వ్యవసాయ మంత్రిత్వ శాఖ
రాజస్థాన్‌లోని కోటాలో రేపు రెండు రోజుల "కృషి-మహోత్సవ్: ప్రదర్శని ఏవం ప్రశిక్షణ్"ను నిర్వహించనున్న వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ
కార్యక్రమం సుమారు 35,000 మంది రైతులు పాల్గొనే అవకాశం, అధునాతన సాంకేతికత మరియు యంత్రాలపై వారికి శిక్షణ
లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ప్రారంభ వేడుకలకు నాయకత్వం వహిస్తారు; శ్రీ ఓం బిర్లా మరియు కేంద్ర మంత్రులు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మరియు శ్రీ పర్షోత్తమ్ రూపాలతోపాటు ప్రముఖులు ముగింపు వేడుకలకు హాజరవుతారు
Posted On:
23 JAN 2023 4:51PM by PIB Hyderabad
రాజస్థాన్ వ్యవసాయ శాఖ సహకారంతో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న రెండు రోజుల "కృషి-మహోత్సవ్: ప్రదర్శని ఏవం ప్రశిక్షణ్" జనవరి 24-25 తేదీలలో జరగనుంది. రాజస్థాన్‌లోని కోట డివిజన్‌ని వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి రంగంలో అగ్రగామిగా మార్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని కోటాలోని దసరా గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి, కేంద్ర పశుసంవర్ధక & మత్స్య శాఖ సహాయ మంత్రి డాక్టర్.సంజీవ్ బల్యాన్, రాజస్థాన్ రాష్ట్ర వ్యవసాయం మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ లాల్‌చంద్ కటారియా, మరియు రాజస్థాన్ సహకార శాఖ సహాయ మంత్రి శ్రీ ఉదయ్‌లాల్ అంజన ప్రారంభ వేడుకలో పాల్గొంటారు. వీరితో పాటు కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, భారత వ్యవసాయ పరిశోధన మండలి సీనియర్ అధికారులు, సుమారు 35,000 మంది రైతులు, అగ్రి స్టార్టప్‌లు, కార్పొరేట్ బ్యాంకర్లు, ఎక్స్‌టెన్షన్ వర్కర్లు, ప్రైవేట్ వ్యవసాయ సంస్థల ఉద్యోగులు కూడా హాజరు కానున్నారు.
కృషి మహోత్సవ్‌లో నిర్వహించే ఎగ్జిబిషన్ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎగ్జిబిటర్ల ద్వారా ప్రచారం చేయనున్నారు. అలాగే, వ్యవసాయానికి సంబంధించిన వివిధ ఇన్‌పుట్‌ల సరఫరాకు సంబంధించిన ప్రైవేట్ రంగ కంపెనీలు/సంస్థలు తమ ఉత్పత్తులను స్టాళ్ల ద్వారా ప్రదర్శిస్తాయి. ఈ ఎగ్జిబిషన్‌లో రైతులకు వ్యవసాయానికి సంబంధించిన తాజా సమాచారాన్ని అందించేందుకు 150 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వ్యవసాయ రంగంలో స్టార్టప్‌ల ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని 75 స్టార్టప్‌ల స్టాళ్లను ఏర్పాటు చేయడం ఈ ఎగ్జిబిషన్‌లోని ప్రధానాంశాల్లో ఒకటి.
ఈ కృషి మహోత్సవ్‌లో వ్యవసాయం, ఉద్యానవనం మరియు పశుపోషణకు సంబంధించిన అంశాలపై సుమారు 5,000 మంది రైతులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా రెండు సెషన్లలో నిర్వహించబడుతుంది. రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిపై ప్రత్యేక వర్క్‌షాప్ కూడా నిర్వహిస్తున్నారు. వ్యవసాయ పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ మండల కేంద్రాల శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ శాఖలోని అధికారులు మరియు ఉద్యోగులతో పాటు సుమారు 35,000 మంది రైతులు ఈ రెండు రోజుల గ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొననున్నారు.
వ్యవసాయంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించడానికి మరియు ఆధునిక వినూత్న వ్యవసాయ పద్ధతులను అవలంబించడానికి ఆసక్తి ఉన్న రైతులను మరింత ఎక్కువగా పాల్గొనేలా చేయడం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత. వ్యవసాయాన్ని లాభదాయకమైన వ్యాపారంగా మార్చేందుకు అధునాతన వ్యవసాయ ఉత్పత్తి వ్యవస్థ, కొత్త వ్యవసాయ సాంకేతికత మరియు అధునాతన వ్యవసాయ యంత్రాలను అనుసరించడానికి రైతులందరికీ ప్రోత్సాహం మరియు శిక్షణను ఈ కార్యక్రమంలో ఇవ్వబడుతోంది.
లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా, కేంద్ర వ్యవసాయ & రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ మరియు కేంద్ర పశుసంవర్ధక & మత్స్య శాఖ మంత్రి శ్రీ పర్షోత్తం రూపాలా, కేంద్ర వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరంద్లాజే మరియు రాజస్థాన్ రాష్ట్ర వ్యవసాయ, మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ లాల్‌చంద్ కటారియా ముగింపు కార్యక్రమంలో పాల్గొంటారు. ఎప్పటికప్పుడు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం మరియు రైతుల ఆదాయాన్ని పెంపొందించడంలో సహాయం చేయడానికి మరియు వ్యవసాయాన్ని సుస్థిరంగా మార్చడానికి ఈ ప్రాంత రైతులకు సరైన దిశానిర్దేశం చేయడం చాలా ముఖ్యం.
*****
(Release ID: 1893149)
Visitor Counter : 187