర్థిక సంవత్సరంలో 10,457 కి.మీ రోడ్లు నిర్మాణం
- జాతీయ జలమార్గాలపై కార్గో రవాణా ఉద్యమంలో భాగంగా 2022 ఆర్థిక సంవత్సరంలో 30.1 శాతం వృద్ధి
- 2022 ఆర్థిక సంవత్సరంలో 108.8 మిలియన్ టన్నుల ఆల్-టైమ్ గరిష్ట స్థాయి రవాణా
Posted On:
31 JAN 2023 1:42PM by PIB Hyderabad
మౌలిక సదుపాయాల పెట్టుబడుల పెరుగుదల ఆర్థిక వ్యవస్థ యొక్క సంభావ్య వృద్ధికి కీలకమైన తోడ్పాటును అందిస్తుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంచుతూపోతోంది. 2022-23 (బడ్జెట్ అంచనా)లో మూలధన వ్యయం వేగంగా పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2021-22) రూ.5.5 లక్షల కోట్లుగా ఉన్న ఈ వ్యయం 2022-23 సంవత్సరంలో ఇప్పటికే 35.4 శాతం పెరిగి నుండి 7.5 లక్షల కోట్లకు చేరింది. ఇందులో దాదాపు 67 శాతం ఏప్రిల్ నుండి డిసెంబర్ వరకు ఖర్చు చేసినదే ఉండడం విశేషం. 2022 ఆర్థిక సర్వే 2022-23ని ఈ రోజు పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతినిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. " ఇటీవలి కాలంలో ప్రయివేటు రంగం మూలధన వ్యయం తగ్గిపోయిన సంక్షోభ సమయంలో కూడా ప్రభుత్వం మూలధన వ్యయాన్ని పెంపొందించడం ద్వారా మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు పెట్టుబడులకు అధిక ప్రోత్సాహాన్ని అందించింది" అని ఆర్థిక సర్వే డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: లిఫ్టింగ్ పొటెన్షియల్ గ్రోత్ అనే తన అధ్యాయంలో పేర్కొంది. మౌలిక వసతుల పెట్టుబడులను పెంచేందుకు నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్, నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ అవసరమైన ప్రోత్సాహాన్ని అందజేస్తోందని పేర్కొంది. నేషనల్ లాజిస్టికల్ పాలసీ సేవలు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు లాజిస్టిక్స్ వర్క్‌ఫోర్స్‌లోని నైపుణ్యాలలో అంతరాలను పరిష్కరిస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇంకా పీఎం గతిశక్తి మల్టీమోడల్ విధానంతో భౌతిక మౌలిక వసతుల అవస్థాపనలో ఖాళీలను పూరించడానికి మరియు వివిధ ఏజెన్సీలలో యొక్క ఇప్పటికే ఉన్న, ప్రతిపాదిత మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలను ఏకీకృతం చేయడానికి రూపొందించబడిందని పేర్కొంది. భౌతిక మౌలిక వసతుల కల్పనకు సుదీర్ఘ కాలం పాటు నిరంతర మద్దతు అవసరమవుతుంది. కావున ప్రభుత్వం మేటి పెట్టుబడి చక్రంలో చలనం కోసం అభివృద్ధి ఆర్థిక సంస్థగా ‘నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్’ (ఎన్ఏబీఎఫ్ఐడీ)ని కూడా ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వంలోని అన్ని సంబంధిత మంత్రిత్వ శాఖలు/ డిపార్ట్‌మెంట్లలో ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ సెల్స్ (పీడీసీలు) రూపంలో పెట్టుబడులను త్వరితగతిన ట్రాక్ చేయడానికి ఒక సంస్థాగత యంత్రాంగం ఏర్పాటు చేయబడిందని ఆర్థిక సర్వే పేర్కొంది.
