విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత అధ్యక్షతన జరిగే మొదటి జీ20 ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి బెంగళూరు ఆతిథ్యం

Posted On: 30 JAN 2023 10:46AM by PIB Hyderabad

భారత అధ్యక్షతన మొదటి జీ20 ఎనర్జీ ట్రాన్సిషన్ వర్కింగ్ గ్రూప్ (ఈటీడబ్ల్యుజీ)  సమావేశం, ఫిబ్రవరి 5-7, 2023 వరకు బెంగళూరులో జరుగనుంది. ఈ సమావేశంలో జీ20 సభ్య దేశాలు పాల్గొన్నారు. బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, సింగపూర్, యుఏఈ మరియు స్పెయిన్ వంటి తొమ్మిది ప్రత్యేక ఆహ్వానిత అతిథి దేశాల వారితో పాటుగా 150 మంది ఈ సమావేశాలలో  పాల్గొననున్నారు. దీనికి  తోడు  ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (యు.ఎన్.డి.పి), ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ), క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ (సీఈఎం), యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (యుఎన్ఈపీ), ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ( ఐఎస్ఏ), యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (యుఎన్డీఓ), యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమీషన్ ఫర్ ఆసియా అండ్ పసిఫిక్ (యునెస్క్యాప్), ఆర్డీ20 మరియు నాలెడ్జ్ పార్టనర్‌లు ఈ సమావేశంలో పాలు పంచుకోనున్నారు.  సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారులు కూడా ఈటీడబ్ల్యుజీ సమావేశంలో పాల్గొంటారు.  ఈ సమావేశానికి కర్ణాటక మద్దతు మరియు సమన్వయాన్ని అందించనుంది.

 

 

ఆరు ప్రాధాన్యతా రంగాలపై దృష్టి..

 మొదట ఈటీడబ్ల్యుజీ సమావేశం ఆరు ప్రాధాన్యతా రంగాలపై దృష్టి పెడుతుంది. వీటిలో ఇవి ఉన్నాయి:   (i) సాంకేతిక అంతరాలను పరిష్కరించడం ద్వారా శక్తి పరివర్తన (ii) శక్తి పరివర్తన కోసం తక్కువ-ధరలో ఆర్థిక తోడ్పాటు (iii) శక్తి భద్రత మరియు విభిన్న సరఫరా గొలుసులు  (iv)  శక్తి సామర్థ్యం, పారిశ్రామిక తక్కువ కార్బన్ పరివర్తనాలు మరియు బాధ్యతాయుతమైన వినియోగం, (v) ఇంధనాలు భవిత (vi) క్లీన్ ఎనర్జీ ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తేవడం, సరసమైన ధరలకు కలుపుకొని శక్తి పరివర్తన మార్గంలో ముందుకు సాగడం.  మరోవైపు, ఈటీడబ్ల్యుజీ సమావేశం ‘కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ మరియు స్టోరేజ్ (సీసీయుఎస్)’పై ఉన్నత స్థాయి అంతర్జాతీయ సెమినార్‌తో అనుబంధంగా సమావేశాలను నిర్వహిస్తుంది.  నికర-సున్నా లక్ష్యాలను సాధించడానికి కీలకంగా భావించే కార్బన్ క్యాప్చర్, వినియోగం మరియు నిల్వ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేయడంపై సెమినార్ ప్రధానంగా దృష్టి సారిస్తుంది. సంగ్రహించడం నుండి నిల్వ మరియు వినియోగ మార్గాల వరకు విలువ గొలుసు యొక్క వివిధ సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నప్పుడు స్వచ్ఛమైన శక్తి పరివర్తన మరియు వాటిని పరిష్కరించడంలో సీసీయుఎస్ పాత్ర యొక్క సవాలు అంశాలను ఈ ఈవెంట్ ఉద్దేశపూర్వకంగా ప్రధానంగా చర్చిస్తుంది. ఈ ఈవెంట్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ప్రతిరూపం చేయగల విజయవంతమైన కార్యక్రమాల నుండి జ్ఞానాన్ని పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది.

వివిధ ప్రాజెక్టుల సందర్శన..

మొదటి ఈటీడబ్ల్యుజీ సమావేశంలో భాగంగా, ప్రతినిధులు ఇన్ఫోసిస్ గ్రీన్ బిల్డింగ్ క్యాంపస్ మరియు పావగడ సోలార్ పార్క్‌లను కూడా సందర్శిస్తారు, భారతదేశం పునరుత్పాదక రంగం వైపు మరియు వాతావరణ మార్పులను తగ్గించే ప్రయత్నాలను ప్రత్యక్షంగా ఈ సర్యటనలో చూపించనున్నారు.  ప్రతినిధులు కర్ణాటక గొప్ప సాంస్కృతిక వారసత్వం, కళ, సంస్కృతి మరియు వంటకాలను కూడా ఈ సమావేశంలో భాగంగా రుచి చూడనున్నారు.  ఈటీడబ్ల్యుజీ కోసం భారత ప్రభుత్వం విద్యుత్ మంత్రిత్వ  శాఖ నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తుంది. కేంద్రీకృత ప్రాధాన్యతా ప్రాంతాలపై చర్చలకు నాయకత్వం వహిస్తుంది.  భారత్ అధ్యక్షునిగా  నాలుగు ఈటీడబ్ల్యుజీ సమావేశాలు, వివిధ సైడ్ ఈవెంట్‌లు మరియు మంత్రివర్గ సమావేశం ప్రణాళిక చేయబడింది. భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ మునుపటి ప్రెసిడెన్సీల ప్రయత్నాలు మరియు ఫలితాలపై ఆధారపడి ఉంటుంది, ఇది స్వచ్ఛమైన ఇంధన పరివర్తనలో ప్రపంచ సహకారం యొక్క కారణాన్ని విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లింది. 

***


(Release ID: 1894791) Visitor Counter : 187