ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
నివాస కేంద్రీకరణ మరియు 'ఈజ్ ఆఫ్ లివింగ్' వంటి ఐదు ఫోకస్ ప్రాంతాలపై యుఐడీఏఐ చర్చ
Posted On:
20 JAN 2023 4:04PM by PIB Hyderabad
ఆధార్ దేశంలోని వయోజన జనాభా ప్రజల సంఖ్యలో సార్వత్రిక స్థాయికి చేరుకుంది. దీంతో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) ప్రజలకు వారి దైనందిన జీవితంలో నిరంతర సహాయాన్ని అందించడానికి, డేటా భద్రతను మరింత మెరుగుపరచడానికి, సుపరిపాలనను అందించే విషయమై ఐదు ప్రధాన రంగాలలో కీలకంగా పని చేయాలని యుఐడీఏఐ నిర్ణయించింది. నివాస కేంద్రీకరణ, ఆధార్ వినియోగాన్ని విస్తరించడం, భద్రత మరియు గోప్యత, నిరంతర సాంకేతికత అప్‌గ్రేడేషన్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతో సహకరించడం, ఎస్డీజీ 16.9 (అందరికీ చట్టపరమైన గుర్తింపును అందించడం) సాధించాలనే వారి ఆకాంక్షలో వారికి మద్దతు ఇవ్వడమనే ఐదు అంశాలపై ప్రధానంగా పని చేయాలని నిర్ణయించింది. కెవాడియా (గుజరాత్)లో జరిగిన మేథొమథన కార్యక్రమంలోఈ ఐదు ఫోకస్ ప్రాంతాలు చర్చించబడ్డాయి. ఈ సందర్భంగా యుఐడీఏఐ సీఈఓ డాక్టర్ సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో నివాసితులకు ఎలా తోడ్పాటు అందించాలనే దానిపై, సేవలను పొందడంలో వారి అనుభవాన్ని మెరుగుపరచడం ఎలా అనే దానిపై సంస్థ నిరంతరం దృష్టి సారిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. సులభంగా జీవించడానికి అలాగే సులభంగా వ్యాపారం చేయడానికి సౌకర్యాలను అందించేందుకు ఆధార్ వినియోగాన్ని విస్తరించడానికి సంస్థ మార్గాలను అందిపుచ్చుకుంటుందని అన్నారు. దీని శాండ్‌బాక్స్ తరహా వాతావరణం స్టార్టప్‌లు, నిపుణులు మరియు కంపెనీలు ఆధార్ వినియోగాన్ని పెంచడానికి ఇన్నోవేషన్ అప్లికేషన్‌లను అన్వేషించడానికి మరియు పరీక్షించడానికి అనుమతిస్తుంది. ఈ-కేవైసీ స్వీకరణను విస్తరించడం, నివాసితులకు మెరుగైన సర్వీసులను అందించడం కోసం ఆఫ్లైన్ ధ్రువీకరణను ప్రాచుర్యం పొందేందుకు, యుఐడీఏఐ అనేక మార్గాల్లో ఆధార్ వినియోగాన్ని విస్తరించడానికి ప్రయత్నిస్తుంది. సుపరిపాలన, సాధికారత మరియు సేవా బట్వాడా యొక్క సాధనంగా ఆధార్ ఉద్భవించింది. 2010లో మొదటి ఆధార్ నంబర్ను రూపొందించినప్పటి నుండి, యుఐడీఏఐ 1.35 బిలియన్లకు పైగా ఆధార్లను జారీ చేసింది మరియు ఇప్పటివరకు 88 బిలియన్లకు పైగా ప్రామాణీకరణ లావాదేవీలను నిర్వహించింది. ఈ సంఖ్య ఆధార్ నివాసితుల జీవితాలను ఎలా దగ్గరవుతోంది సూచిస్తుంది. యుఐడీఏఐ 2010 నుండి నివాసితుల నుండి వచ్చిన అభ్యర్థనలను అనుసరించి 710 మిలియన్లకు పైగా ఆధార్ నవీకరణలను కూడా అమలు చేసింది. డేటా భద్రత మరియు గోప్యత, నిరంతరాయంగా సేవలను అందించడం మరియు కొత్త యుగం సైబర్ సెక్యూరిటీ రిస్క్లను చురుగ్గా పరిష్కరించడానికి యుఐడీఏఐ టెక్నాలజీ అప్-గ్రేడేషన్లో ముందంజలో ఉంటుంది. పది సంవత్సరాల కిందట ఆధార్ను తీసుకొని, ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నడూ తమ సమాచారాన్ని అప్డేట్ చేసుకోని నివాసితులు తమ పత్రాలను అప్డేట్ చేసుకోవాలని యుఐడీఏఐ కోరింది. నివాసితులు సపోర్టివ్ డాక్యుమెంట్లు, (గుర్తింపు రుజువు మరియు చిరునామా రుజువు)ను ఆన్లైన్లో మైఆధార్ పోర్టల్ ద్వారా లేదా ఆఫ్లైన్లో సమీపంలోని ఆధార్ కేంద్రాన్ని సందర్శించి అప్లోడ్ చేయడం ద్వారా ఆధార్లను అప్డేట్ చేసుకోవచ్చని యుఐడీఏఐ తెలిపింది.
***
(Release ID: 1892669)
Visitor Counter : 176