ప్రభుత్వ -ప్రైవేట్ భాగస్వామ్యాలు (పీపీపీలు)
పీపీపీలు ప్రభుత్వాలకు కీలకమైన పెట్టుబడి సాధనాలు. మౌలిక సదుపాయాల కీలకమైన రంగాలలో ప్రైవేట్ రంగం యొక్క సామర్థ్యాన్ని చానెల్ చేయడంలో పీపీపీ ఎంతగానో దోహదం చేస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2015 ఆర్థిక సంవత్సరం నుంచి 2023 ఆర్థిక సంవత్సరం వరకు రూ.2,27,268.1 కోట్ల మొత్తం ప్రాజెక్ట్ వ్యయంతో కూడిన 79 ప్రాజెక్ట్‌లను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ అప్రైజల్ కమిటీ అనుమతులను మంజూరు చేసింది. ఆర్థికంగా లాభదాయకం కాని సామాజికంగా/ ఆర్థికంగా కావాల్సిన పీపీపీ ప్రాజెక్ట్‌లకు ఆర్థిక సహాయం అందించడానికి, ఆర్థిక వ్యవహారాల శాఖ 2006లో వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) పథకాన్ని ప్రారంభించిందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2014-15 నుండి 2022-23 వరకు, వీజీఎఫ్ పథకం కింద , రూ.57870.1 కోట్ల టీపీసీతో 56 ప్రాజెక్ట్‌లకు సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ₹25263.8 కోట్ల టీపీసీతో 27 ప్రాజెక్ట్‌లకు ₹5813.6 కోట్ల మొత్తంతో (భారత ప్రభుత్వం & రాష్ట్రం వాటా షేర్ రెండూ)వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆమోదంతో తుది ఆమోదం పొందాయి. 2015 నుండి 2023 వరకు ఈ పథకం కింద డీఈఏ పంపిణీ చేయబడిన వీజీఎఫ్ మొత్తం ₹2982.4 కోట్లు. దీనికి తోడు పీపీపీ ప్రాజెక్ట్‌ల ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం కోసం 'ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఫండ్ స్కీమ్' (ఐఐపీడీఎఫ్) - అనే పథకం రూ.150 కోట్లతో 3 నవంబర్ 2022న ప్రభుత్వం నోటిఫై చేసింది. 2023 నుండి 2025 మూడేండ్ల కాల పరిమితితో దీనిని నోటిఫై చేసినట్టుగా ఆర్థిక సర్వే పేర్కొంది.
నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్
ప్రభుత్వం జాతీయ మౌలిక సదుపాయాల పైప్‌లైన్ (ఎన్ఐసీ)ను ముందుకు చూపు విధానంతో ప్రారంభించింది. దీనిలో భాగంగా దేశ వ్యాప్తంగా అధిక నాణ్యత గల మౌలిక సదుపాయాలను అందించడానికి 2020-2025 సమయంలో సుమారు రూ.111 లక్షల కోట్ల మౌలిక సదుపాయాల పెట్టుబడిని అంచనా వేసింది. ఎన్ఐపీ ప్రస్తుతం 8,964 ప్రాజెక్ట్‌లను కలిగి ఉంది. మొత్తం ₹108 లక్షల కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడితో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల అమలు వివిధ దశలలో ఉన్నాయి. ఎన్ఐపీ మరియు ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (పీఎంజీ) పోర్టల్‌లను ఏకీకృతం చేయాలని ప్రతిపాదించబడింది.
నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ - మానిటైజేషన్ ద్వారా సృష్టి
ఆర్ధిక సర్వే నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్ఎంపీ)ని ప్రస్తావిస్తూ, ' నగదీకరణ (మానిటైజేషన్) ద్వారా ఆస్తుల సృష్టి' అనే సూత్రంపై 23 ఆగస్టు 2021న దీనిని ప్రకటించినట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. 2020-2025 ఆర్థిక సంవత్సరాల వ్యవధిలో, కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆస్తుల ద్వారా ఎన్ఎంపీ కింద అంచనా వేసిన మొత్తం నగదీకరణ సంభావ్యత రూ.6 లక్షల కోట్లు. 2022 ఆర్థిక సంవత్సరంలో నగదీకరణ లక్ష్యం ₹0.9 లక్షల కోట్లు. దీనికి గాను రోడ్లు, విద్యుత్, బొగ్గు మరియు గనుల కింద ₹0.97 లక్షల కోట్లు నగదీకరణ సాధించబడింది.
నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ: లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం
లాజిస్టిక్స్ వ్యవస్థను మెరుగుపరచడానికి ప్రభుత్వం ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగ్రిక్’ (ఉడాన్), భారతమాల, సాగరమాల, పర్వతమాల, జాతీయ రైలు ప్రణాళిక వంటి 'మౌలిక సదుపాయాల కార్యక్రమాల' లను జీఎస్టీ, ఈ-సంచిత్, సింగిల్ విండో ఇంటర్‌ఫేస్ ఫర్ ట్రేడ్ (స్వఫ్ట్), ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్‌చేంజ్ గేట్‌వే (ఐసీఈ గేట్), తురంత్ కస్టమ్స్ వంటి పలు ఇతర సంస్కరణలను భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక ప్రయత్నాలలో చేపట్టిందని సర్వే పేర్కొంది. వివిధ ప్రభుత్వ సంస్థల ద్వారా ఈ ప్రయత్నాలన్నింటినీ ఏకీకృతం చేయడానికి 17 సెప్టెంబర్ 2022న నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ప్రారంభించబడింది, లాజిస్టిక్స్‌లో సామర్థ్యాన్ని మెరుగుపరిచే భాగాలను ప్రస్తావిస్తూ ఆర్థిక సర్వే పేర్కొంది.
