వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యవస్థలు,ప్రక్రియల సమర్థత,సమగ్రతను మెరుగుపరచడానికి కొత్త ,మెరుగైన ఆలోచనలపై నిరంతరం దృష్టి సారించి, ప్రభుత్వం ఈ రోజు ఒక స్టార్టప్ లాగా ఆలోచిస్తోంది: శ్రీ పీయూష్ గోయల్


డిజిటల్ ఇండియా, గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ వంటి కార్యక్రమాలు స్టార్టప్ ఎకోసిస్టమ్ వృద్ధికి ముఖ్యంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో దోహదపడ్డాయి: శ్రీ గోయల్

మారుమూల ప్రాంతాలకు చెందిన ఆవిష్కర్తలు, స్టార్టప్ లకు కీలకమైన అవకాశాలు, ఫండింగ్ ఎకోసిస్టమ్ ను పొందడానికి 'మార్గ్' పోర్టల్ సహాయ పడుతుంది: శ్రీ గోయల్

ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు, ప్రజలతో అనుసంధానం చేయడానికి స్టార్టప్ లపై మరింత బలమైన డేటాబేస్ అవసరం:

నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022 విజేతలకు అవార్డులు ప్రదానం చేసిన మంత్రి: 41 స్టార్టప్ లు, 2 ఇంక్యుబేటర్లు, 1 యాక్సిలరేటర్ విజేతలుగా గుర్తింపు

Posted On: 16 JAN 2023 4:40PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖల మంత్రి శ్రీ పియూష్ గోయల్ మాట్లాడుతూ, ప్రభుత్వం నేడు ఒక స్టార్టప్ లాగా ఆలోచిస్తోందని, నిరంతరం కొత్త, మెరుగైన ఆలోచనలపై దృష్టి పెడుతోందని, వాటిని, వ్యవస్థలు ,ప్రక్రియల సమర్థత, ప్రభావం, ఉత్పాదకత, పారదర్శకత ,సమగ్రతను మెరుగుపరచడానికి దేశవ్యాప్తంగా నింపడానికి కృషి చేస్తోందని అన్నారు.

ఢిల్లీలో నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022 ప్రదానం అనంతరం ఆయన ప్రసంగించారు. విజేతలందరినీ అభినందించిన మంత్రి ఈ అవార్డు వారి పరిధిని మరింత విస్తరించడానికి స్ఫూర్తినిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

ఒక జాతిగా మనం ఎదుర్కొంటున్న సవాళ్ళను అధిగమించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని అద్భుతమైన ఆవిష్కరణల జనరేటర్ గా, ఇంక్యుబేటర్ గా అభివర్ణించిన శ్రీ గోయల్, ఆయన దార్శనిక నాయకత్వంలో స్టార్టప్ ఇండియా ఆలోచన దేశమంతటా వేళ్లూనుకుందని అన్నారు.

 

అమృత్ కాల్ లో దేశం మునుపెన్నడూ లేనంత వేగంగా అభివృద్ధి చెందడానికి, యువ భారత ఆకాంక్షలను నెరవేర్చడానికి మరెన్నో వినూత్న ఆలోచనలు, కార్యక్రమాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లుగా ప్రధాన మంత్రి నాయకత్వంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో జరిగాయని, శక్తివంతమైన, పునరుజ్జీవన భారతదేశానికి పునాది వేయడంలో విజయవంతమయ్యాయని, అభివృద్ధి చెందుతున్న వృద్ధి కథగా గుర్తింపు పొందిన దేశం, ప్రపంచ వృద్ధిని నడిపించడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.

 

ప్రాజెక్టుల అమలులో వేగం, నైపుణ్యం, పరిమాణంపై ప్రధాన మంత్రి ఎంతో దృష్టి సారించారని శ్రీ గోయల్ పేర్కొన్నారు.

2015లో ప్రారంభించిన డిజిటల్ ఇండియా మిషన్ ను ఉదహరిస్తూ, డిజిటల్ ఇండియాను దేశంలోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్తే తప్ప, సమానమైన అభివృద్ధి దార్శనికత సాకారం కాదని ప్రధాని ముందుగానే గుర్తించారని ఆయన అన్నారు. డిజిటల్ ఇండియా, 4జీ, ఇప్పుడు 5జీ రోల్ అవుట్, గ్రామాల్లో బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ వంటి కార్యక్రమాలు ముఖ్యంగా చిన్న పట్టణాలు, దేశంలోని మారుమూల ప్రాంతాల్లో అత్యంత సాంకేతిక ఆధారిత స్టార్టప్ ఎకోసిస్టమ్ వృద్ధికి దోహదపడ్డాయని ఆయన అన్నారు.

