సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పురానా ఖిలాలో తిరిగి త‌వ్వ‌కాలు చేప‌ట్టేందుకు సిద్ధ‌మైన భార‌త పురావ‌స్తు శాఖ‌

Posted On: 17 JAN 2023 4:51PM by PIB Hyderabad

కీల‌కాంశాలు-

ప్ర‌స్తుత సీజ‌న్‌లో చేప‌ట్టిన త‌వ్వ‌కాలు స్త‌రాల‌ నేప‌థ్యంలో రంగుల‌ద్దిన బూడిద రంగు పాత్ర‌ల జాడ‌ల‌ను గుర్తించ‌డంపై దృష్టి కేంద్రీక‌రించాయి
పురానా ఖిలా వ‌ద్ద జ‌రుపుతున్న మూడ‌వ సీజ‌న్ తవ్వ‌కాలు ఇవి

ఢిల్లీలోని పురానా ఖిలాలో త‌వ్వ‌కాల‌ను ప్రారంభించేందుకు ఆర్కియ‌లాజిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ- పురావ‌స్తు శాఖ) సిద్దంగా ఉంది, ఈ త‌వ్వ‌కాల‌కు శ్రీ వ‌సంత్ స్వ‌ర్ణ‌క‌ర్ నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, పురానా ఖిలాలో 2013-14 & 2017-18లో చేప‌ట్టిన త‌వ్వ‌కాల త‌ర్వాత మూడ‌వ విడ‌త త‌వ్వ‌కం కానుంది. 
గ‌త కాలంలో (2013-14 & 2017-18)ల‌లో త‌వ్విన కంద‌కాల‌ను బ‌హిరంగ‌ప‌ర‌చ‌డం, ప‌రిర‌క్షించ‌డం తాజా త‌వ్వ‌కాల ల‌క్ష్యం. గ‌త త‌వ్వ‌కాల సీజ‌న్ ముగింపు సంద‌ర్భంగా, మౌర్యుల కాలానికి ముందు ఉన్న పొర‌ల ఆధారాలు బ‌యిట‌ప‌డ్డాయి. ఈ సీజ‌న్ త‌వ్వ‌కాల‌లో స్త‌రాల నేప‌థ్యంలో రంగుల‌ద్దిన గ్రే పాత్ర‌ల‌ను జాడ‌ల‌ను క‌నుగొన‌డం పై దృష్టి పెట్టారు. అత్యంత ప్రాచీన‌మైన జ‌నావాస‌మైన ఇంద్ర‌ప్ర‌స్థ‌గా గుర్తించిన పురానా ఖిలా వ‌ద్ద గ‌త 2500 ఏళ్ళుగా జ‌నావాసాలు కొన‌సాగుతున్న‌ట్టు ఇంత‌కు ముందు త‌వ్వ‌కాల‌లో నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు.  ఇంత‌కు ముందు చేప‌ట్టిన త‌వ్వ‌కాల‌లో వెలికి తీసిన క‌ళాఖండాలు, బ‌యిట‌ప‌డిన విష‌యాలలో 900 బిసినాటి రంగుల‌ద్దిన బూడిద‌రంగు సామాగ్రి, మౌర్యుల నుంచి సుగులు, కుషానులు, గుప్తులు, రాజ్‌పుట్‌లు, సుల్తానేట్లు, మొగ‌లుల కాలానికి చెందిన మ‌ట్టి పాత్ర‌ల శ్రేణిని వెలికి తీశారు. ఇంత‌కు ముందు త‌వ్వ‌కాలు బ‌యిట‌ప‌డిన వాటిలో కొడ‌వ‌ళ్ళు, పేర‌ర్లు, టెర్రాకోటా బొమ్మ‌లు, బ‌ట్టీలో కాల్చిన ఇటుక‌లు, పూస‌లు, టెర్ర‌కోట బొమ్మ‌లు, ముద్ర‌లు, లావాదేవీలు త‌దిత‌రాలను ప్ర‌స్తుతం కోట స‌ముదాయంలోని పురావ‌స్తు మ్యూజియంలో ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచారు.
ప‌ద‌హార‌వ శ‌తాబ్దానికి చెందిన కోట అయిన పురానా ఖిలాను షేర్ షా సూరీ, రెండ‌వ మొగ‌లు పాల‌కుడు హుమాయూన్ నిర్మించారు. వేలాది సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌లిగిన స్థ‌లంపూ కోట నిలిచి ఉంది. ప‌ద్మ‌విభూష‌న్ ప్రొఫెస‌ర్ బిబి లాల్ కూడా కోట లోప‌ల, దాని ఆవ‌ర‌ణ‌లో 1954లోనూ, 1989-73లోను త‌వ్వ‌కాల ప‌నిని సాగించారు. 

 


***


(Release ID: 1891874) Visitor Counter : 196