ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఆర్ధిక సంవత్సరం 2022-23కు డిసెంబర్ 2022 వరకు కేంద్ర ప్రభుత్వ ఖాతాల నెలవారీ సమీక్ష
Posted On:
31 JAN 2023 6:50PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వపు నెలవారీ ఖాతాను డిసెంబర్ 2022 వరకు ఏకీకృతం చేసి, నివేదికలను ప్రచురించింది. కీలకాంశాలను దిగువన ఇవ్వడం జరిగింది.
భారత ప్రభుత్వం డిసెంబర్ 2022 వరకు రూ. 18,25,100 కోట్లు ( బిఇ - బడ్జెట్ అంచనాల 2022-23 లో మొత్తం ఆదాయంలో 79,9%) రాబడిని ఆర్జించింది. ఇందులో రూ. 15,55,692 కోట్ల పన్ను ఆదాయం (కేంద్రానికి నికరంగా), రూ.2,14,302 కోట్ల పన్నేతర రాబడి, రూ. 55,106 కోట్ల రుణేతర పెట్టుబడి ఆదాయం ఉంది.
రుణేతర పెట్టుబడి వసూళ్ళలో రుణాల రికవరీ రూ. 16,435 కోట్లు, వివిధ పెట్టుబడి వసూళ్ళు రూ.38, 671 కోట్లుగా ఉంది. ఇప్పటివరకూ, భారత ప్రభుత్వం పన్నుల వాటాల విస్తరణగా రూ. 6,09,437 కోట్లను రాష్ట్ర ప్రభుత్వాలకు బదిలీ చేసింది, గత ఏడాదికంటే రూ. 1,59,127 కోట్లు ఎక్కువ.
భారత ప్రభుత్వం వెచ్చించిన మొత్తం వ్యయం రూ. 28, 18, 076 కోట్లు (సింబంధిత బిఇ 2022-23లో 71.4%). ఇందులో రూ. 23,28,132 కోట్లు ఆదాయపు ఖాతా (రెవిన్యూ అకౌంట్) కాగా, రూ. 4,89,944 కోట్లు మూలధనంఖాతా. మొత్తం మొత్తం రెవిన్యూ వ్యయంలో రూ. 6,80,853 కోట్లు వడ్డీల చెల్లింపుకు పోగా, రూ. 3,50, 524 కోట్లు ప్రధాన సబ్సిడీల కారణంగా ఖర్చయ్యాయి.
***
(Release ID: 1895215)
Visitor Counter : 219