నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ

జార్ఖండ్‌ లో గ్రామీణ్‌ ఉద్యమి కార్యక్రమం కింద విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న 200 మంది గిరిజన మహిళలను సన్మానించిన శ్రీరాజీవ్‌ చంద్రశేఖర్‌ నవభారత భవిష్యత్‌ వృద్ధికి నైపుణ్యాలు అత్యంత ముఖ్యమైనవి : కేంద్ర సహాయమంత్రి శ్రీరాజీవ్‌ చంద్ర శేఖర్‌

Posted On: 18 JAN 2023 6:41PM by PIB Hyderabad

కీలక ముఖ్యాంశాలు:

`గ్రామీణ్‌ ఉద్యమి కార్యక్రమం 3వ దశ కింద శిక్షణ పూర్తిచేసుకున్న 200 మంది గిరిజన మహిళలకు సర్టిఫికేట్ల ను కేంద్ర సహాయమంత్రి శ్రీ రాజీవ్‌ చంద్రశేఖర్‌ అందజేశారు.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌, ఎలక్ట్రానిక్స్‌, ఐటి శాఖ సహాయమంత్రి శ్రీ రాజీవ్‌ చంద్రశేఖర్‌  గుమ్లాలో జరిగిన గ్రామీణ్‌ ఉద్యమి ప్రాజెక్టు కార్యక్రమంలో మాట్లాడుతూ, నైపుణ్యం అనేది అవకాశాలకు గేట్‌వే అని అన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా నైపుణ్య శిక్షణ అందాలన్నది ప్రభుత్వ సంకల్పమని ఆయన అన్నారు.
భవిష్యత్‌ భారతావనికి నైపుణ్యాలు అత్యంత ముఖ్యమైనవని ఆయన అన్నారు. నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నట్టు చెప్పారు. స్థానిక అవసరాలను, వనరులను దృష్టిలో ఉంచుకుని వీటిని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇది గ్రామాలనుంచి నగరాలకు వలసలను తగ్గిస్తుందని అన్నారు.ఇది స్థానిక ఆర్థికవ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళుతుందని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్‌భారత్‌ దార్శనికత, ఆత్మనిర్భర్‌ గ్రామాల మీదుగా, ఆత్మనిర్భర్‌ పంచాjతీలమీదుగా ప్రయాణిస్తున్నదని ఆయన అన్నారు. మన గిరిజనుల పాత్ర (జనజాతీయ) లేకుండా ఆత్మనిర్భరత సాధ్యం కాదని ఆయన అన్నారు.

200 మందికి పైగా మహిళలు తమ నైపుణ్యాలకు సంబంధించి మూడో విడత శిక్షణను పూర్తి చేసుకున్నారు.వీరికి ఈ కార్యక్రమంలో సర్టిఫికేట్లు అందజేశారు. గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అర్జున్‌ ముండా,  రాజ్యసభ సభ్యుడు సమీర్‌ ఒరాన్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అనంతరం రాజీవ్‌ చంద్రశేఖర్‌ జార్ఖండ్‌, తమిళనాడు రాష్ట్రాలలో మహాత్మాగాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌ (ఎంజిఎన్‌ఎఫ్‌) కింద పనిచేస్తున్న కొందరిని కలుసుకున్నారు. వారికి నైపుణ్యాల కల్పన విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దార్శనికతను వారికి తెలియజేశారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి ప్రణాళిక ఉపాధి కల్పనకు, ఎంటర్‌ప్రెన్యుయర్‌షిప్‌కు అవకాశాలు కల్పించడంపై దృష్టిసారించాలని అది నయా భారత్‌, నయే అవసర్‌, నయీ సమృద్ధిని ప్రతిబింబించాలని అన్నారు.
రాజీవ్‌ చంద్రశేఖర్‌ సమావేశానికి ముందు రాంచీకి చేరుకుని లోహర్‌దగ వద్ద మనోకామనా సిద్ది దుర్గా మందిర్‌ను దర్శించారు.  అలాగే 2012 లో నక్సలైట్ల తో జరిగిన పోరాటంలో అమరుడైన జార్ఖండ్‌ పోలీస్‌ కు చెందిన  షాహీద్‌ దేవ నారాయణ్‌ భగత్‌స్మారకాన్ని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు.

***



(Release ID: 1892287) Visitor Counter : 156