పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
చిరుతలను తిరిగి భారత్‌లో ప్రవేశపెట్టేందుకు దక్షిణాఫ్రికాతో కుదిరిన అంతర్ ప్రభుత్వ ఒప్పందం
Posted On:
27 JAN 2023 2:09PM by PIB Hyderabad
ఆసియాకు చెందిన దేశంలో తిరిగి చీతాను (చిరుత) ప్రవేశపెట్టేందుకు దక్షిణాఫ్రికా రిపబ్లిక్, భారత రిపబ్లిక్ అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి 2023లో తొలిబ్యాచ్‌గా 12 చిరుతలను దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడకు తరలించనున్నారు. ఇవి, 2022లో నమీబియా నుంచి భారత్‌కు తీసుకువచ్చిన ఎనిమిది చిరుతలతో కలిసి ఉంటాయి.
చిరుతల జనాభాను పునరుద్ధరించడం అన్నది భారత్‌కు ఒక ప్రాధాన్యత. ఇది కీలకమైన, సుదూర పరిరక్షణ పరిణామాలను కలిగి ఉండటంతో పాటుగా భారతదేశంలో చారిత్రాత్మక పరిధిలో చిరుతల క్రియాత్మక పాత్రను ఏర్పరచడమే కాక, స్థానిక సమూహాల జీవనోపాధి ఎంపికలను, ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి తోడ్పడడంతో సహా అనేక పర్యావరణ లక్ష్యాలను సాధిస్తుంది. ఫిబ్రవరిలో 12 చిరుతలను దిగుమతి చేసుకున్న అనంతరం, రానున్న ఎనిమిది నుంచి 10 ఏళ్ళ వరకు ప్రతి ఏడాది 12 చొప్పున ఈ చిరుతలను తీసుకురావాలన్నది ప్రణాళిక.
గత శతాబ్దంలో మితిమీరిన వేటలు, ఆవాసాలు కోల్పోవడం వంటి కారణాల వల్ల అంతరించిపోయిన ఈ విశేష జాతులను భారత రిపబ్లిక్ ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్ధన మేరకు ఈ చిరుతలను తిరిగి పూర్వశ్రేణి రాష్ట్రాలకు పరిచయం చేసే చొరవను నిర్వహిస్తున్నారు.
దక్షిణ ఆఫ్రికా జాతీయ జీవ వైవిధ్య సంస్థ (ఎస్ఎఎన్‌బిఐ), దక్షిణాఫ్రికా జాతీయ పార్కులు (ఎస్ ఎ ఎన్ పార్కులు), దక్షిణాఫ్రికాలోని చీతా రేంజ్ ఎక్స్‌పాన్షన్ ప్రాజెక్ట్ అండ్ ఎండేంజర్డ్ వైల్డ్ లైఫ్ ట్రస్ట్ (ఇడబ్ల్యుటి) సహకారంతో అటవీ , మత్స్య, పర్యావరణ శాఖ (డిఎఫ్ఎఫ్ఇ), జాతీయ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్‌టిసిఎ),వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఐఐ) ఈ బహుశాస్త్ర సంబంధిత అంతర్జాతీయ కార్యక్రమాన్ని సమన్వయ పరుస్తున్నాయి.
భారతదేశంలో చిరుతలను తిరిగి ప్రవేశపెట్టడంపై అవగాహన ఒప్పందం (ఎంఒయు) భారతదేశంలో ఆచరణీయ, సురక్షితమైన చిరుత జనాభాను ఏర్పరచేందుకు ఇరు పార్టీల మధ్య సహకారాన్ని సులభతరం చేయడమ కాక పరిరక్షణను ప్రోత్సహిస్తుంది. దీనితోపాటుగా చిరుత సంరక్షణను ప్రోత్సహించడానికి, పరిరక్షించేందుకు నైపుణ్యాలను పంచుకోవడానికి, భాగస్వామ్యానికి, సామర్ధ్య నిర్మాణానికి తోడ్పడుతుంది. మానవ- వన్యప్రాణుల మధ్య సంఘర్షణ పరిష్కారం, వన్యప్రాణులను పట్టుకొని మరొకచోట పునరావాసం కల్పించడం, ఇరు దేశాలలో వీటి పరిరక్షణలో సమాజాన్ని కలుపుకుపోవడం ఇందులో భాగం. అవగాహనా ఒప్పందం ప్రకారం, సాంకేతికతలు, నిర్వహణలో వృత్తినిపుణులకు శిక్షణ, విధానం, విజ్ఞానం బదిలీ ద్వారా భారీగా కార్నివోర్ (మాంసాహారం తీసుకునే జంతువుల) పరిరక్షణతో పాటుగా, ఇరు దేశాల మధ్య స్థానాంతరణం చేసిన చిరుతల ద్వైపాక్షిక సంరక్షణను ఏర్పాటు చేయడం కోసం ఇరు దేశాలు సహకరించుకుంటాయి.
ప్రతి ఐదేళ్ళకు ఎంఒయులోని అంశాలను అది సహేతుకంగా ఉండేందుకు సమీక్షిస్తారు.
మరింత సమాచారం కోసం మీడియా వారు దిగువన ఇచ్చిన నెంబర్లలో సంప్రదించవచ్చు -
అల్బీ మొడైస్ (అడవులు, మత్స్య, పర్యావరణ విభాగం, దక్షిణాఫ్రికా)ను +27 83 490 2871 అన్న నెంబర్‌పైన, డాక్టర్ ఎస్.పి. యాదవ్ (ప్రాజెక్ట్ టైగర్ అదనపు డైరెక్టర్ & నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ మెంబర్ సెక్రెటరీ, పర్యావరణం, అడవులు, పర్యావరణ మార్పు మంత్రిత్వ శాఖ) ఎంఎస్-ఎన్‌టిసిఎ@ ఎన్ఐసి. ఐఎన్ - (ms-ntca[at]nic[dot]in) ద్వారా సంప్రదించవచ్చు.
***
(Release ID: 1894139)
Visitor Counter : 277