శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మధుమేహం, ఊబకాయం మరియు ఇతర రుగ్మతలకు సాంప్రదాయ మిల్లెట్ ఆహారం ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


మనకు అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు మరియు ఫైబర్ మిల్లెట్స్‌లో పుష్కలంగా ఉంటాయి. బియ్యం మరియు గోధుమలతో చేసే అన్ని వంటకాలను మిల్లెట్‌ల నుండి కూడా తయారు చేయవచ్చని అంతగా తెలియని వాస్తవం.

ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన తర్వాత ప్రస్తుతం మిల్లెట్స్ కోసం అలా చేయాల్సిన సమయం వచ్చింది.

మిల్లెట్స్‌పై “డెస్క్‌టాప్ క్యాలెండర్ 2023ని కూడా విడుదల చేసిన మంత్రి

Posted On: 30 JAN 2023 7:08PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ; ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఓఎస్ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్, డయాబెటాలజిస్ట్ మరియు వైద్య నిపుణులు కూడా అయిన డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ..మధుమేహం, స్థూలకాయం మరియు ఇతర రుగ్మతలకు సాంప్రదాయ మిల్లెట్ ఆహారం ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. మిల్లెట్స్‌లో అవసరమైన విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బియ్యం మరియు గోధుమలతో తయారు చేసే అన్ని వంటకాలను మిల్లెట్‌ల నుండి కూడా తయారు చేయవచ్చని చాలామందికి తెలియదని తెలిపారు.

 

అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ జరిగిన “సిఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్స్ ఆన్ మిల్లెట్స్” అనే ప్రత్యేక కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ కీలకోపన్యాసం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ యోగాను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన తర్వాత ఇప్పుడు మిల్లెట్స్ కోసం అలా చేయాల్సిన సమయం వచ్చిందని అన్నారు. తెలిసిన 12 రకాల మిల్లెట్‌లలో 10 భారతదేశంలో పండించబడుతున్నాయని, ఇందులో సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లు ఉంటాయన్నారు. జీర్ణం కావడానికి నెమ్మదిగా ఉంటాయని అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలకు ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు.


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవతో డిసెంబర్ 2014లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) ఐడివై తీర్మానం  ఏకగ్రీవ సమ్మతితో ఆమోదించబడిన తర్వాత మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న జరుపుకున్నారని మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు, అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడివై) ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఐక్యరాజ్యసమితి గత సంవత్సరం 2023ని “అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం”గా ప్రకటించింది. దీనికి 72 ఇతర దేశాలు మద్దతు ఇచ్చాయని మంత్రి తెలియజేశారు.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ సందర్భంగా ఎగ్జిబిషన్‌ను కూడా ప్రారంభించారు. “ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్-2023” వేడుకల్లో భాగంగా సిఎస్‌ఐఆర్‌-ఎన్‌పిఎల్‌లో మిల్లెట్స్‌పై డెస్క్‌టాప్ క్యాలెండర్ 2023ని విడుదల చేశారు. ఎగ్జిబిషన్‌లో సిఎస్‌ఐఆర్-సిఎఫ్‌టిఆర్‌ఐ మరియు ఇతర సిఎస్‌ఐఆర్ ల్యాబ్‌లలో అభివృద్ధి చేయబడిన ఉత్పత్తులు మరియు సాంకేతికతల ప్రదర్శన ఉందని మరియు మిల్లెట్ ఆర్‌&డిలో సిఎస్‌ఐఆర్‌-సిఎఫ్‌టిఆర్‌ఐ సామర్థ్యాలను ప్రదర్శిస్తుందని మరియు జాతీయ సంస్థలోని మిల్లెట్ ఆధారిత సాంకేతికతలపై వివిధ వాటాదారులకు చేరువవుతుందని మంత్రి తెలియజేశారు.

ప్రభుత్వ కార్యక్రమాలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మినుము వినియోగాన్ని ఎలా పునరుద్ధరించబోతున్నాయి మరియు రైతుల ఆదాయాన్ని ఎలా పెంచబోతున్నాయి అనే అంశాలను కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. సిఎస్‌ఐఆర్‌ ముఖ్యంగా సిఎస్‌ఐఆర్-సిఎఫ్‌టిఆర్‌ఐ మైసూరు ప్రాసెసింగ్ కోసం సాంకేతికతలు మరియు మెషినరీలను అభివృద్ధి చేయడం, మిల్లెట్ల నుండి విలువ జోడించిన ఉత్పత్తులను మరియు నైపుణ్యం అభివృద్ధి రంగంలో కూడా కృషి చేయడం అభినందనీయమన్నారు.

స్వతహాగా డయాబెటాలజిస్ట్ మరియు వైద్య నిపుణులు అయిన డాక్టర్ జితేంద్ర సింగ్  సమావేశంలో మాట్లాడుతూ మిల్లెట్ పోషక విలువలు అధికంగా ఉండే తృణధాన్యం అని అలాగే తృణధాన్యాల పంట గోధుమలు మరియు బియ్యం కంటే పోషకపరంగా అధిక ప్రోటీన్ స్థాయిలు మరియు మరింత అమైనో ఆమ్లం ప్రొఫైల్ సమతుల్యతను కలిగి ఉంటుందని చెప్పారు.

