శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్టార్టప్‌ల అవకాశాల కోసం ఆలోచనా తీరు మార్చుకోండి


యువతకు కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ పిలుపు
కఠువాలో “యంగ్ స్టార్ట్-అప్ సమ్మేళనానికి” శ్రీకారం
సి.ఎస్.ఐ.ఆర్., సైన్స్-టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఆధ్వర్యంలో కార్యక్రమ నిర్వహణ..

ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలకు
ఇది అద్భుతమైన వేదిక: జితేంద్ర సింగ్..

భారతీయ సాంకేతిక, ఆర్థిక పయనంలో కీలకపాత్ర పోషించే
ఈ స్టార్టప్ అవకాశాన్ని వదులుకోరాదని కేంద్రమంత్రి పిలుపు

Posted On: 28 JAN 2023 4:40PM by PIB Hyderabad

  తమ ముంగిటికి వచ్చిన స్టార్టప్ అవకాశాలను అందుకునేందుకు వీలుగా యువత తమ ఆలోచనా సరళిని మార్చుకోవాలని కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ (స్వతంత్ర హోదా) సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు పిలుపునిచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లోని కఠువాలో వైజ్ఞానిక, పారిశ్రామిక పరిశోధనా మండలి (సి.ఎస్.ఐ.ఆర్.), కేంద్ర సైన్స్-టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “యంగ్ స్టార్ట్-అప్ సమ్మేళనాన్ని” ప్రారంభించిన అనంతరం డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోని ఆలోచనా తీరు,.. స్టార్టప్ సంస్కృతికి ఆటంకం కలిగిస్తోందని, ప్రధానంగా దేశం ఉత్తరాదిలో ఈ పరిస్థితి నెలకొన్నదని అన్నారు. స్వతంత్ర హోదా కలిగిన కేంద్ర సహాయమంత్రిగా, భూగోళ శాస్త్రాలు, ప్రధాని కార్యాలయ వ్యవహారాలు, సిబ్బది వ్వహారాలు, ప్రజా ఫిర్యాదులు , పెన్షన్లు, అణు విద్యుత్, అంతరిక్ష శాఖలను కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ పర్యవేక్షిస్తున్నారు.

 

 

Description: C:\Users\DELL\Downloads\Kathua 001.jpg

   స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తమ ఉద్యోగాలను వదులుకున్న ఇద్దరు బి-టెక్‌ అభ్యర్థులు, మరొక ఒక మెకానికల్ ఇంజనీర్‌తో సహా తమ అనుభవాలను వివరించిన నలుగురు యువకుల విజయ గాథలను కేంద్రమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించారు. సి.ఎస్.ఐ.ఆర్. ద్వారా తాను సారథ్యం వహించిన “మరువం విప్లవం” రిపబ్లిక్ దినోత్సవ శకటాల్లో భాగమైందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. రిపబ్లిక్ డే పరేడ్ శకటం ద్వారా ఈ విప్లవం దేశవ్యాప్త గుర్తింపును ప్రజాదరణ పొందిందని కేంద్రమంత్రి అన్నారు.

  జమ్మూ, కాశ్మీర్ నుంచి ఉద్భవించిన ‘పరువం విప్లవం’ ఆకర్షణీయమైన స్టార్ట్-అప్ అవకాశాలను అందిస్తోందని, మరువం సాగులోకి అడుగుపెట్టిన వారు దాని ద్వారా చక్కని ఆదాయాన్ని ఆర్జిస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ సూచించారు. అనేక మంది యువ పారిశ్రామికవేత్తలు తమ సొంత స్టార్ట్-అప్‌లను స్థాపించడం కోసమే బహుళజాతి సంస్థల్లో లాభదాయకమైన ఉద్యోగాలను కూడా వదలిపెట్టినట్టు ఆయన చెప్పారు. ఇందుకు కొన్ని ఉదాహరణలను ఆయనప్రస్తావించారు.

   జమ్ము కాశ్మీర్‌లోని  భౌగోళిక, వాతావరణ పరిస్థితులు ఔషధ, సుగంధ మొక్కల పెంపకానికి అనుకూలంగా ఉందని, అగ్రి-టెక్ స్టార్ట్-అప్‌లకు ఇక్కడ ఇదివరకెవరూ అన్వేషించని అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు.

