భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

లక్షద్వీప్‌ (ఎస్‌టీ) లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ నిలిపివేత, వాయిదా

Posted On: 30 JAN 2023 5:12PM by PIB Hyderabad

1.       భారత ఎన్నికల సంఘం, 18.01.2023న, లక్షద్వీప్‌ (ఎస్‌టీ) లోక్‌సభ స్థానంతో పాటు అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడులోని 6 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నిక ప్రకటిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 27.02.2023 (సోమవారం) నాడు పోలింగ్, 02.03.2023 (గురువారం) నాడు ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆ ప్రకటనలో పేర్కొంది.

2.       లక్షద్వీప్‌లోని కవరట్టి సెషన్స్ కోర్టు, లక్షద్వీప్‌ (ఎస్‌టీ) లోక్‌సభ సభ్యుడు మహమ్మద్ ఫైజల్‌ను ఒక కేసులో దోషిగా నిర్ధరించింది. న్యాయస్థానం తీర్పు వెలువడిన 11 జనవరి 2023 తేదీ నుంచి మొహమ్మద్‌ ఫైజల్‌ను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడయ్యారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 102(1)(ఇ) నిబంధన, ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం మొహమ్మద్‌ ఫైజల్‌ను లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించారు.

3.       కవరట్టి సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ మహమ్మద్ ఫైజల్ కేరళ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కవరట్టి కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేస్తూ జనవరి 25, 2023న కేరళ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

4.       కేరళ హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్న భారత ఎన్నికల సంఘం, లక్షద్వీప్‌ (ఎస్‌టీ) పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికను నిలిపివేయాలని, 18.01.2023న జారీ చేసిన ప్రకటనను వాయిదా వేయాలని నిర్ణయించింది. 

 

****


(Release ID: 1894788) Visitor Counter : 182


Read this release in: English , Urdu , Hindi , Tamil