ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బస్తీ జిల్లా లో సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 రెండో దశ ను వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యంద్వారా ప్రారంభించిన ప్రధాన మంత్రి


‘‘విజయవంతమైన క్రీడాకారులు వారి లక్ష్యం పై దృష్టి ని కేంద్రీకరిస్తారు; అంతేకాక వారి దారి లో ఎదురుపడే ప్రతి అడ్డంకి ని కూడా అధిగమిస్తారు’’

‘‘ఖేల్ మహాకుంభ్ వంటి కార్యక్రమాల ను ఏర్పాటు చేయడం ద్వారా ఎంపి లు కొత్తతరంభవిష్యత్తు ను తీర్చిదిద్దుతున్నారు’’

‘‘ప్రాంతీయ ప్రతిభ ను వెదకి, మరి దానిని సద్వినియోగపరచడం లో సాంసద్ఖేల్ మహాకుంభ్ ఒక కీలకమైన పాత్ర ను పోషిస్తున్నది’’

‘‘క్రీడలు సమాజం లో వాటి కి దక్కవలసిన ప్రతిష్ఠ ను సంపాదించుకొంటున్నాయి’’

‘‘ఒలింపిక్స్ లో పాలుపంచుకోదగ్గ దాదాపు 500 మంది కి ‘టార్గెట్ ఒలింపిక్స్ పోడియమ్ స్కీమ్’ లో భాగం గా శిక్షణ ను ఇవ్వడంజరుగుతోంది’’

‘‘స్థానిక స్థాయి లో జాతీయ స్థాయి సదుపాయాల నుసమకూర్చడం కోసం ప్రయాసలు సాగుతున్నాయి’’

‘‘యోగ అభ్యాసం ద్వారా మీ శరీరం ఆరోగ్యం గా ఉండడం తోపాటు మీ మస్తిష్కం కూడా చైతన్యవంతం గా ఉంటుంది’’

Posted On: 18 JAN 2023 2:42PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సాంసద్ ఖేల్ మహాకుంభ్ 2022-23 లో భాగం అయిన రెండో దశ ను ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. సాంసద్ ఖేల్ మహాకుంభ్ ను బస్తీ జిల్లా లో పార్లమెంట్ సభ్యుడు శ్రీ హరీశ్ ద్వివేదీ 2021 వ సంవత్సరం నుండి ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. కుస్తీ, కబడ్డీ, ఖో ఖో, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, చదరంగం, కేరమ్స్, బాడ్ మింటన్, టెబుల్ టెనిస్ మొదలైన ఇండోర్ మరియు అవుట్ డోర్ స్పోర్ట్ స్ లో వివిధ పోటీల ను ఖేల్ మహాకుంభ్ లో భాగం గా నిర్వహిస్తుంటారు. ఇవి గాక విడి గా, వ్యాస రచన, చిత్రలేఖనం, రంగవల్లుల ను తీర్చిదిద్దడం వంటి వాటి లో పోటీల ను కూడా ఖేల్ మహాకుంభ్ లో భాగం గా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.

ప్రధాన మంత్రి సభికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తూ, బస్తీ మహర్షి వశిష్ఠుని యొక్క పవిత్రమైన గడ్డ. ఈ నేల శ్రమ కు, ధ్యానసాధన కు, తపస్సు కు మరియు త్యాగాని కి పేరు తెచ్చుకొంది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు. క్రీడాకారుల / క్రీడాకారిణుల జీవనాని కి ధ్యానసాధన తో, తపస్సు తో ఉండే పోలిక ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, సఫల క్రీడాకారులు వారి లక్ష్యం పైన దృష్టి ని కేంద్రీకరిస్తారని, వారు సాగిపోయే మార్గం లో ఎదురయ్యే ప్రతి అడ్డంకి ని కూడా వారు అధిగమిస్తారన్నారు.

