ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కేంద్ర పరోక్ష పన్నులు & కస్టమ్స్ శాఖ(CBIC), రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లోని 29 మంది అధికారులు మరియు సిబ్బంది 2023 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి అవార్డులను పొందడానికి ఎంపిక చేయబడ్డారు.

Posted On: 25 JAN 2023 1:51PM by PIB Hyderabad

ప్రతి సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ & కస్టమ్స్ అధికారులు మరియు సిబ్బంది వారి విధుల నిర్వహణలో శ్రేష్ఠతను సాధించడం మరియు నిర్వహించడం లో"ప్రాణాన్ని పణంగా పెట్టి అందించిన అనూహ్యమైన ప్రతిభావంతమైన సేవ" మరియు "ప్రత్యేకంగా విశిష్టమైన సర్వీస్ రికార్డ్" తో రాష్ట్రపతి అవార్డు ప్రశంసా పత్రాలు మరియు పతకాల మంజూరు కోసం పరిగణించబడతారు.  రిపబ్లిక్ డే సందర్భంగా ఈ అవార్డులను ప్రకటిస్తారు.

 

ఈ సంవత్సరం, 29 మంది అధికారులు/సిబ్బంది "ప్రత్యేకమైన విశిష్ట సేవా రికార్డు" తో రాష్ట్రపతి అవార్డు ప్రశంసా పత్రాలు మరియు పతకాల మంజూరు కోసం ఎంపిక చేయబడ్డారు.

 

ఈ అధికారులు సంవత్సరాలుగా వారి సంబంధిత సేవల రంగాలలో వారి ఆదర్శప్రాయమైన మరియు దోషరహిత పనితీరు ఆధారంగా ఎంపిక చేయబడ్డారు. ఈ ఏడాది ఎంపికైన వారిలో ప్రిన్సిపల్ చీఫ్ కమీషనర్, కమిషనర్, అడిషనల్ డైరెక్టర్ జనరల్, డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్, జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, సూపరింటెండెంట్, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, ఇన్‌స్పెక్టర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్‌గా పనిచేస్తున్న అధికారులు ఉన్నారు. వీరు ఏళ్ల తరబడి వివిధ రంగాల్లో శాఖకు సేవలందిస్తున్నారు.

 

గణతంత్ర దినోత్సవం, 2023 సందర్భంగా “ప్రత్యేకమైన విశిష్ట సేవా రికార్డు” కోసం రాష్ట్రపతి అవార్డు మరియు ప్రశంసా పత్రాలు మరియు పతకాల మంజూరు కోసం ఎంపిక చేయబడిన వారి హోదా మరియు వారి ప్రస్తుత పోస్టింగ్ స్థలంతో పాటుగా అధికారుల జాబితా క్రింద ఇవ్వబడింది. 

శ్రీమతి రంజనా ఝా, ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, బెంగళూరు జోన్;

శ్రీ వివేక్ ప్రసాద్, కమిషనర్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, గౌతమ్ బుద్ నగర్;

శ్రీ ప్రభజీత్ సింగ్ గులాటీ, అదనపు డైరెక్టర్ జనరల్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ విజిలెన్స్ (హెడ్ క్వార్టర్స్), న్యూఢిల్లీ;

శ్రీ వినాయక్ చంద్ర గుప్తా, అదనపు డైరెక్టర్ జనరల్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ డేటా మేనేజ్‌మెంట్, న్యూఢిల్లీ;

డాక్టర్ ఎన్. గాంధీ కుమార్, డైరెక్టర్ (రాష్ట్ర పన్నులు), రెవెన్యూ (హెడ్ క్వార్టర్స్), రెవెన్యూ డిపార్ట్‌మెంట్, న్యూఢిల్లీ;

శ్రీ కొట్రస్వామి మారేగౌద్ర, అదనపు డైరెక్టర్ (హెచ్ ఆర్ ఎం - 1), డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్, న్యూఢిల్లీ;

శ్రీ ఆనంద్ యశావంత్ గోఖలే, జాయింట్ కమిషనర్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (ఆడిట్-I), ముంబై;

శ్రీ అజయ్ కుమార్ బెనివాల్, అసిస్టెంట్ డైరెక్టర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, న్యూఢిల్లీ;

శ్రీ బిరంచి నారాయణ్ మిశ్రా, అసిస్టెంట్ కమిషనర్ (పోస్టల్ అప్రైజింగ్ విభాగం), ఇంపోర్ట్-II కమిషనరేట్, ముంబై జోన్-I;

శ్రీమతి ఏ. గీతా దేవానంద్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు & నార్కోటిక్స్, బెంగళూరు;

శ్రీ జె. ఫ్రెడ్రిక్ సర్గురు దాస్, సూపరింటెండెంట్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, కోయంబత్తూర్, చెన్నై జోన్;

శ్రీమతి ఎం. శాంతి, సూపరింటెండెంట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ విజిలెన్స్, సౌత్ జోనల్ యూనిట్, చెన్నై;

శ్రీమతి నదియా నయీమ్ షేక్, సూపరింటెండెంట్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, బేలాపూర్, ముంబై జోన్;

శ్రీ గైక్వాడ్ నితిన్ వినాయకరావు, సూపరింటెండెంట్, చీఫ్ కమీషనర్ కార్యాలయం, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, పూణే జోన్;

శ్రీ ప్రశాంత్ అరవింద్ రోహనేకర్, సూపరింటెండెంట్, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, పూణే-I, పూణే జోన్;

శ్రీ ప్రకాష్ ముసలియాత్, సూపరింటెండెంట్, కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్, కాలికట్, కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్, కొచ్చిన్, తిరువనంతపురం జోన్;

శ్రీ రోమియో లారెన్స్ అల్బుకెర్కీ, సూపరింటెండెంట్, నేషనల్ కస్టమ్స్ టార్గెటింగ్ సెంటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ అనలిటిక్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్, ముంబై;

శ్రీ ఎ. మురళి, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, చెన్నై జోనల్ యూనిట్;

శ్రీ జోఫీ జోస్, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కొచ్చిన్ జోనల్ యూనిట్;

శ్రీ ఆర్. గోవిందన్, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్, చెన్నై జోనల్ యూనిట్;

శ్రీ రవీందర్ యాదవ్, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఢిల్లీ జోనల్ యూనిట్;

శ్రీ రివాజ్ దోర్జయ్, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ ఇంటెలిజెన్స్, గౌహతి జోనల్ యూనిట్;

శ్రీ సంజయ్ కుమార్, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఢిల్లీ జోనల్ యూనిట్;

శ్రీ శైలేష్ వాసవన్ నాయర్, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ముంబై జోనల్ యూనిట్;

శ్రీ శ్రీరామ్ కె. నెల్లి, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, బెంగళూరు జోనల్ యూనిట్;

శ్రీ సిద్ధార్థ చక్రబర్తి, సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, కోల్‌కతా జోనల్ యూనిట్;

శ్రీ సురేష్ డీ. పీ., సీనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, బెంగళూరు జోనల్ యూనిట్;

శ్రీ వీ. మహేంద్రన్, ఇన్స్పెక్టర్, ప్రిన్సిపల్ కమీషనర్ కార్యాలయం, సీ జీ ఎస్ టీ, కోయంబత్తూర్, చెన్నై జోన్;

శ్రీ నవీన్ కుమార్, లోయర్ డివిజన్ క్లర్క్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (హెడ్ క్వార్టర్స్), న్యూఢిల్లీ.

 

****(Release ID: 1893798) Visitor Counter : 30