సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
ఉద్యోగ సృష్టికర్తల దేశంగా భారతదేశం ఎదుగుతోంది : శ్రీ జి. కిషన్ రెడ్డి
Posted On:
28 JAN 2023 4:51PM by PIB Hyderabad
ముఖ్యాంశాలు:
- ‘‘నేటి యువత ఉద్యోగాన్వేషకులు కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా ఉండాలి. భారతదేశం నేటి స్టార్ట్ అప్ ఎంగేజ్‌మెంట్ గ్రూప్‌కు అనువైన ప్రదేశం. ఎందుకంటే మనం $350 బిలియన్ డాలర్ల విలువ గలిగిన 100 కంటే ఎక్కువ యునికార్న్‌లతో దాదాపు 85,000 రిజిస్టర్డ్ స్టార్టప్‌లను కలిగి ఉన్నాము: జి కిషన్‌రెడ్డి
- “మన స్టార్టప్‌లు కొత్త ఉత్పత్తులు మరియు అనుభవాలతో పాటుపెట్టుబడులను ఆవిష్కరిస్తున్నాయి. మన స్టార్టప్‌ల పర్యావరణ వ్యవస్థ యొక్క విజయం ఈ స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో మరియు చేయి పట్టుకోవడంలో ప్రభుత్వ అభిరుచి, పురోగతి మరియు ప్రాధాన్యతను సూచిస్తుంది : జి కిషన్‌రెడ్డి
- “భారతదేశం అందిస్తున్న 4-డిలను ఉపయోగించుకోవడంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. శక్తివంతమైన ప్రజాస్వామ్యంతో సబ్ కా సాథ్ సబ్ కా వికాస్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు డీకార్బనైజేషన్ ద్వారా అందరికీ అభివృద్ధి లభిస్తుంది: జి కిషన్ రెడ్డి
- "మనం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశం ఉంది మరియు ఆవిష్కరణకు కీలకమైన వనరుల్లో ఒకటిగా ఉంటుంది" :జి కిషన్ రెడ్డి
- "మన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో మరియు మన పర్యాటకులకు లీనమయ్యే అనుభవాన్ని అందించడంలో కొత్త సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా మాకు మార్గనిర్దేశం చేయడంలో వినూత్న పరిష్కారాలు మరియు కొత్త ఆలోచనలను కనుగొనడంలో సహాయపడటానికి నేను స్టార్టప్‌లను కూడా ఆహ్వానిస్తాను": జి కిషన్ రెడ్డి
ఈరోజు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో జరిగిన జీ-20 స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ ప్రారంభ సమావేశానికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాష్, జీ-20 షెర్పా, నీతి ఆయోగ్ సిఈఓ శ్రీ అమితాబ్ కాంత్, శ్రీ పరమేశ్వరన్ అయ్యర్, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధికారులు మరియు ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అలాగే జీ-20 దేశాల నుండి, పరిశీలక దేశాల నుండి ప్రత్యేక ఆహ్వానితులు, వివిధ బహుపాక్షిక సంస్థలు మరియు గ్లోబల్ మరియు ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ నుండి ప్రతినిధులు పాల్గొన్నారు.
'ఇన్నోవేటింగ్ ఫర్ అమృత్ కాల్, ఇండియా @ 2047' అనే థీమ్‌తో హాజరైన ప్రతినిధులు మరియు పాల్గొనేవారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ “ఈ థీమ్‌కు అనుగుణంగా, భారతదేశ అధ్యక్షతన ఈ జీ-20 ఉమ్మడి సహకారాన్ని లక్ష్యంగా చేసుకుని బాధ్యతాయుతంగా వ్యవహరించే కోర్సును నిర్దేశించడం లక్ష్యంగా పెట్టుకుందని అలాగే మనం సాధించిన విజయాలను పంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
అలాగే శ్రీ జి కిషన్ రెడ్డి భారతదేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్ గురించి కూడా మాట్లాడారు. "భారతదేశం నేటి స్టార్ట్ అప్ ఎంగేజ్‌మెంట్ గ్రూప్‌కు అనువైన ప్రదేశం. ఎందుకంటే మనం $350 బిలియన్ డాలర్ల మొత్తం విలువతో 100 కంటే యునికార్న్‌లతో దాదాపు 85,000 రిజిస్టర్డ్ స్టార్టప్‌లను కలిగి ఉన్నాము. ప్రపంచంలో మూడవ అత్యధిక సంఖ్యలో యునికార్న్‌లతో భారతదేశం ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండటానికి కొంత సమయం మాత్రమే ఉంది. “మన స్టార్టప్‌ల ద్వారా యువత ఉద్యోగార్ధులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలని కోరుకుంటున్నారు. మన స్టార్టప్‌లు కొత్త ఉత్పత్తులు మరియు అనుభవాలను ఆవిష్కరించడం, పెట్టుబడులను ఆవిష్కరిస్తున్నాయి. మన స్టార్టప్‌ల పర్యావరణ వ్యవస్థ విజయం ఈ స్టార్టప్‌లను ప్రోత్సహించడంలో మరియు చేయి పట్టుకోవడంలో ప్రభుత్వ అభిరుచి, పురోగతి మరియు ప్రాధాన్యతను సూచిస్తుంది. మన పెద్ద టాలెంట్ పూల్ మరియు డెమోగ్రాఫిక్ డివిడెండ్ భారతదేశాన్ని ఒక ఆదర్శ పెట్టుబడి ప్రదేశంగా మార్చింది” అని ఆయన చెప్పారు.
