సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ముంబైలోని కేవీఐసీలో ఖాదీ ఫెస్ట్ 2023 ప్రారంభం
Posted On:
28 JAN 2023 12:02PM by PIB Hyderabad
ముంబై లోని కేవీఐసీ ప్రధాన కార్యాలయంలో ఖాదీ ఫెస్ట్ 2023 ప్రారంభమయ్యింది. 2023 జనవరి 27 నుంచి ఫిబ్రవరి 24 వరకు జరిగే ప్రదర్శనను కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో కేవీఐసీ సీఈవో శ్రీ వినీత్ కుమార్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన శ్రీ మనోజ్ కుమార్ దేశంలో వెనుకబడిన, పేద వర్గాలకు చెందిన ప్రజలకు జీవనోపాధి కల్పించే బాధ్యతను కేవీఐసీ స్వీకరించింది అని అన్నారు. ప్రదర్శనలు, ఎగ్జిబిషన్ ద్వారా వేలాది మంది చేనేత కళాకారులు ఉత్పత్తి చేస్తున్న వస్తువులు ప్రజలకు పరిచయం అవుతాయని అన్నారు. దీని ద్వారా ఖాదీ సంస్థలు,పీఎంఈజిపి, ఎస్ ఎఫ్ యు ఆర్ టి ఐ లాంటి సంస్థలు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు దేశంలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా జరగాలని ఆయన సూచించారు.
ఖాదీ, గ్రామీణ వస్తువులను కొనుగోలు చేయాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుకు అనూహ్య స్పందన కనిపించిందని అనాన్రు. ప్రధానమంత్రి పిలిపు తర్వాత వస్తువుల అమ్మకాలు పెరిగాయని వివరించారు. ' స్థానికులకు సాధికారత, స్థానికం నుంచి ప్రపంచానికి చేరాలి 'అన్న ప్రధానమంత్రి కలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన స్థితిగతులు మెరుగు పరిచేలా విధులు నిర్వహించాలని సంస్థ ఉద్యోగులకు శ్రీ మనోజ్ కుమార్ సూచించారు.
ఢిల్లీలో నవంబర్ నెలలో జరిగిన ఐఐటిఎఫ్ -22 లో రికార్డు స్థాయిలో ఖాదీ అమ్మకాలు జరిగాయని అన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 2న ఢిల్లీ ఖాదీ ఇండియా అవుట్ లెట్ ఒకే రోజున 1.34 కోట్ల రూపాయల వ్యాపారం సాగించి సరికొత్త రికార్డు సృష్టించిందని ఆయన వివరించారు. గత ఏడాది దేశం లక్ష 15 వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఖాదీ, గ్రామీణ ఉత్పత్తుల వ్యాపారం జరిగింది. ఖాదీ ఫెస్ట్22 లో 3.03 కోట్ల రూపాయల విలువ చేసే విక్రయాలు జరిగాయని ఆయన వివరించారు.
ఖాదీ వస్తువులను గుర్తించి గౌరవించి కొనుగోలు చేయాలని శ్రీ మనోజ్ కోరారు కార్యక్రమంలో నాగాలాండ్ కు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత నీహునునో సోర్హి, కేరళకు చెందిన శ్రీ వి.పీ. అప్పుకుట్టాన్ లను సన్మానించారు.
ఈ ఖాదీ ఫెస్ట్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ ఇన్ స్టిట్యూషన్స్, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కు అనుబంధంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పీఎంఈజీపీ యూనిట్లు తమ ఉత్పత్తులను ప్రదర్శన, అమ్మకాల కోసం ప్రదర్శిస్తున్నాయి. కాటన్ ఖాదీ, ఖాదీ సిల్క్, పష్మినా, పాలీ వస్త్ర, పటోలా సిల్క్, కలంకారీ చీరలు, కంజీవరం సిల్క్, లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ చీరలు, తుస్సార్ సిల్క్, ఫుల్కారీ డ్రెస్ మెటీరియల్స్ మరియు ఖాదీ వస్త్రాలతో తయారు చేసిన ఇతర ఆకర్షణీయమైన దుస్తులు, మధుబని ప్రింట్స్, డ్రై ఫ్రూట్స్, టీ, కహ్వా, బ్యూటీ హెర్బల్, ఆయుర్వేద ఉత్పత్తులు, తేనె ఉత్పత్తులు, చేతితో చేసిన కాగితం ఉత్పత్తులు, గృహ అలంకరణ ఉత్పత్తులు, వెదురు ఉత్పత్తులు, కార్పెట్లు, కలబంద ఉత్పత్తులు, తోలు ఉత్పత్తులు మరియు అనేక ఇతర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి
***
(Release ID: 1894322)
Visitor Counter : 178