సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
గణతంత్ర వేడుకల్లో ప్రదర్శన ఇవ్వనున్న వందే భారతం 2.0 కళాకారులతో శ్రీ జి.కిషన్ రెడీ భేటీ
కర్తవ్య పథ్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఆకర్షణీయ కార్యక్రమాలతో అలరిస్తున్న సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
వందేభారతం కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌కు గొప్ప, శక్తివంతమైన ఉదాహరణ: శ్రీ జి. కిషన్ రెడ్డి
నాడు పోస్టు చేయడమైనది:
25 JAN 2023 9:05PM by PIB Hyderabad
రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా కర్తవ్యపథ్ లో ప్రదర్శించే వందేభారతం 2.0 కళాకారులతో సంభాషించడానికి కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి నిన్న ఇందిరాగాంధీ స్టేడియంను సందర్శించారు.
ఈ పోటీ లో ఎంపికైన 479 మంది కళాకారులు 2023 గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా 'నారీ శక్తి' ఇతివృత్తంగా ప్రదర్శన ఇస్తారు.
ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘనమైన పరేడ్‌లో 'వందే భారతం నృత్యోత్సవం' పోటీల కింద ఎంపికైన కళాకారులు ప్రదర్శనలిచ్చి భారతదేశ విభిన్న సాంస్కృతిక, కళాత్మక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌కు గొప్ప, శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. ఈ సంవత్సరం కర్తవ్యపథ్ లో జాతీయ స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రంగురంగుల ఆకర్షణీయమైన శకటాన్ని ప్రదర్శిస్త్తోంది. భవిష్యత్ లో జరిగే వందేభారతం నృత్య పోటీ లు ఇంకా మెరుగుపరచడం కోసం అభిప్రాయాలను తెలియజేయాలని పాల్గొనేవారిని ఆయన కోరారు.
శక్తి రూపేణా సంస్థితా అనే పేరుతో ప్రదర్శించే సాంస్కృతిక శాఖ శకటం వెనుక శక్తి ఆరాధన ఇతివృత్తం ఉందని సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ అన్నారు.
నాట్యానికి సంగీతం రాజా భవతారిణి, అలోకనంద దాస్ గుప్తా స్వరపరిచారని, కూర్పు హిందుస్థానీ, కర్నాటిక్ , సమకాలీన జాజ్ అంశాలతో కూర్చి ఉందని తెలియజేశారు.



****
(రిలీజ్ ఐడి: 1893854)
సందర్శకుల సూచీ సంఖ్య : : 197