వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాజస్థాన్ లోని కోటలో రెండు రోజుల అగ్రికల్చర్ ఫెస్టివల్-ఎగ్జిబిషన్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను ప్రారంభించిన లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా


మన రైతులు నూతన వ్యవసాయ పద్ధతులు, ఆవిష్కరణలు, విలువ జోడింపు, ప్రతి నీటిచుక్కకు ఎక్కువ పంట మొదలైన వాటిని అవలంబించినప్పుడు ఆత్మనిర్భర్ భారత్ సాకారం అవుతుంది:ఓం బిర్లా



కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ బడ్జెట్ కేటాయింపులు అనూహ్యంగా పెరిగాయి: కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి

Posted On: 24 JAN 2023 8:05PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ రాజస్థాన్ ప్రభుత్వ సహకారంతో, రాజస్థాన్ లోని కోట డివిజన్ ను వ్యవసాయ- గ్రామీణాభివృద్ధి రంగంలో అధునాతన, ప్రముఖ స్థానం లోకి తీసుకురావడానికి 2023 జనవరి 24-25 తేదీలలో కోట లోని దసరా మైదానంలో రెండు రోజుల వ్యవసాయ ఉత్సవం-ప్రదర్శన శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎగ్జిబిషన్ ను లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి ప్రారంభించారు.

 

(వాట్సప్ ఇమేజ్)

 

రాజస్థాన్ ప్రభుత్వ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ లాల్ చంద్ కటారియా, రాజస్థాన్ ప్రభుత్వ సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ ఉదయలాల్ అంజనా కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కు చెందిన సీనియర్ అధికారులు, సుమారు 15 వేల మంది రైతులు, అగ్రి స్టార్టప్ లు, కార్పొరేట్ బ్యాంకర్లు, ఎక్స్ టెన్షన్ వర్కర్లు, ప్రైవేటు వ్యవసాయ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు.

 

భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి (విస్తరణ) శ్రీ శామ్యూల్ ప్రవీణ్ కుమార్ స్వాగతోపన్యాసం చేశారు. రాజస్థాన్ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి దినేష్ కుమార్ ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

 

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా మాట్లాడుతూ, భారతదేశం వ్యవసాయ దేశమని, ఆహారోత్పత్తిలో మన దేశం ముందంజలో ఉందని అన్నారు. మారుతున్న వ్యవసాయ రంగంలో lసమకాలీన పద్ధతులను ఉపయోగించాలని, ఆవిష్కరణలను ఉపయోగించి, మన దేశం ప్రపంచంలో అగ్రగామి దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకోవా లని పిలుపు ఇచ్చారు. మన రైతులు నూతన వ్యవసాయ పద్ధతులు, ఆవిష్కరణలు, విలువ జోడింపు, బిందువుతో ఎక్కువ పంట మొదలైన వాటిని సాధించినప్పుడు ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) సాకారమవుతుందని ఆయన అన్నారు.

హార్టికల్చర్, స్టార్టప్స్, డ్రోన్ల వాడకం అవసరాన్ని వాడకాన్ని శ్రీ ఓం బిర్లా నొక్కి చెప్పారు. స్టార్టప్ ల ద్వారా కొన్ని చోట్ల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు కృషి చేశామని, మరికొన్ని చోట్ల ఉత్పత్తిని పెంచామని, కొన్ని చోట్ల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశామని, మరికొన్ని చోట్ల విలువ జోడింపు సాధించామని చెప్పారు.

