ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సైబర్ రక్షణ చర్యలు, ఆర్థిక సేవల రంగంలో సంసిద్ధత కోసం సన్నద్ధతపై సదస్సు నిర్వహించిన - డి.ఎఫ్.ఎస్.

Posted On: 18 JAN 2023 5:11PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్ధిక సేవల విభాగం (డి.ఎఫ్.ఎస్) ఈ రోజు ఇక్కడ ఆర్థిక సేవలు సైబర్ రక్షణ (ఎఫ్.ఐ.ఎన్.ఎస్.సి.వై) శీర్షికతో సైబర్ రక్షణ పై సదస్సు నిర్వహించింది.   డి.ఎఫ్.ఎస్. కార్యదర్శి డాక్టర్ వివేక్ జోషి, ఈ సదస్సును ప్రారంభించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న సైబర్ భద్రతా చర్యలు, ఆర్థిక సేవల రంగంలో నెలకొన్న సైబర్ రక్షణ చర్యలపై ఆందోళనలతో పాటు, భవిష్యత్ సైబర్ బెదిరింపులను ఎదుర్కోడానికి సంసిద్ధత, సవరించిన ముసాయిదా డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు పై అవగాహన వంటి వాటిపై ప్రభుత్వ సంస్థలు, విభాగాలు, ఆర్థిక సేవల రంగ నియంత్రణ సంస్థలకు చెందిన సీనియర్ అధికారులతో పాటు, బ్యాంకులు, బీమా సంస్థలు, ఎఫ్.ఐ. లకు చెందిన సీనియర్ కార్యనిర్వాహకులు, సి.ఐ.ఎస్.ఓ. ల ఆలోచనలు, అభ్యాసాలు, ఆందోళనలను పంచుకోవడానికి ఈ సదస్సు అవకాశం కల్పించింది. 

ఈ సదస్సులో ఆర్థిక సేవల విభాగం, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎం.ఈ.ఐ.టి.వై),హోం మంత్రిత్వ శాఖ, సి.ఈ.ఆర్.టి-ఇన్, ఎన్.సి.ఐ.ఐ.పి.సి., భారత సైబర్ నేర సమన్వయ కేంద్రం వంటి ప్రభుత్వ సంస్థలు, ఆర్ధిక సేవల రంగంలోని ఆర్‌.బి.ఐ., ఐ.ఆర్‌.డి.ఎ.ఐ., పి.ఎఫ్‌.ఆర్‌.డి.ఎ., వంటి సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులు, బీమా సంస్థలతో పాటు,  నాబార్డ్, ఎస్.ఐ.డి.బి.ఐ., ఎక్జిమ్ బ్యాంకు, జాతీయ గృహ నిర్మాణ బ్యాంకు వంటి ప్రధాన ఆర్థిక సంస్థలకు చెందిన  సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

 

*****

 

 


(Release ID: 1892113) Visitor Counter : 174
Read this release in: English , Urdu , Hindi