కార్యక్రమం తర్వాత కూడా కిషన్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు. “ప్రతినిధులను ఉద్దేశించి చేసిన నా ప్రసంగంలో మన సుసంపన్నమైన మరియు ప్రతిష్టాత్మకమైన సంప్రదాయాలు, సంస్కృతి 'అతిథి దేవో భవ' అలాగే 'వసుదైవ కుతంబాకం' గురించి మాట్లాడాను. ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో పరివర్తన సంస్కరణల ద్వారా భారతదేశ యొక్క డిజిటల్ ప్రయాణం గురించి మాట్లాడాను." అని ఆ ట్వీట్‌లో తెలిపారు.
సమావేశంలో శ్రీ జి కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ శక్తివంతమైన ఆవిష్కరణలు మరియు స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను ప్రోత్సహించడంలో భారత ప్రభుత్వం తీసుకున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. 1.25 బిలియన్ డాలర్ల (రూ. 10,000 కోట్లు) కార్పస్‌తో స్థాపించబడిన ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫర్ స్టార్టప్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) స్కీమ్ గురించి కిషన్ రెడ్డి మాట్లాడారు మరియు సుమారుగా 1.75 బిలియన్ డాలర్లు (రూ. 13,500 కోట్లు) పెట్టుబడుల గురించి కూడా ప్రసంగించారు. ప్రభుత్వ స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ పథకం 126 ఇంక్యుబేటర్లకు $60 మిలియన్ డాలర్లు (రూ. 455.25 కోట్లు) ఆమోదించింది. గత 7 ఏళ్లలో గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశం 41 స్థానాలు ఎగబాకడానికి భారత ప్రభుత్వ అవిశ్రాంత ప్రయత్నాలే కారణమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ భారతదేశం జీ-20 అధ్యక్షతను స్వీకరించడంపై ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఒప్‌ఎడ్ రాశారు. భారత అధ్యక్ష పదవి ప్రపంచాన్ని 4డీలపై దృష్టి సారించడానికి ఎలా వీలు కల్పిస్తుందో ఆ కథనంలో ఆయన రాశారు: డీ-ఎస్కలేటింగ్ కాన్ఫ్లిక్ట్‌లు, డిజిటలైజేషన్, డెవలప్‌మెంట్ ఈక్విటీబుల్ అండ్ ఇన్‌క్లూజివ్ మరియు డికార్బనైజేషన్‌తో క్లైమేట్ క్రైసిస్‌తో పోరాడటానికి ఉపకరిస్తాయన్నారు. సమావేశంలో ఈ ఆలోచనలను మరింత అనుసంధానిస్తూ కేంద్ర మంత్రి మాట్లాడుతూ “భారతదేశం అందిస్తున్న 4-డిలను ఉపయోగించుకోవడంలో స్టార్టప్‌లు కీలక పాత్ర పోషిస్తాయి. శక్తివంతమైన ప్రజాస్వామ్యం, అభివృద్ధి, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు గ్రీన్, హైడ్రోజన్ మరియు పునరుత్పాదక శక్తిలో అవకాశాలతో డీకార్బనైజేషన్‌తో మేము 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉద్భవించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాము మరియు ఆవిష్కరణ మా లివర్‌లలో ఒకటిగా ఉంటుంది”. అని తెలిపారు.
“భారతదేశం గొప్ప జీవన సాంస్కృతిక వారసత్వానికి నిలయం మరియు మనం నివసిస్తున్న ఈ గొప్ప నేలను అన్వేషించడానికి నేను ప్రతినిధులందరినీ ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ పూర్తి స్థాయిలో ఉండేలా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మునుపెన్నడూ లేని విధంగా భారతదేశం యొక్క సంపూర్ణ అనుభవం అందిస్తుంది. దేశంలోని స్థానిక సంస్కృతి, వంటకాలు మరియు కళలు మరియు చేతిపనులను మీరందరూ అనుభవించేలా చేయడంలో మేము జీ-20 షెర్పాతో కలిసి పని చేస్తున్నాము. ఈ స్టార్ట్-అప్ ఎంగేజ్‌మెంట్ గ్రూప్‌తో మన సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడంలో వినూత్న పరిష్కారాలు మరియు కొత్త ఆలోచనలను కనుగొనడంలో మరియు పర్యాటకులకు లీనమయ్యే అనుభవాన్ని అందించడంలో కొత్త సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా మాకు మార్గనిర్దేశం చేయడంలో సహాయపడటానికి స్టార్టప్‌లను కూడా ఆహ్వానిస్తాను" అని కిషన్ రెడ్డి తెలిపారు.
భారతదేశం జీ-20 అధ్యక్ష పదవిని డిసెంబర్ 1, 2022న సంవత్సర కాలానికి స్వీకరించింది. ఈ కాలంలో భారతదేశం 20 జీ-20 దేశాలు మరియు 9 అబ్జర్వర్ దేశాల నుండి దాదాపు 1 లక్ష మంది ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది. దేశంలోని 56 స్థానాల్లో 200 కంటే ఎక్కువ సమావేశాలు నిర్వహించబడతాయి. ఇందులో భాగంగా జీ20 స్టార్టప్20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ ప్రారంభ సమావేశానికి హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. స్టార్ట్‌అప్ 20 సైడ్ మీటింగ్ మరియు స్టార్ట్‌అప్ 20 సమ్మిట్ మీటింగ్‌లు వరుసగా గాంగ్‌టక్ మరియు గుర్గావ్‌లలో జరగాల్సి ఉంది.
******
(Release ID: 1894500)
Visitor Counter : 156