భౌతిక మౌలిక వసతుల రంగాలలో అభివృద్ధి
రోడ్డు రవాణ
ఆర్థిక సర్వే ప్రకారం, కాలక్రమేణా జాతీయ రహదారులు (ఎన్.హెచ్.ల)/రోడ్ల నిర్మాణంలో పెరుగుదల నమోదవుతూ వస్తోంది, 2016 ఆర్థిక సంవత్సరంలో 6,061 కి.మీ.తో పోలిస్తే 20022 ఆర్థిక సంవత్సరంలో 10,457 కి.మీ. మర రోడ్లు నిర్మించబడ్డాయి. ఈ రంగంలో పెట్టుబడికి మొత్తం బడ్జెట్ మద్దతు గత నాలుగు సంవత్సరాలలో వేగంగా పెరుగుతూ వస్తోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో (31 అక్టోబర్ 2022 నాటికి) ఇది సుమారు ₹1.4 లక్షల కోట్లకు చేరుకుంది. ప్రభుత్వ రంగ ఆస్తుల మోనటైజేషన్ దృష్టి కోణానికి అనుగుణంగా ‘నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (ఎన్.హెచ్.ఎ.ఐ) 2022 ఆర్ధిక సంవత్సరంలో తన ఇన్విట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు NHAI ఇన్విట్ అధిక నాణ్యత గల విదేశీ మరియు భారతీయ సంస్థాగత పెట్టుబడిదారుల నుండి (డిసెంబర్ 2022 వరకు) రూ.10,200 కోట్లకు పైగా నిధులను సమీకరించింది.
రైల్వేలు
కోవిడ్-19 ప్రభావం ఉన్నప్పటికీ భారతీయ రైల్వేలు (ఐఆర్) సరుకు రవాణాను కొనసాగించాయి. 2022-23లో (నవంబర్ 2022 వరకు), ఐఆర్ 976.8 మిలియన్ టన్నుల ఆదాయాన్ని ఆర్జించేలా సరుకు రవాణాను (కె.ఆర్.సి.ఎల్ మినహాయించి) చేపట్టింది. 2021-22లో (కె.ఆర్.సి.ఎల్. మినహాయించి) సంబంధిత కాలంలో 901.7 మిలియన్ టన్నుల రవాణా చేపట్టింది, ఇది. 8.3 శాతం పెరుగుదలను సూచిస్తోందని ఆర్థిక సర్వే పేర్కొంది. ఇంకా, రైల్వేలో మౌలిక సదుపాయాలపై మూలధన వ్యయం (క్యాపెక్స్) గత నాలుగు సంవత్సరాలలో నిరంతర పెరుగుదలను నమోదు చేస్తోంది. 2023లో క్యాపెక్స్ (బి.ఇ.) ₹2.5 లక్షల కోట్లకు చేరి గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు 29 శాతం పెరిగింది. ముంబయి అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ ప్రాజెక్ట్, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్ట్, గతి శక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్, వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తేవడం, ఎలక్ట్రికల్/ఎలక్ట్రానిక్ ఇంటర్‌లాకింగ్ సిస్టమ్, హైపర్‌లూప్ టెక్నాలజీ అభివృద్ధి మరియు త్వరగా పాడైపోయే పదార్థాల వేగంగా తరలింపును 2021 ఆర్ధిక సంవత్సరంలో అమలులోకి తెచ్చిన కిసాన్ రైళ్లను ప్రవేశపెట్టడం భారతీయ రైల్వేల పరిధిలోని ప్రధాన కార్యక్రమాలుగా నిలిచాయని ఆర్థిక సర్వే పేర్కొంది.
పౌర విమానయానం
ఆర్థిక సర్వే ప్రకారం డిసెంబర్ 2022లో విమానయనం చేసిన మొత్తం ప్రయాణీకుల సంఖ్య 150.1 లక్షలుగా ఉంది, ఇది కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయితో పోలిస్తే (ఏప్రిల్ 2019 నుండి ఫిబ్రవరి 2020 వరకు 11 నెలల సగటు) 106.4 శాతం. నవంబర్ 2022లో మొత్తం ఎయిర్ కార్గో టన్నేజ్ 2.5 లక్షల మెట్రిక్‌టనులుగా ఉంది, ఇది కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిలతో పోలిస్తే 89 శాతం.