ఖేల్ మహాకుంభ్ ను పెద్ద ఎత్తున నిర్వహించడాన్ని ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, క్రీడల లో భారతదేశాని కి ఉన్నటువంటి సాంప్రదాయిక నైపుణ్యం ఈ తరహా కార్యక్రమాల ద్వారా కొత్త ఉత్సాహాన్ని పుంజుకోగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దాదాపు గా 200 మంది పార్లమెంటు సభ్యులు వారి వారి నియోజకవర్గాల లో ఈ విధమైన ఖేల్ మహాకుంభ్ ను నిర్వహించారని ఆయన తెలిపారు. కాశీ కి పార్లమెంటు లో సభ్యుని గా ఉన్న శ్రీ నరేంద్ర మోదీ, వారాణసీ లో సైతం అటువంటి కార్యక్రమాల ను నిర్వహించడం జరుగుతోంది అని వెల్లడించారు. ‘‘అటువంటి కార్యక్రమాల ను ఏర్పాటు చేయడం ద్వారా, ఎమ్ పిలు కొత్త తరం భవిష్యత్తు ను నిర్మిస్తున్నారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

ఈ ఆట ల ద్వారా, ప్రతిభ ను చాటే క్రీడాకారుల ను భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ (స్పోర్ట్ స్ ఆథారిటి ఆఫ్ ఇండియా-ఎస్ఎఐ) ఆధ్వర్యం లో మరింత శిక్షణ ను ఇవ్వడం కోసం ఎంపిక చేయడం జరుగుతున్నదని కూడా ప్రధాన మంత్రి చెప్పారు. గడచిన సంవత్సరం కంటే మూడింతలు ఎక్కువ గా సుమారు 40,000 మంది క్రీడాకారులు ఈ ఖేల్ మహాకుంభ్ లో పాలుపంచుకొంటున్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఖో ఖో లో ఒక ఆట ను తిలకించే అవకాశం దక్కిందంటూ ప్రధాన మంత్రి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆ ఆట లో మన దేశాని కి చెందిన పుత్రిక లు గొప్ప నేర్పు తోను, ప్రావీణ్యం తోను మరియు జట్టు భావన తో ఆడారని ఆయన అన్నారు. ఈ ఆట లో భాగం పంచుకొన్న ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి అభినందనల ను తెలియజేసి, వారు వారి ప్రయాసల లో రాణించాలని ఆకాంక్షించారు.

సాంసద్ ఖేల్ మహాకుంభ్ లో బాలికల ప్రాతినిధ్యం కీలకమైన అంశం అని ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూ, బస్తీ, పూర్వాంచల్, ఉత్తర్ ప్రదేశ్ లతో పాటు యావత్తు భారతదేశాని కి చెందిన కుమార్తె లు కూడాను వారి యొక్క ప్రతిభ ను మరియు నైపుణ్యాన్ని ప్రపంచ వేదిక మీద చాటగలరన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. విమెన్స్ అండర్ 19 టి20 క్రికెట్ వరల్డ్ కప్ ను గురించి ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, జట్టు కెప్టెన్ శెఫాలి వర్మ యొక్క అసాధారణమైన కార్యసాధన ను ప్రస్తావించారు. ఆమె వరుస గా అయిదు బౌండరీల ను సాధించడం తో పాటు చివరి బంతి ని సిక్సర్ గా మలచి, తద్వారా ఒక ఓవర్ లో 26 పరుగుల ను రాబట్టారు అని వివరించారు. దేశం లో మూల మూలన ఆ విధమైన ప్రతిభ అందుబాటు లో ఉందని, మరి ఆ యొక్క ప్రతిభ ను వెదకి దానికి మెరుగులు పెట్టడం లో సాంసద్ ఖేల్ మహాకుంభ్ ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ను పోషిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు.

