మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

దేశ వ్యాప్తంగా ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం


5-రోజుల పాటు వివిధ కార్యకలాపాలు/కార్యక్రమాలు నిర్వహించిన రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు

Posted On: 24 JAN 2023 7:07PM by PIB Hyderabad

మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జాతీయ బాలికా దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరిగింది. లింగ వివక్షను తగ్గించడానికి , విద్య, ఆరోగ్యం పౌష్టికాహారం ప్రాముఖ్యతపై దృష్టి పెట్టడానికి, బాలికల హక్కుల గురించి అవగాహన కల్పించడానికి జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహించారు. 

ఈ ఏడాది ప్రజల భాగస్వామ్యంతో బాలికల దినోత్సవాన్ని నిర్వహించాలని మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆడపిల్లల విలువ తెలియజేసే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని 

 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా యంత్రాంగాలకు మంత్రిత్వ శాఖ సూచించింది. దీనిలో భాగంగా 2023 జనవరి 18 నుంచి 24వ తేదీ వరకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లా యంత్రాగాలు అనేక కార్యక్రమాలు నిర్వహించాయి. సామాజిక మాధ్యమాల్లో కార్యక్రమాలకు    ప్రచారం కల్పించడానికి  హ్యాష్‌ట్యాగ్ (#akamceIebratinggirlchildmwcd) ఏర్పాటు చేశారు. 

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు 5 రోజుల పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించాయి.  ప్రత్యేక గ్రామ సభ/మహిళా సభ, ప్రమాణ స్వీకార కార్యక్రమం/సంతకాల కార్యక్రమం, ఇంటింటికి వెళ్లే కార్యక్రమం, పాఠశాలల్లో  (ప్రభుత్వం/ప్రైవేటు) కార్యక్రమాలు నిర్వహించి బాలికల ప్రాధాన్యత, విలువ తెలియజేసే విధంగా  పోస్టర్లు/నినాదాలు / డ్రాయింగ్/వాల్ పెయింటింగ్ పోటీ వంటి కార్యక్రమాలు జరిగాయి. బాలికల ఆరోగ్యం  పోషకాహార సంబంధిత అంశాలపై పాఠశాలలు, సమాజ స్థాయిలో చర్చలు నిర్వహించి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు.   విద్య, క్రీడల్లో స్థానిక ఛాంపియన్‌గా నిలిచిన వారిని గుర్తించి సన్మానించారు.

వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో జరిగిన జాతీయ బాలికల దినోత్సవం కార్యక్రమం వివరాలు : 

1.మధ్యప్రదేశ్

రత్లాం జిల్లా

సంతకాల సేకరణ 

ప్రమాణ స్వీకార కార్యక్రమం

సెహోర్ జిల్లా

మొక్కలు నాటే కార్యక్రమం 

 ద్వార ప్రతిభ కనబరిచిన బాలికలను మెజిస్ట్రేట్ సన్మానించారు. 

2. ఉత్తర ప్రదేశ్

బస్తీ జిల్లా

 నాటకం ద్వారా ఆడపిల్లలకు విలువ ఇవ్వాలని అవగాహన కల్పించారు. 

భదోహి

సంతకాల సేకరణ,, నాటకాలు, స్థానిక ఛాంపియన్లకు సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. 

3. అస్సాం

సోనిత్‌పూర్

బాలికల సంరక్షణ కోసం పార్లమెంట్ సభ్యుడు, శాసనసభ్యుడు, సోనిత్‌పూర్ డిప్యూటీ కమిషనర్, విభాగ అధిపతులు, కార్యాలయ సిబ్బంది ప్రతిజ్ఞ తీసుకున్నారు.

పాఠశాలలో ప్రమాణ స్వీకార కార్యక్రమం,  పోస్టర్ తయారీ పోటీ  నిర్వహించారు.

బటాషిపూర్ పంచాయతీ, ధేకియాజులి

* కౌమార సాధికారత పై ప్రత్యేక గ్రామ సభ

* గృహాలు మరియు కమ్యూనిటీ హాళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు వంటి ప్రముఖ ప్రదేశాలలో బాలికా దినోత్సవం జరిగింది. 

4. గుజరాత్

గాంధీనగర్ జిల్లా

గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో నవజాత శిశువుకు ఆడబిడ్డ స్వాగతించే కిట్ పంపిణీ చేశారు. 

అనాథ బాలికలకు విద్య  కిట్‌లను పంపిణీ చేసి, చదువు, క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పిల్లలను సన్మానించి, మొక్కలు నాటారు .  

అమ్రేలి జిల్లా

జాతీయ బాలికా దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో క్రీడా రంగంలో ప్రశంసనీయమైన విజయాలు సాధించిన బాలికలను సత్కరించారు.

మహేసనా జిల్లా

రంగోలి, డ్రాయింగ్, మెహందీ పోటీలు నిర్వహించారు. 

5. ఒడిశా

ఖోర్ధా జిల్లా

బాలికల హక్కులపైఅవగాహన కల్పించేందుకు జనవరి 23, 24 న సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. వ్యాసరచన, నినాద  పోటీలు నిర్వహించి వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేపట్టారు. 

6. మహారాష్ట్ర

వార్ధా జిల్లా

పాఠశాలలో పోస్టర్ తయారీ కార్యకలాపాలు నిర్వహించిన అధికారులు  2023 జనవరి 24న జన జాగృతి ర్యాలీ నిర్వహించారు. 

****



(Release ID: 1893489) Visitor Counter : 261