రక్షణ మంత్రిత్వ శాఖ
ముగిసిన త్రివిధ దళాల ఉభయచర విన్యాసం ఎఎంపిహెచ్ఇఎక్స్-2023
Posted On:
24 JAN 2023 1:14PM by PIB Hyderabad
ద్వైవార్షిక ఆంఫీబియస్ ఎక్సర్‌సైజ్ (ఉభయచర విన్యాసం) ఎఎంపిహెచ్ఇఎక్స్ 2023ను 17 జనవరి 23 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో నిర్వహించారు. త్రిదళాలకు చెందిన అందరికీ అంతర్ కార్యాచరణ, సమన్వయ చర్యలను పెంచేందుకు ఉభయచరణ కార్యకలాపాలకు సంబంధించి బహుళ కోణాలలో సంయుక్త శిక్షణను ఇవ్వడం ఎఎంపిహెచ్ఇఎక్స్ లక్ష్యం. నేటివరకూ నిర్వహించిన ఎఎంపిహెచ్ఇఎక్స్ లలో కాకినాడలో చేపట్టిన ఎఎంపిహెచ్ఇఎక్స్ 23 అతి భారీది. దాదాపు ఐదురోజుల పాటు ఉభయచర కార్యకలాపాలకు సంబంధించిన అన్ని కోణాలలో అత్యంత సంక్లిష్టమైన విన్యాసాలను పాలుపంచుకున్న దళాలు చేపట్టాయి. ఈ విన్యాసం విజయవంతమైన ఉభయచర దాడితో ముగిసింది. దీనిని భారతీయ నావికా దళం, భారతీయ సైనిక దళ కమాండర్ల సమక్షంలో తూర్పు నావికాదళ కమాండ్ చీప్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్, ఎవిఎస్ఎం, ఎన్ఎం సమీక్షించారు.
భారత నావికాదళానికి చెందిన లార్జ్ ప్లాట్‌ఫాం డాక్ (ఎల్‌పిడి- పరికరాలు, దళాలు, సరుకును రవాణా చేసేందుకు వీలైన భారీ నౌక), ల్యాండింగ్ షిప్ (యుభయచర యుద్ధంలో భారీ పరికరాలు, దళాలను రవాణా చేసే నౌక), ల్యాండింగ్ క్రాఫ్ట్స్ (దళాలను భారీ నౌకల శత్రు భూమికి చేరవేసేందుకు ఉపయోగించే చిన్న పడవ), మెరైన్ కమెండోలు (ఎంఎఆర్‌సిఒఎస్)చ హెలికాప్టర్లు, విమానాలు కలిగిన అనేక ఉభయచర నౌకలు ఈ విన్యాసంలో పాల్గొన్నాయి. ప్రత్యేక దళాలు, శతఘ్ని దళాలు, సాయుధవాహనాలతో 900మంది సైనికులతో భారతీయ సైన్యం ఈ విన్యాసంలో పాల్గొంది. భారత వైమానిక దళానికి చెందిన జాగ్వార్ ఫైటర్లు, సి130 విమానాలు ఈ విన్యాసంలో పాల్గొన్నాయి.
ఉభయచర కార్యకలాపాల పూర్తి ప్రక్రియలను చేపట్టేందుకు మూడు దళాల మధ్య గల అద్భుతమైన సమన్వయాన్ని, ఉభయచర సామర్ధ్యాలను ధృవీకరిస్తూ దళాల సామర్ధ్యాలను ఎఎంపిహెచ్ఇఎక్స్ 2023 అద్భుతంగా ప్రదర్శించింది.
***
(Release ID: 1893288)
Visitor Counter : 285