క్రీడల ను పాఠ్యాంశేతరకార్యకలాపం గా పరిగణించినటువంటి మరియు వీటి ని అంత విలువ ఏమీ ఉండనటువంటి కార్యకలాపం లేదా కాలక్షేపాని కి సరదా గా అనుసరించే సాధనం గా భావించిన కాలం అంటూ ఒకటి ఉండింది అని ప్రధాన మంత్రి చెప్పారు. . ఈ మనస్తత్వం దేశాని కి ఎంతో నష్టాన్ని కొనితెచ్చింది అన్నారు. ఈ పరిణామం ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులు వారి సామర్థ్యాన్ని పెంపొందింప చేసుకోలేక పోవడాని కి దారి తీసింది అని ఆయన అన్నారు. గడచిన 8-9 సంవత్సరాల నుండి దేశం ఈ లోపాన్ని అధిగమించడాని కి మరియు క్రీడల కు ఒక మెరుగైన వాతావరణాన్ని ఏర్పరచడాని కి అనేక కార్యక్రమాల ను చేపట్టింది. దీనితో మరింత మంది యువజనులు క్రీడల ను ఒక ఉద్యోగ జీవనం గా స్వీకరించడం జరిగింది. ప్రజల లో సైతం ఫిట్ నెస్, ఆరోగ్యం, జట్టు స్ఫూర్తి, ఒత్తిడి నుండి ఉపశమనం, వృత్తి పరమైనటువంటి సాఫల్యం లతో పాటు స్వీయ మెరుగుదల వంటి ప్రయోజనాలు దక్కాయి అని ఆయన వివరించారు.

క్రీడల విషయం లో ప్రజల ఆలోచన విధానాన్ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మార్పు యొక్క ప్రభావాల ను దేశం క్రీడారంగం లో సాధిస్తున్న విజయాల ద్వారా గ్రహించవచ్చు అని ప్రధాన మంత్రి అన్నారు. ఒలింపిక్స్ లో మరియు పారాలింపిక్స్ లో దేశం నమోదు చేసిన చారిత్రిక ప్రదర్శన తాలూకు ఉదాహరణల ను ప్రధాన మంత్రి ప్రస్తావించి, వేరు వేరు క్రీడా మైదానాల లో భారతదేశం యొక్క ప్రదర్శన ప్రపంచం లో ఒక చర్చాంశం గా మారింది అన్నారు. సమాజం లో క్రీడల కు దక్కవలసిన ప్రతిష్ఠ దక్కుతోంది అని ఆయన అన్నారు. ఇది ఒలింపిక్స్ లో, పారాలింపిక్స్ లో, ఇంకా ఇతర పోటీల లో మునుపు ఎన్నడూ లేని విధం గా ఫలితాల ను అందించింది అని ఆయన అన్నారు.

ఇది కేవలం ఆరంభమే, మనం చాలా దూరం ప్రయాణించవలసి ఉంది’’ అని ప్రధాన మంత్రి చెప్తూ, ‘‘ఆట లు అంటే నేర్పు మరియు స్వభావం, ఆట లు అంటే ప్రతిభ, ఇంకా సంకల్పం.’’ అన్నారు. క్రీడాభివృద్ధి లో శిక్షణ కు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఆటగాళ్ళ కు వారి శిక్షణ కు పరీక్ష ను పెట్టుకొనే అవకాశాల ను క్రీడా పోటీల నిర్వహణ ద్వారా అందిస్తూ ఉండాలని సూచించారు. వివిధ స్థాయి లో మరియు ప్రాంతాల లో క్రీడల పోటీల నిర్వహణ అనేది క్రీడాకారుల కు వారి శక్తియుక్తుల ను తెలియ జేస్తుంది. అంతేకాకుండా, వారు వారి సొంత మెలకువల ను అభివృద్ధి పరచుకోవడం లో, ఇంకా లోటుపాట్ల ను గుర్తించి మెరుగుదల కు గల అవకాశాల ను తెలుసుకోవడం లో కోచ్ లకు కూడా దోహద పడుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు. క్రీడాకారులు మెరుగు పడేందుకు అనేక అవకాశాల ను యువజన క్రీడలు, విశ్వవిద్యాలయ క్రీడలు, శీతకాల క్రీడలు ప్రసాదిస్తున్నాయి. ఖేలో ఇండియాద్వారా ఒక్కో నెల కు 50,000 రూపాయల వంతున 2500 మంది క్రీడాకారుల కు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతోంది. ఇంచుమించు 500 మంది ఒలింపిక్స్ లో పాల్గొనడానికి సమర్థులు గా గుర్తించి టార్గెట్ ఒలింపిక్స్ పోడియమ్ స్కీమ్ (టిఒపిఎస్) లో భాగం గా వారికి శిక్షణ ను ఇవ్వడం జరుగుతోంది. అంతర్జాతీయ శిక్షణ అవసరం అని భావించినప్పుడు కొంతమంది క్రీడాకారుల కు 2.5 కోట్ల రూపాయలు మొదలుకొని 7 కోట్ల రూపాయల వరకు సాయాన్ని అందుకోవడమైంది అని ఆయన అన్నారు.

