కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భార‌త‌దేశంలో స‌ముద్రం లోప‌ల కేబుల్ ల్యాండింగ్ కోసం రూపొందించిన‌ లైసెన్సింగ్ చ‌ట్రం & నియంత్ర‌ణా యంత్రాంగంపై సంప్ర‌దింపుల ప‌త్రంపై వ్యాఖ్య‌లు/ ప్ర‌తివ్యాఖ్య‌ల‌ను పంపేందుకు ఆఖ‌రు తేదీని పొడిగించిన ట్రాయ్

Posted On: 19 JAN 2023 9:43AM by PIB Hyderabad

భార‌త‌దేశంలో స‌బ్‌మెరైన్ (స‌ముద్రంలోప‌ల‌) కేబుల్ ల్యాండింగ్ కోసం లైసెన్సింగ్ చ‌ట్రం, నియంత్ర‌ణా యంత్రాంగంపై సంప్ర‌దింపుల ప‌త్రాన్ని 23 డిసెంబ‌ర్ 2022న టెలికాం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్ -టిఆర్ఎఐ) విడుద‌ల చేసింది. ఈ సంప్ర‌దింపుల ప‌త్రంలోని అంశాలపై భాగ‌స్వాములు లేవ‌నెత్త‌వ‌ల‌సిన సందేహాలు, స‌మ‌స్య‌ల‌ను స‌మ‌ర్పించేందుకు, ప్ర‌తివ్యాఖ్య‌ల కోసం ఆఖ‌రుతేది 03 ఫిబ్ర‌వ‌రి 2023గా నిర్ణ‌యించారు. 
భాగ‌స్వాములు/ సంస్థ‌ల నుంచి అభ్య‌ర్ధ‌న‌ల‌ను దృష్టిలో ఉంచుకొని వ్యాఖ్య‌ల‌ను, ప్ర‌తివ్యాఖ్య‌ల‌ను  స‌మ‌ర్పించేందుకు గ‌డువును కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. దీని ప్ర‌కారం లిఖిత‌పూర్వ‌క వ్యాఖ్య‌ల‌ను, ప్ర‌తివ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్పించందుకు ఆఖ‌రు తేదీని 10 ఫిబ్ర‌వ‌రి, 2023, 24 ఫిబ్ర‌వ‌రి 2023గా నిర్ణ‌యించారు. 
వ్యాఖ్య‌ల‌ను/  ప్ర‌తివ్యాఖ్య‌ల‌ను ప్ర‌ధానంగా ఎల‌క్ట్రానిక్ రూపంలో ఎడివిబిపిఎ@టిఆర్ఎఐ.గ‌వ్‌.ఇన్ (advbbpa@trai.gov.in)తో పాటుగా ఒక కాపీనీ జెటిఎడివిబిబిపిఎ-1@టిఆర్ఎఐ.గ‌వ్‌.ఇన్ (jtadvbbpa-1@trai.gov.in)కు పంపాలి. మ‌రింత స్ప‌ష్టీక‌ర‌ణ‌/ స‌మాచారం కోసం ట్రాయ్ (బ్రాడ్‌బ్యాండ్ & పాల‌సీ అనాల‌సిస్‌) స‌ల‌హాదారు శ్రీ సంజీవ్ కుమార్ శ‌ర్మను టెలిఫోన్ నెంబ‌ర్ +91-11-23236119లో సంప్ర‌దించ‌వ‌చ్చు. 

 

***


(Release ID: 1892290) Visitor Counter : 167