సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

రైతులు, గిరిజనులు మరియు పంటలపై ఏనుగుల దాడులను తగ్గించడం లక్ష్యంగా కే వీ ఐ సీ రీ హాబ్ ప్రాజెక్ట్ హ‌నీ మిష‌న్ కార్య‌క్ర‌మం

Posted On: 20 JAN 2023 3:41PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హ‌నీ మిష‌న్ కార్య‌క్ర‌మం ద్వారా రీ హాబ్ ప్రాజెక్ట్ కింద క‌ర్ణాట‌క‌లోని ద‌క్షిణ క‌న్న‌డ‌లోని సులియాలో శిక్షణ పొందిన ల‌బ్దిదారుల‌కు తేనెటీగల కాలనీలు, తేనెటీగల పెంపకం పరికరాలు మరియు 200 తేనెటీగ పెట్టెలను కేవీఐసీ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ పంపిణీ చేశారు. 

 

ప్రాజెక్ట్ రీ-హాబ్ కింద, ఏనుగులు మానవ నివాసాలలోకి ప్రవేశించడాన్ని నిరోధించడానికి తేనెటీగ పెట్టెలను ఏనుగుల మార్గంలో ఏర్పాటు చేయడం ద్వారా "తేనెటీగ-కంచెలు" సృష్టించబడతాయి. పెట్టెలు తాడు తో అనుసంధానించబడి ఉంటాయి, తద్వారా ఏనుగులు పొలాల గుండా వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు, తాడు తగలడం లేదా లాగడం వల్ల తేనెటీగలు ఏనుగు సమూహాలపై గుంపులుగా దాడి చేసి వాటిని మరింత ముందుకు కదలకుండా చేస్తాయి.

 

ఇవి ఏనుగులకు ఎటువంటి హాని కలిగించకుండా మానవ-అడవి మృగాల ఘర్షణలను తగ్గించడానికి తక్కువ ఖర్చుతో కూడుకున్న మార్గం. తేనెటీగలు ఏనుగుల తొండం మరియు కళ్ల యొక్క సున్నితమైన లోపలి భాగాన్ని కొరుకుతాయనే భయం వల్ల తేనెటీగ సమూహాలకు ఏనుగులు భయపడతాయని శాస్త్రీయంగా నిరూపణ అయ్యింది. తేనెటీగల సామూహిక దాడి అలజడి సందడి ఏనుగులను చికాకుపెడుతుంది, ఇది వాటిని ఏనుగులను వెనుతిరిగి పోయేలా చేస్తుంది.

 

ఈ సందర్భంగా శ్రీ మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ వ్యవసాయ పొలాల్లో ఏనుగుల చొరబాట్లను అడ్డుకోవడంలో, వాటిని వెనుతిరిగి పోయేలా  చేయడంలో తేనెటీగలు రైతులకు సహకరిస్తున్నాయని గమనించారు. కే వీ ఐ సీ చొరవ తీసుకుని, కొడగు జిల్లా పొన్నంపేటలోని కాలేజ్ ఆఫ్ ఫారెస్ట్రీ సాంకేతిక సహాయంతో పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది వీటి ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. అందువల్ల, కర్ణాటకతో పాటు అస్సాం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఉత్తరాఖండ్ వంటి మోస్ట్ వాంటెడ్ రాష్ట్రాలలో ఇటువంటి 6 ప్రాజెక్టులు మంజూరు చేయబడ్డాయి.

 

రీ హాబ్ కింద రైతులకు తేనెటీగల పెంపకంలో శిక్షణ ఇస్తారు, ప్రతి రైతుకు 10 తేనెటీగ పెట్టెలు సరఫరా చేస్తారు వీటిని ఏనుగు కారిడార్‌లలో అమర్చుతారు కాబట్టి ఏనుగులు వ్యవసాయ క్షేత్రానికి చేరుకోకుండా నిరోధించడానికి ఏనుగు కారిడార్‌లో తేనెటీగ పెట్టెలు మరియు తేనెటీగ దద్దుర్లు ఉంచబడతాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ పొన్నంపేటలో చాలా మంచి ఫలితాలను చూపించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తేనె దిగుబడి వస్తుంది దానితో పాటు మెరుగైన పరపరాగసంపర్కం కారణంగా వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదల కి కూడా సహాయపడిందని ఆయన తెలియజేశారు.

 

ఈ పథకం యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం రైతులు ప్రయోజనం పొందాలని చైర్మన్, కే వీ ఐ సీ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కే వీ ఐ సీ - పీ ఎం ఈ జీ పి స్కీమ్  గురించిన వివరాలను కూడా పంచుకున్నారు, ఈ ప్రధానమంత్రి పథకం  రుణ పరిమితిని రూ. 25.00 లక్షల నుండి రూ. 50.00కి పెంచింది మరియు మహిళలు మరియు గ్రామీణ యువతను ఈ పథకాన్ని చేపట్టేలా ప్రోత్సహించింది.

******




(Release ID: 1892664) Visitor Counter : 193


Read this release in: English , Urdu , Marathi , Hindi