పోర్టులు
మార్చి 2014 చివరి నాటికి సంవత్సరానికి 871.5 మిలియన్ టన్నులగా (ఎం.టి.పి.ఎ) ఉన్న ప్రధాన పోర్టుల సామర్థ్యం, మార్చి 2022 చివరి నాటికి 1534.9 ఎం.టి.పి.ఎ.కి పెరిగింది. 2022 సమయంలో ఇది సంచితంగా 720.1 ఎంటీ ట్రాఫిక్‌ను నిర్వహించాయని ఆర్థిక సర్వే పేర్కొంది. వారి సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడానికి, ప్రభుత్వం పోర్ట్ గవర్నెన్స్‌ను మెరుగుపరచడం, తక్కువ-సామర్థ్య వినియోగాన్ని పరిష్కరించడం, టెక్నో ఎఫెక్టివ్ లోడింగ్/ అన్‌లోడ్ చేసే పరికరాలతో బెర్త్‌లను ఆధునీకరించడం మరియు పోర్ట్ కనెక్టివిటీ కోసం కొత్త ఛానెల్‌లను రూపొందించడంవంటి పనులపై దృష్టి సారిస్తోంది. పోర్ట్ సమ్మతిని క్రమబద్ధీకరించడం కోసం మరియు ఓడల కోసం టర్న్ ఎరౌండ్ టైమ్ (టీఏటీ)ని తగ్గించడం కోసం, కీలకమైన ఎగ్జిమ్ ప్రక్రియల డిజిటలైజేషన్ వైపు ప్రధాన ఓడరేవుల్లో సుదీర్ఘ ప్రగతిని ఎకనామిక్ సర్వే గమనిస్తోందని పేర్కొంది.
అంతర్గత జల రవాణా
టెక్నో-ఎకనామిక్ సాధ్యత మరియు వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికల (డీపీఆర్ల) ఫలితాల ఆధారంగా, కార్గో తరలింపు కోసం 26 జాతీయ జలమార్గాలకు ప్రాధాన్యమివ్వబడింది. వీటిలో 14 అత్యంత ఆచరణీయమైన ఎన్.డబ్ల్యులలో అభివృద్ధి కార్యకలాపాలు ప్రారంభించబడ్డాయి అని ఆర్థిక సర్వే పేర్కొంది. జాతీయ జలమార్గాలపై కార్గో రవాణా ఉద్యమం 2022లో ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరింది. ఈ కాలంలో 108.8 మిలియన్ టన్నుల లక్ష్యానికి చేరుకుంది. అంటే గత సంవత్సరంతో పోలిస్తే 30.1 శాతం వృద్ధిని నమోదు చేసినట్లయిందని ఆర్థిక సర్వే పేర్కొంది.
విద్యుత్తు
మార్చి 31, 2022 నాటికి దేశంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మరియు క్యాప్టివ్ పవర్ ప్లాంట్ల మొత్తం స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 482.2 గిగా వాట్లుగా ఉంది, ఇది 31 మార్చి 2021న 460.7 గిగా వాట్లుగా మాత్రమే ఉంది, అంటే ఈ విభాగం సామర్త్యం 4.7 శాతం మేర పెరిగింది. 31 మార్చి 2022 నాటికి యుటిలిటీస్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన సామర్థ్యం 399.5 గిగా వాట్లుగా ఉంది, ఇది ఆర్థిక సర్వే గమనికల ప్రకారం ఒక సంవత్సరం క్రితం 382.1 గిగా వాట్లు (4.5 శాతం ఎక్కువ). విద్యుత్ ఉత్పత్తి సంస్థల మొత్తం స్థాపిత సామర్థ్యంలో థర్మల్ విద్యుత్త అతిపెద్ద (59.1 శాతం) వాటాను కలిగి ఉంది, తర్వాత అతిపెద్ద వాటాను 27.5 శాతంతో పునరుత్పాదక ఇంధన వనరులు, 11.7 శాతంతో హైడ్రో విద్యుత్తులు నిలిచాయి. 2022 మరియు 2021 ఆర్థిక సంవత్సరాల మధ్య పునరుత్పాదక ఇంధన వనరులలో విద్యుత్ ఉత్పత్తిలో గరిష్ట పెరుగుదల నమోదైంది. 2030 నాటికి నాన్-ఫాసిల్ ఫ్యూయల్ ఆధారిత ఇంధన వనరుల నుండి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయడానికి 50 శాతం సంచిత స్థాపిత సామర్థ్యాన్ని సాధించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుంది. పీఎం-కుసుమ్, సోలార్ పార్క్ స్కీమ్ మరియు ఇతర పథకాల ద్వారా భారతదేశ ఇంధన రంగంలో సాంప్రదాయిక వనరుల నుండి శిలాజ రహిత ఇంధన వనరులకు క్రమంగా మార్పు చెందుతూ కాలుష్య నివారణ విషయంలో భారతదేశం తన కట్టుబాట్లను నెరవేర్చే మార్గంలో ముందుకు సాగుతోందని ఆర్థిక సర్వే పేర్కొంది. ప్రభుత్వ మద్దతుతో, ప్రైవేట్ రంగం మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో మరియు తక్కువ వ్యవధిలో యూనిట్ ఖర్చులను తగ్గించడంలో చురుకుగా ముందుకు సాగుతోందని సర్వే పేర్కొంది.
*******
(Release ID: 1895219)
Visitor Counter : 410