పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మంథన్: కొత్త మార్గాలు, ఇ-గ్రామ స్వరాజ్ 2.0 పై పరిశ్రమ సంప్రదింపులు

Posted On: 30 JAN 2023 6:16PM by PIB Hyderabad

సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ప్రభుత్వం మూడవ అంచె అయిన పంచాయతీ లో టెక్నాలజీ ద్వారా 'కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన' దార్శనికతకు మద్దతు ఇవ్వడానికి, పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఢిల్లీ లో ఇ -గ్రామ స్వరాజ్ 2.0 పై పరిశ్రమ సంప్రదింపులైన మంథన్: కొత్త మార్గాల అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ జాతీయ స్థాయి సదస్సు ప్రారంభ సభకు పంచాయతీరాజ్ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ నేతృత్వం వహించారు.

 

సదస్సు కు అజెండాను నిర్దేశిస్తూ, గ్రామీణ పాలన మెరుగుదల ద్వారా సామాజిక, ఆర్థిక, పర్యావరణ దీర్ఘకాల శ్రేయస్సు కు డిజిటల్ టూల్స్ అండ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడం గురించి డాక్టర్ చంద్రశేఖర్ కుమార్ వివరించారు. అభివృద్ధి పథంలో అర్థవంతమైన పాత్ర పోషించడానికి సాంకేతిక సాధనాలు, వనరులను సమకూర్చడం ద్వారా ప్రాంతీయ, స్థానిక ప్రభుత్వాల పరిపాలనా సామర్థ్యాన్ని, సమర్థతను పెంపొందించాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సాంకేతిక ఆధారిత పాలనా నిర్మాణం ఒక ఉమ్మడి వ్యూహాత్మక ప్రోగ్రామింగ్ ఫ్రేమ్ వర్క్ పై ఆధారపడి ఉండాలి, ఇది బాగా నిర్వచించబడిన ఆర్థిక, సామాజిక పర్యావరణ లక్ష్యాలకు అన్ని జోక్యాలను లక్ష్యంగా చేసుకుంటుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా ప్రభుత్వ చర్యల చేరిక, పరిధి, ఫలితాన్ని పెంపొందించాలి. ఈ ప్రయత్నంలో పరిశ్రమ, పరిశోధకులు, అభ్యాసకులు, నాలెడ్జ్ ప్రొవైడర్లు, పౌర సమాజం,ప్రభుత్వ అధికారులు శాస్త్ర, సాంకేతిక పురోగతి నుండి ఉత్పన్నమయ్యే అవకాశాలను మరింత మెరుగ్గా ఉపయోగించు

కోవడానికి ,భాగస్వామ్యం చేయడానికి కలిసి పనిచేయాలి.

 

"డిజిటల్ ఇండియా" కార్యక్రమం కింద భారత ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు చివరి మైలు వరకు అందించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చనే దానిపై ఎన్ఇజిడి ప్రెసిడెంట్ ,సిఇఒ శ్రీ అభిషేక్ సింగ్ కీలకోపన్యాసం చేశారు. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల్లో డిజిటల్ జోక్యాలు దేశ పౌరులకు పారదర్శకత, సమర్థత, సకాలంలో సేవలను అందజేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న కొత్త తరం  సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ సంస్థలు మెరుగైన అమలు ,పర్యవేక్షణ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో కూడా శ్రీ సింగ్ ప్రస్తావించారు.

 

పంచాయితీరాజ్ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అలోక్ పి నాగర్ తన స్వాగతోపన్యాసంలో, డిజైన్, ఐ సి టి అప్లికేషన్ ల మోహరింపు, స్థాయి పెంపు తో గ్రామ పంచాయితీ స్థాయిలో డిజిటల్ పరిష్కారాల కోసం రంగాల వారీగా, పూర్తి-ప్రభుత్వ విధానంతో వచ్చే తరం టెక్నాలజీ జోక్యాలను అనివార్యంగా అవలంబించాలని పిలుపునిచ్చారు.

 

గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మార్పును పెంపొందించే దిశగా కొత్త ప్రారంభాన్ని సూచిస్తూ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఇండస్ట్రీ కన్సల్టేషన్ లో డెలాయిట్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, క్లౌడ్ థాట్, మిన్ఫీ, నోలారిటీ, కోరోవర్, పేటీఎం, ఫోన్ పేకు చెందిన ఇండస్ట్రీ లీడర్లు పాల్గొన్నారు.

 

ఈ సదస్సు ప్రభుత్వ పరిధి లోని వివిధ సాంకేతిక ఆధారిత ఆవిష్కరణలపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖల దార్శనికత విజిబిలిటీని విస్తృతం చేసింది, గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న ఇ-గ్రామ్ స్వరాజ్ పరిష్కారానికి మించి సాంకేతిక పరిష్కారాల కోసం పెరుగుతున్న ఆకలికి మరింత ఆజ్యం పోసింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న ఈ-గ్రామ్ స్వరాజ్ పరిష్కారానికి మించి సాంకేతిక పరిష్కారాల కోసం పెరుగుతున్న ఆకాంక్షకు ఈ సదస్సు మరింత ఉత్తేజాన్ని అందించింది. మహాత్మాగాంధీ నిర్దేశించిన గ్రామ స్వరాజ్య దార్శనికతను సాధించడానికి ఇది గ్రామీణ మార్పుకు దోహదం చేస్తుంది.

 

********



(Release ID: 1894837) Visitor Counter : 200


Read this release in: English , Urdu , Hindi