మిల్లెట్లు కరువును తట్టుకోగలవని తక్కువ నీటి అవసరంతోనే వీటిని పండించవచ్చని తక్కువ సారవంతమైన నేలలు మరియు కొండ ప్రాంతాలలో వీటిని సాగు చేయవచ్చని, అందువల్ల ప్రపంచంలోని దాదాపు అన్ని భౌగోళిక భూభాగాలు & ప్రాంతాలలో ఉత్పత్తి చేయవచ్చని మంత్రి తెలియజేశారు. వీటిలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు మరియు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్ మరియు జింక్ వంటి ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

మైసూర్‌లోని సిఎస్‌ఐఆర్‌-సిఎఫ్‌టిఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ శ్రీదేవి అన్నపూర్ణ సింగ్ కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. మిల్లెట్ ప్రాసెసింగ్ రంగంలో సిఎస్‌ఐఆర్‌ అందిస్తున్న ముఖ్య సహకారాన్ని తెలియజేశారు. ఈ ప్రాంతంలో సిఎస్‌ఐఆర్ ప్రయోగశాలలైన సిఎఫ్‌టిఆర్‌, మైసూరు,ఎన్‌ఐఐఎస్‌టీ, తిరువనంతపురం మరియు ఐహెచ్‌బిటీ, పాలంపూర్‌ల సహకారాన్ని కూడా ఆమె వివరించారు.

సిఎస్‌ఐఆర్-సిఎఫ్‌టిఆర్‌ఐ ఇతర విజయాలతో పాటు మిల్లెట్‌లపై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ సిఎఫ్‌టిఆర్‌ఐ సహకారాన్ని హైలైట్ చేయడానికి 2023 జూన్ రెండవ వారంలో “ఒక వారం ఒక ప్రయోగశాల” కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని డాక్టర్ శ్రీదేవి తెలియజేశారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి, సిఎస్‌ఐఆర్‌ వైస్ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ జితేంద్ర సింగ్  ఆలోచన ద్వారా ఈ కార్యక్రమం రూపకల్పన జరిగింది.

గౌరవ అతిథిగా న్యూఢిల్లీలోని సిఎస్‌ఐఆర్-ఎన్‌పిఎల్ డైరెక్టర్ డాక్టర్ వేణుగోపాల్ ఆచంట పాల్గొని స్వాగతోపన్యాసం చేశారు. సిఎస్‌ఐఆర్-సిఎఫ్‌టిఆర్‌ఐ సాంకేతికతలను తీసుకున్న ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ప్రతినిధులు, వారి అనుభవాలను పంచుకున్నారు. వారికి మద్దతు అందించినందుకు సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, నియంత్రణ సంస్థల నుండి వివిధ కార్యదర్శులు & అధికారులు, సిఎస్‌ఐఆర్ సంస్థల డైరెక్టర్లు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు, పారిశ్రామిక భాగస్వాములు మరియు విద్యార్థులు 600 మందికి పైగా పాల్గొన్నారు.

కార్యక్రమంలో భాగంగా నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక భాగస్వాములతో ముఖాముఖి నిర్వహించారు. మిల్లెట్స్ అని పిలువబడే చిన్న విత్తనాల గడ్డి యొక్క విభిన్న సమూహంలో జొవర్ (జొన్న), రాగి (ఫింగర్ మిల్లెట్), కోడో (కోడో మిల్లెట్), కుట్కి (చిన్న-మిల్లెట్), కాకున్ (ఫాక్స్‌టైల్ - మిల్లెట్), సన్వా (బార్న్యార్డ్- మిల్లెట్), చీనా  (ప్రోసో మిల్లెట్), కుట్టు (బుక్వీట్) మరియు చౌలై (ఉసిరికాయ)  వంటివి ఉన్నాయి. ఐక్యరాజ్యసమితికి చెందిన  ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ), ఇటలీలోని రోమ్‌లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ - 2023 (ఐవైఎం2023) ప్రారంభ వేడుకను నిర్వహించిందని గుర్తుంచుకోవాలి. వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరంద్లాజే నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం మరియు ఇతర సీనియర్ అధికారులు ప్రారంభ వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వారా భారతదేశం యొక్క ఉత్సవ సందేశాన్ని సుశ్రీ శోభా కరంద్లాజే అందించారు.

భారతదేశం 170 లక్షల టన్నులకు పైగా మిల్లెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. తద్వారా ఆసియాలో 80 శాతం మరియు ప్రపంచ ఉత్పత్తిలో 20 శాతం వాటాను మనదేశం కలిగి ఉంది.


 

*****


(Release ID: 1894836) Visitor Counter : 225


Read this release in: English , Urdu , Hindi , Marathi