 

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి రైతులనుద్దేశించి ప్రసంగిస్తూ, వ్యవసాయ రంగం ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, వ్యవసాయ ,రైతు సంక్షేమ శాఖ భారతీయ వ్యవసాయ పురోగతి కోసం అనేక ముఖ్యమైన పథకాలను అమలు చేసిందని అన్నారు. రైతుల పట్ల అంకితభావానికి, వారి ఆదాయాన్ని పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనమని అన్నారు. వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ బడ్జెట్ కేటాయింపుల్లో అనూహ్యమైన పెరుగుదల నమోదైందని పేర్కొన్నారు. వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ సంయుక్త బడ్జెట్ కేటాయింపులు 2013-14లో రూ.30,223.88 కోట్లు కాగా, 2022-23లో 4.59 రెట్లు పెరిగి రూ.1,38,920.93 కోట్లకు చేరుకున్నాయి.

 

రాజస్థాన్ ప్రభుత్వ వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ లాల్ చంద్ కటారియా మాట్లాడుతూ, రైతు ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి, కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, పశుపోషణ, సాంప్రదాయ వ్యవసాయం అవసరమని, వాటిని ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శిస్తున్నారని చెప్పారు. స్టార్టప్ ల ద్వారా రైతులకు ఎలా నిల్వ చేయాలి, తక్కువ నీటితో వ్యవసాయం ఎలా చేయాలి, తక్కువ ఖర్చుతో పొలాన్ని ఎలా దున్నాలి అనే సమాచారం లభిస్తుంది.

 

రాజస్థాన్ ప్రభుత్వ సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ ఉదయలాల్ అంజనా మాట్లాడుతూ, వ్యవసాయ శాఖ ,సహకార శాఖ రెండూ ఒకదానికొకటి పరిపూరకరమైనవని, ఇలాంటి మేళాలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించి వారి ఆర్థిక పరిస్థితిని బలోపేతం

చేయాలని అన్నారు.

 

లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి డ్రోన్ ను స్వయంగా ఎగురవేసి డ్రోన్ ప్రదర్శనను ప్రారంభించారు.

 

ఈ ఎగ్జిబిషన్ లో 150 స్టాళ్లను ఏర్పాటు చేసి రైతులకు వ్యవసాయానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. వ్యవసాయ రంగంలో స్టార్టప్ ల కీలక పాత్రను దృష్టిలో ఉంచుకుని ఈ ఎగ్జిబిషన్ లో 75 స్టార్టప్ ల స్టాళ్లను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల సమాచారాన్ని ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్ల ద్వారా అందిస్తున్నారు. వీటితో పాటు వ్యవసాయానికి సంబంధించిన వివిధ ఇన్ పుట్స్ సరఫరాకు సంబంధించిన ప్రైవేటు రంగ కంపెనీలు/సంస్థలు కూడా తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి.

 

రెండు రోజుల వ్యవసాయ ఉత్సవం, ఎగ్జిబిషన్ ,ట్రైనింగ్ ప్రోగ్రాం లాంఛనంగా ప్రారంభమైన అనంతరం వ్యవసాయం, ఉద్యానవన, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ తదితర అంశాలపై ఆధునిక, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై మూడు శిక్షణా తరగతి గదుల్లో సమాంతర రైతు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం మూడు ఆడిటోరియాల్లో రెండు చొప్పున శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. రైతులకు వివిధ సబ్జెక్టు నిపుణులు లాభసాటి వ్యవసాయం మెళకువలను బోధించారు. పంట ఉత్పత్తిలో నాణ్యమైన విత్తనాల సహకారం, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కిసాన్ బజార్, కోట డివిజన్ లో జామ, ఉసిరి సాగు, క్లైమేట్ స్మార్ట్ ఫార్మింగ్ పద్ధతులు, అదనపు ఆదాయం, ప్రాముఖ్యత కోసం గొర్రెల పెంపకం, సుస్థిర వ్యవసాయంలో నానో యూరియా వాడకం తదితర అంశాలపై ఆరు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.

 

భారత ప్రభుత్వ వ్యవసాయ, రైతు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి (ఎం అండ్ టీ) శ్రీమతి ఎస్.రుక్మిణి ధన్యవాదాలు తెలిపారు.

 

*****


(Release ID: 1893472) Visitor Counter : 359


Read this release in: English , Urdu , Hindi