బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

మరో మూడు బొగ్గు గనులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన బొగ్గు మంత్రిత్వ శాఖ


వాణిజ్యపర తవ్వకాల కోసం ఇప్పటివరకు 48 ఉత్తర్వులు జారీ

Posted On: 17 JAN 2023 5:49PM by PIB Hyderabad

వాణిజ్యపర బొగ్గు గనుల కింద మరో మూడు బొగ్గు గనులను కేటాయిస్తూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ ఎం.నాగరాజు చేతుల మీదుగా కేటాయింపు ఉత్తర్వులను విజయవంతమైన బిడ్డింగ్‌ సంస్థ ప్రతినిధులు అందుకున్నారు. దేశ ఇంధన భద్రతకు సహకరించడంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్య ప్రాధాన్యత గురించి శ్రీ ఎం.నాగరాజు నొక్కి వక్కాణించారు. సామర్థ్య ప్రమాణాల ప్రకారం బొగ్గు గనిని అభివృద్ధి చేయాలని విజయవంతమైన బిడ్డర్లను ఆయన అభ్యర్థించారు.

ఈ మూడు బొగ్గు గనుల మొత్తం ఉత్పత్తి సామర్థ్యం సంవత్సరానికి 3.7 మిలియన్ టన్నులు (ఎంటీపీఏ), భూమిలో ఉన్న నిల్వలు 156.57 ఎంటీలు. ఈ గనులు రూ.408 కోట్ల వార్షికాదాయాన్ని అందిస్తాయని, రూ.550 కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని అంచనా. వీటి ద్వారా 5000 మందికి ఉపాధి లభిస్తుంది.

ఈ మూడు బొగ్గు గనులతో కలిపి, ఇప్పటి వరకు 48 బొగ్గు గనులను వాణిజ్యపర తవ్వకాల కోసం కేటాయిస్తూ అనుమతులు జారీ అయ్యాయి. వీటి మొత్తం పీఆర్‌సీ 89 ఎంటీపీఏలు.

 

****


(Release ID: 1891877) Visitor Counter : 148


Read this release in: English , Urdu , Hindi , Tamil