క్రీడారంగం ఎదుర్కొంటున్న సవాళ్ళ ను అధిగమించడం లో కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొంటూ, తగినన్ని వనరులు, శిక్షణ, సాంకేతిక అశాల పై అవగాహన, అంతర్జాతీయ స్థాయి లో అనుభవం సంపాదించడం, మన క్రీడాకారుల ఎంపిక లో పారదర్శకత్వం లకు ప్రత్యేకమైన ప్రాధాన్యాన్ని కట్టబెట్టడం జరుగుతోందని వెల్లడించారు. ఆ ప్రాంతం లో క్రీడల కు సంబంధించిన మౌలిక సదుపాయాల లో మెరుగుదల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, బస్తీ జిల్లా లో, ఇంకా అటువంటి మరికొన్ని జిల్లాల లో క్రీడా మైదానాల ను నిర్మించడం జరుగుతోంది. క్రీడాకారుల కు శిక్షణ ను ఇచ్చేందుకు గాను కోచ్ లను ఏర్పాటు చేయడం జరుగుతోంది అని తెలియ జేశారు. దేశవ్యాప్తం గా ఒక వేయి కి పైగా ఖేలో ఇండియాజిల్లా కేంద్రాల ను ఏర్పాటు చేయడం జరుగుతోంది, మరి వీటి లో 750 కి పైగా కేంద్రాల ను ఇప్పటికే సిద్ధం అయ్యాయి కూడా అని ఆయన తెలిపారు. శిక్షణ ను అందుకోవడం లో క్రీడాకారుల కు ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా చూడటం కోసం దేశం అంతటా అన్ని ఆట మైదానాల ను జియో-ట్యాగింగ్ పరిధి లోకి తీసుకు రావడం జరుగుతోంది అని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాల యువజనుల కోసం మణిపుర్ లో ఒక క్రీడా విశ్వవిద్యాలయాన్ని నిర్మించిందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా, ఉత్తర్ ప్రదేశ్ లోని మేరఠ్ లో మరొక క్రీడా విశ్వవిద్యాలయాన్ని సైతం నిర్మించడం జరుగుతోంది అని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, క్రీడల ను ప్రోత్సహించడానికి ఉత్తర్ ప్రదేశ్ లోని అనేక జిల్లాల లో వసతి గృహాల ను కూడా నడపడం జరుగుతోందన్నారు. ‘‘స్థానిక స్థాయి లోనే జాతీయ స్థాయి సదుపాయాల ను అందించడాని కి ప్రయత్నాలు జరుగుతున్నాయి’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఫిట్ ఇండియా మూవ్ మెంట్ ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఫిట్ నెస్ కు ఎంతటి ప్రాముఖ్యం ఉందో ప్రతి ఒక్క క్రీడాకారుడి కి, ప్రతి ఒక్క క్రీడాకారిణి కి తెలుసును అని పేర్కొన్నారు. వారి నిత్య జీవనం లో యోగ ను ఒక భాగం గా చేసుకోవాలి అని ప్రధాన మంత్రి సూచిస్తూ, ‘‘యోగ అభ్యాసం ద్వారా మీ యొక్క దేహం ఆరోగ్యం గా ఉండడమే కాదు మీ మనస్సు కూడా జాగృతం గా ఉంటుంది. మీరు పాలుపంచుకొనే ఆట లో సైతం దీని వల్ల ప్రయోజనాన్ని మీరు పొందగలుగుతారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 2023వ సంవత్సరాన్ని చిరుధాన్యాల అంతర్జాతీయ సంవత్సరంగా ప్రకటించిన విషయాన్ని ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, చిరుధాన్యాలు క్రీడాకారుల పోషణ లో ఒక పెద్ద పాత్ర ను పోషించగలుగుతాయి అని తెలిపారు. మన యువతీ యువకులు ఆటల నుండి చాలా విషయాల ను నేర్చుకొంటారని, మరి దేశాని కి శక్తి ని ప్రసాదిస్తారని నాకు నమ్మకం ఉంది అని ప్రధాన మంత్రి చెప్తూ, తన ప్రసంగాన్ని ముగించారు.

