నౌకారవాణా మంత్రిత్వ శాఖ

గుజరాత్ కాండ్లా దీనదయాళ్ పోర్టులో రూ.270 కోట్ల విలువైన ప్రాజెక్టు పనుల ప్రారంభం, శంకుస్థాపన


కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ చేతుల మీదుగా కార్యక్రమం

Posted On: 23 JAN 2023 6:06PM by PIB Hyderabad

కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఈ  రోజు గుజరాత్‌లోని కాండ్లాలోని దీనదయాళ్ పోర్టులో రూ. 270 కోట్ల  అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. కాండ్లాలోని దీనదయాళ్ పోర్టులో రూ.73.92 కోట్ల  వ్యయంతో చేపట్టిన అయిల్ జెట్టీ నెం.7 ప్రారంభించారు. ఎం.ఒ.పి.ఎస్.డబ్ల్యు శాఖ సహాయ మంత్రి శ్రీ శంతను ఠాకూర్, ఎం.ఒ.పి.ఎస్.డబ్ల్యు శాఖ సహాయ మంత్రి  శ్రీ శ్రీపాద్ నాయక్ మరియు ఇతర సీనియర్ ప్రముఖుల సమక్షంలో దీనిని ప్రారంభించారు.  ఈ జెట్టీ లిక్విడ్ హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 2.00 ఎంఎంటీపీఏలకు పెంచుతుంది. దీంతో  ప్రధానంగా వంటనూనెల వర్తకానికి ఇది దోహద పడుతుంది. భవిష్యత్ అవసరాలను తీరుస్తుంది మరియు నౌకల టర్న్-అరౌండ్ సమయాన్ని తగ్గిస్తుంది. ఈ టి-ఆకారపు జెట్టీ 110 మీ. పొడవు మరియు 12.40 మీ. వెడల్పు మరియు 65000 డి.డబ్ల్యూటీ మరియు 14 మీటర్ల లోతు వరకు గతపెద్ద పరిమాణంలో నౌకలను నిర్వహించగలదు.

ఈ ప్రాజెక్ట్ నిర్మాణ దశలో దాదాపు 1000 మందికి పైగా పరోక్షంగా మరియు దాదాపు 250 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తుంది.  ఆయిల్ జెట్టీ 8 నుండి 11 వరకు బ్యాకప్ ఏరియా అభివృద్ధికి సంబంధించిన మూడు ప్రాజెక్టులకు పునాది రాయి వేశారు. ఈ మూడు అభివృద్ధి పనుల వ్యయం రూ. 98.41 కోట్లు;  దీనికి తోడు రూ. 67 కోట్ల వ్యవయంతో చేపట్టి్న ఎల్.సి.236బీ నుండి సి.జె-16 వరకు 4 లేన్ల రహదారి అభివృద్ధి పనులు;  రూ. 39.66 కోట్ల వ్యయంతో  కార్గో జెట్టీలో గోపురం ఆకారంలో స్టోరేజీ షెడ్‌ నిర్మాణ పనులకు కూడా శ్రీ సోనోవాల్ పునాది రాయి వేశారు. ఈ సందర్భంగా శ్రీ సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులు పోర్ట్ మౌలికసదుపాయాలు దాని లాజిస్టిక్స్ పనితీరును పెంపొందించడంతో పాటు దాని మొత్తం లోతట్టు ప్రాంతాలకు మొత్తం ఆర్థిక వృద్ధిని పెంచుతాయి. నౌకల టర్నరౌండ్ సమయంలో మరింత మెరుగుదల మరియు కార్గోను వేగంగా తరలించడంతోపాటు ఓడరేవు యొక్క కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని కూడా ఆయా ఆభివృద్ధి పనులు మెరుగుపరుస్తాయి. కార్గో హ్యాండ్లింగ్‌లో దీనదయాళ్ పోర్ట్ దేశంలోనే నంబర్ వన్ పోర్ట్గా ఉంది అని అన్నారు, తాజా ప్రాజెక్టు పనుల  ద్వారా దీని సామర్థ్యం  మరింతగా పెరుగుతుందని, ఇది మొత్తం ప్రాంతానికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అన్నారు.

ఇతర ప్రాజెక్ట్‌ల ముఖ్యాంశాలు

1.     ఆయిల్ జెట్టీ 8 నుండి 11 వరకు బ్యాక్ అప్ ఏరియా అభివృద్ధి

• లిక్విడ్ కార్గోస్ నిల్వ సామర్థ్యం మరింతగా పెరుగుతుంది

• లిక్విడ్ టెర్మినల్ కోసం ప్రతిపాదించబడిన బ్యాక్-అప్ ప్రాంతంగా లిక్విడ్ కార్గోను వేగంగా తరలించడం ఆయిల్ జెట్టీల పనితీరుపై ఆధారపడి ఉంది, అందువల్ల ఇది టర్న్ అవుట్ సమయాన్ని తగ్గిస్తుంది.

       

             2.ఎల్.సి.236B నుండి సి.జె- 16 వరకు 4 లేన్ల రహదారి అభివృద్ధి.

• మెరుగైన కనెక్టివిటీ

• పోర్ట్ వద్ద ట్రాఫిక్ తగ్గింపు

  • 3. కార్గో జెట్టీలో గోపురం ఆకారపు నిల్వ షెడ్ నిర్మాణం
  • షెడ్‌లు 30 మీటర్ల విస్తీర్ణంలో, 9 నుండి 12 మీ. ఎత్తులో అడ్డంకులు లేని స్పష్టమైన విస్తీర్ణాన్ని అందించగలవు.
  • రూఫింగ్ ప్యానెల్లు యాంత్రికంగా సీమ్ చేయబడి ఉంటాయి (ఇంటర్‌లాక్డ్) మరియు రంధ్రాలు, గింజలు, బోల్ట్ అతివ్యాప్తి మరియు సీలాంట్లు లేకుండా ఉంటాయి, దాదాపుగా సున్నా నిర్వహణను నిర్ధారిస్తాయి.
  • ఈ నిర్మాణం సంప్రదాయ రూఫింగ్ సిస్టమ్‌తో పోలిస్తే 50% వరకు ఆర్థికంగా ఉంటుంది.

భారతదేశంలోని పోర్ట్ సెక్టార్ అభివృద్ధికి తన నిబద్ధతలో భాగంగా ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ  గుజరాత్ రాష్ట్రంలో సాగరమాల కార్యక్రమం కింద 57,000 కోట్లతో రూ. 74 ప్రాజెక్టులను గుర్తించింది.  ఇందులో 15 ప్రాజెక్టులు రూ. 9,000 కోట్లు పూర్తయ్యాయి; రూ. 25,000 కోట్లు కంటే ఎక్కువ విలువైన 33 ప్రాజెక్టులు. అమలులో ఉన్నాయి.  26 ప్రాజెక్టులకుసంబంధించి రూ. 22,700 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులను కేంద్రీయ మంత్రిత్వ శాఖలు, ప్రధాన నౌకాశ్రయాలు, రాష్ట్ర సముద్ర తీర బోర్డులు మరియు ఇతర రాష్ట్ర ఏజెన్సీలు అమలు చేస్తున్నాయి.

*****



(Release ID: 1893156) Visitor Counter : 152


Read this release in: English , Urdu , Hindi , Tamil