 

    ఆపిల్ తోటల పునరుద్ధరణ కింద  జమ్మూ, కాశ్మీర్‌లో ఇప్పటి వరకు 40 తోటలను బయోటెక్ కిసాన్ హబ్ పునరుద్ధరించిందని, ఇక్కడ పాత తోటలను వినూత్నంగా తీర్చిదిద్దడానికి చాలా విభిన్నమైన పద్దతి ఉపయోగించారని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అగ్రిటెక్ స్టార్టప్‌ల ఏర్పాటుకు కేంద్ర బయోటెక్నాలజీ శాఖ (డి.బి.టి.), సీఎస్‌ఆర్‌ల ద్వారా పూర్తి సహాయాన్ని అందిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు.   ప్రపంచంలో అగ్రశ్రేణి దేశంగా ఎదగడానికి వీలుగా భారతదేశ సాంకేతిక, ఆర్థిక పయనంలో  ప్రముఖ పాత్ర పోషిస్తున్న స్టార్ట్-అప్ సానుకూల వాతావరణాన్ని వదులుకోరాదని కేంద్రమంత్రి జమ్మూ కాశ్మీర్ యువతకు పిలుపునిచ్చారు.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 ఆగస్టు 15న ఎర్రకోట బురుజులనుంచి  స్టార్ట్-అప్ ఇండియా, స్టాండ్-అప్ ఇండియా నినాదాన్ని అందించినప్పటి నుంచి భారతదేశంలో స్టార్ట్-అప్ సానుకూల వ్యవస్థ ఊపందుకుందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 2014లో 350దాకా స్టార్టప్‌ సంస్థలు దేశంలో ఉండగా, 2022 ఆగస్టులో ఈ సంఖ్య 75,000కు పెరిగిందని, ఇప్పుడు దేశంలోని 653 జిల్లాల్లో విస్తరించి ఉన్న 88,000 దాకా స్టార్ట్-అప్‌ సంస్థలు తొమ్మిది లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలను సృష్టించాయని అన్నారు. భారతదేశం కూడా 107 యునికార్న్‌ స్థాయి స్టార్టప్ కంపెనీలకు నిలయంగా మారిందని, వాటిలో 23 యూనికార్న్ సంస్థలు కేవలం 2022వ సంవత్సరంలోనే ఆవిర్భవించాయని అన్నారు.  ఎస్.టి.ఐ.I (సైన్స్, టెక్నాలజీ- ఆవిష్కరణల) నిచ్చెనపై భారతదేశం వేగంగా పైకి ఎగబాకుతోందనడానికి ఇదే సంకేతమని కేంద్రమంత్రి అన్నారు.

  గత కొన్నేళ్లుగా దేశంలో అగ్రి-టెక్ స్టార్ట్-అప్‌ల కొత్త ప్రభంజనం ఆవిర్భవించిందని, సరఫరా వ్యవస్థ నిర్వహణ, కూలింగ్-రిఫ్రిజిరేషన్, విత్తన యాజమాన్యం, పంపిణీకి సంబంధించిన సమస్యలను ఈ స్టార్టప్‌ సంస్థలే పరిష్కరిస్తున్నాయని, దీనితో రైతులతో విస్తృత శ్రేణి మార్కెట్లు అనుసంధానం అవుతున్నాయని చెప్పారు.

  అమృత కాలపు రానున్న 25 సంవత్సరాల కాలంలో భారతదేశ భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి జమ్మూ కాశ్మీర్‌, అనేక కొండ ప్రాంతాలతో పాటు హిమాలయ రాష్ట్రాలు గణనీయమైన కృషి చేయబోతున్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతాలన్నీ గతంలో తమ వనరులను పూర్తిగా  వినియోగించుకోలేదని అన్నారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రంగాలపై దృష్టి సారించడంతో 2047 నాటికి ప్రపంచ పీఠంపై భారత్‌ కీలకస్థానికి చేరబోతోందని అన్నారు.

    అంతకుముందు, కఠువాలోని వివిధ విద్యాసంస్థల విద్యార్థులు ఏర్పాటు చేసిన నమూనాలతో పాటు జమ్ము కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, తదితర ప్రాంతాల వ్యవస్థాపకులు ఏర్పాటు చేసిన స్టార్టప్ కియోస్క్‌లను కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో డి.డి.సి. వైస్ చైర్మన్ రఘునందన్ సింగ్ బబ్లూ, జమ్ములోని సి.ఎస్.ఐ.ఆర్.-ఐ.ఐ.ఐ.ఎం. డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస రెడ్డి, కథువా డిప్యూటీ కమిషనర్ రాహుల్ పాండే, కథువా ఎస్.ఎస్.పి. శివదీప్ సింగ్ జమ్వాల్, కఠువా జి.డి.సి. ప్రిన్సిపాల్ సోమనేష్ జస్రోతియా పాల్గొన్నారు.

  ప్రఖ్యాత పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రముఖులు, విద్యావేత్తలు, ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థల ప్రతినిధులు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్‌లు ఈ సదస్సులో పాల్గొన్నారు. సమ్మేళనం సందర్భంగా, స్థానిక ప్రగతిశీల రైతులు కూడా తమ విజయగాథలను, అనుభవాలను గురించి వివరించారు. సరైన పద్ధతిలో నిర్వహణను చేపట్టి, తమ ప్రయత్నాలు జయప్రదం అయ్యేలా తమకు గణనీయమైన మద్దతు అందించిన సి.ఎస్.ఐ.ఆర్.కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

 

<><><>


(Release ID: 1894392) Visitor Counter : 204


Read this release in: English , Urdu , Hindi , Tamil