ఈ సందర్భం లో పాలుపంచుకొన్న వారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, పార్లమెంటు సభ్యుడు శ్రీ హరీశ్ ద్వివేదీ లతో పాటు ఇతరులు ఉన్నారు.

 

పూర్వరంగం

ఖేల్ మహాకుంభ్ ఒకటో దశ ను 2022 డిసెంబర్ 10 వ తేదీ మొదలుకొని 16 వ తేదీ వరకు నిర్వహించడమైంది. రెండో దశ ఖేల్ మహాకుంభ్ ను 2023 జనవరి 18 వ తేదీ నుండి 28 వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది.

కుస్తీ, కబడ్డీ, ఖో ఖో, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, వాలీబాల్, హ్యాండ్ బాల్, చదరంగం, కేరమ్స్, బాడ్ మింటన్, టెబుల్ టెనిస్ మొదలైన ఇండోర్ మరియు అవుట్ డోర్ స్పోర్ట్ స్ లో వివిధ పోటీలు ఖేల్ మహాకుంభ్ లో భాగం గా ఉంటాయి. ఇవి కాక విడి గా, వ్యాస రచన, చిత్రలేఖనం, రంగవల్లుల ను తీర్చిదిద్దడం వంటి వాటి లో పోటీల ను కూడా ఖేల్ మహాకుంభ్ లో భాగం గా ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఖేల్ మహాకుంభ్ అనేది బస్తీ జిల్లా తో పాటు ఇరుగు పొరుగు ప్రాంతాల యువతీ యువకుల కు క్రీడల లో వారి యొక్క ప్రతిభ ను చాటుకోవడాని కి ఒక అవకాశాన్ని మరియు ఒక వేదిక ను అందించేటటువంటి ఒక నూతన కార్యక్రమం మాత్రమే కాకుండా, క్రీడల ను వృత్తి ప్రధానమైన ఐచ్ఛికం గా కూడా ఎంచుకోవడం లో వారి కి ప్రేరణ ను ఇస్తున్నది. ఈ కార్యక్రమం ఆ ప్రాంత యువత లో క్రమశిక్షణ, ఒక జట్టు వలె కలసికట్టు గా శ్రమించడం, ఆరోగ్యకరమైన స్పర్థ, ఆత్మ విశ్వాసం, ఇంకా జాతీయత భావన లను అలవరచడానికి చేపడుతున్న ఒక ప్రయాస గా కూడా ఉంది.

DS/TS

****


(Release ID: 1891999) Visitor Counter : 199