వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ఆహారం, వ్యవసాయం కోసం జంతు జన్యు వనరులు (ఎఎన్‌జిఆర్) పై జరిగిన ఎఫ్ఎఒ అంతర్ ప్రభుత్వ సాంకేతిక వర్కింగ్ గ్రూపు (ఐటిడబ్ల్యుజి) 12వ సెషన్‌కు వైస్-చైర్‌గా ఎన్నికైన భారత్
Posted On:
25 JAN 2023 10:24AM by PIB Hyderabad
ఇటీవలే రోమ్‌లో ముగిసిన ఆనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎఎన్‌జిఆర్ - జంతు జన్యు వనరుల)పై అంతర్ ప్రభుత్వ సాంకేతిక వర్కింగ్ గ్రూప్ 12 సెషన్ లో భారత్ వైస్ చైర్‌గా ఎన్నిక కావడమ కాక ఆసియా& పసిఫిక్ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించింది. ఈ సెషన్ 18 జనవరి నుంచి 20 జనవరి 2023 వరకు జరిగింది. జాతీయ కోఆర్డినేటర్, ఐసిఎఆర్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆనిమల్ సైన్సెస్) డాక్టర్ బి.ఎన్.త్రిపాఠీ సెషన్‌కు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించడమే కాక సమావేశ వివరాలను నివేదించే రపోర్టేర్‌గా వ్యవహరించారు.
ఎఫ్ఎఒకు చెందిన కమిషన్ ఆన్ జెనెటిక్ రిసోర్సెస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (సిజిఆర్ ఎఫ్ ఎ - ఆహారం, వ్యవసాయం కోసం జన్యు వనరులపై కమిషన్ ) ఈ వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసింది. ఇది సాంకేతిక అంశాలను సమీక్షించి, కమిషన్‌కు సలహాలు, సూచనలు ఇస్తూ, అంతర్జాతీయ స్థాయిలో ఎఎన్‌జిఆర్ కు సంబంధించిన కమిషన్ కార్యక్రమాలను అమలు చేస్తుంది.
ఐటిడబ్ల్యుజి 12వ సెషన్‌లో జంతు జన్యు వనరుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక అమలు, ఎఎన్‌జిఆర్ వైవిధ్యాన్ని పర్యవేక్షించడం, 3 కంట్రీ రిపోర్టు తయారీని సమీక్షించారు. ఇంకా, నెమరువేసిన ఆహారం జీర్ణం కావవడంలో సూక్ష్మజీవుల పాత్ర,పర్యావరణ మార్పును తగ్గించడం, స్వీకరించడంలో జన్యు వనరుల పాత్ర, ఎఎన్‌జిఆర్ అందుబాటు, లబ్ధుల పంపకం, డిజిటల్ సీక్వెన్స్ సమాచారం, జన్యువనరుల పరిరక్షణ, స్థిరవినియోగం వల్ల సంభావ్య చిక్కులు వంటి అజెండా అంశాలను చర్చించారు.
అంతకుముందు ఐటిడబ్ల్యుజి సెషన్‌లో, 16-17 జనవరి 2023న ఎఫ్ఎఒ కేంద్ర కార్యాలయంలో గ్లోబల్ నేషనల్ కోఆర్డినేటర్స్ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. వర్క్‌షాపులో దేశీయ జంతు వైవిధ్యం - సమాచార వ్యవస్థ (డిఎడి-ఐఎస్)కు సంబంధించిన డాటాను తాజా పరచడంలో దేశ అనుభవాలను పంచుకుని, జాతి నమోదు, నోటిఫికేషన్ తదితరాలు సహా దేశీయ జనాభాల జాబితా చేసేందుకు చట్రాన్ని అందించారు. జంతుకణాల జన్యు అంశాల క్రయోప్రిజర్వేషన్ (మంచులో ఉంచి పరిరక్షించడం), అంసఖ్యాకమైన ఎఎన్‌జిఆర్ డాక్యుమెంటీకరణ వంటి అంశాలను ఎస్‌డిజీ సూచీలను నెరవేర్చేందుకు జాతీయ ప్రాధాన్యతలుగా పెట్టుకోవడాన్ని సభ్యులు ప్రశంసించారు.
***
(Release ID: 1893631)
Visitor Counter : 216