 

కొవిన్ యాప్, వన్ నేషన్, వన్ రేషన్ కార్డ్  (ఒ ఎన్ ఒ ఆర్ సి), పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్, అనేక స్టార్టప్ లు, , యూని కార్న్ లకు శక్తినిచ్చిన యూపీఐ, ఇ-కామర్స్ ను ప్రజాస్వామ్యీకరించి దేశవ్యాప్తంగా లక్షలాది మామ్ అండ్ పాప్ స్టోర్లను కాపాడే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్(ఒ ఎన్ డి సి) , నిజమైన అర్హులకు ప్రభుత్వం నుంచి నేరుగా సహాయం అందేలా చేసిన జామ్ ట్రినిటీ వంటి మొత్తం వ్యవస్థలో నిజాయితీ, సమగ్రత, పారదర్శకతకు నాంది పలికే అత్యంత ప్రభావవంతమైన ఆవిష్కరణ లను  ప్రభుత్వం తీసుకువచ్చిందని  మంత్రి తెలిపారు.

 

'మార్గ్' పోర్టల్ ను మంత్రి ప్రశంసిస్తూ, ఇది దృష్టి పెట్టడానికి, ఆలోచనలను మెరుగుపరచడానికి సహాయపడు తుందని అన్నారు. ఇన్వెస్టర్ కనెక్ట్ పోర్టల్ గురించి ప్రస్తావిస్తూ, మారుమూల ప్రాంతాలకు చెందిన ఆవిష్కర్తలు కీలకమైన అవకాశాలను పొందడానికి ఇది సహాయపడుతుందని,అనేక అర్హులైన స్టార్టప్ లకు, ఫండింగ్ ఎకోసిస్టమ్ కు ప్రాప్యతను ఇస్తుందని ఆయన అన్నారు.

 

ఇన్వెస్టర్ కనెక్ట్ పోర్టల్ గురించి ప్రస్తావిస్తూ, మారుమూల ప్రాంతాలకు చెందిన ఆవిష్కర్తలు కీలకమైన అవకాశాలను పొందడానికి ఇది సహాయపడుతుందని అనేక అర్హులైన స్టార్టప్ లకు ఫండింగ్ ఎకోసిస్టమ్ కు ప్రాప్యతను ఇస్తుందని ఆయన అన్నారు. అభివృద్ధి ఫలాలను ప్రతి చివరి పౌరుడి వద్దకు తీసుకువెళ్లి మెరుగైన జీవన ప్రమాణాలను సాధించేందుకు సాంకేతిక పరిజ్ఞానం దోహద పడుతుందన్నారు.

 

మార్గ్ పోర్టల్ గురించి ప్రస్తావిస్తూ, ప్రభుత్వంతో పౌరుల పరస్పర చర్యను సులభతరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. ప్రభుత్వం ఈ విధానానికి అనుగుణంగా, ప్రధాన మంత్రి డాక్యుమెంట్ల ను నోట్ చేయాల్సిన

అవసరం లేకుండా చేశారని, సామాన్యుల పై విశ్వాసం ఉంచారని, ఇది ఎప్పుడూ దుర్వినియోగం కాలేదని ఆయన పేర్కొన్నారు. ప్రక్రియలను సరళంగా, ఆర్థికంగా తీర్చిదిద్దేందుకు స్టార్టప్ లు సలహాలు ఇవ్వాలని కోరారు. 39,000కు పైగా కాంప్లయన్స్ తగ్గించామని, కాంప్లయన్స్ భారాన్ని తగ్గించడానికి ఇంకేం చేయవచ్చో సలహాలు ఇవ్వాలని కోరారు.

 

స్టార్టప్ లను ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు , సాధారణ ప్రజలతో మెరుగైన రీతిలో అనుసంధానించడానికి , మన ఆవిష్కర్తల మరిన్ని ఆలోచనలను సంగ్రహించడానికి స్టార్టప్ లపై మరింత బలమైన డేటాబేస్ అవసరాన్ని మంత్రి నొక్కి చెప్పారు. భారతదేశ భవిష్యత్తును నిర్మించడానికి ప్రతి ఒక్కరితో మరింత మమేకమవ్వాలనుకునే ప్రభుత్వం ఇది అని శ్రీ గోయల్ పునరుద్ఘాటించారు.

 

వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ సోమ్ ప్రకాశ్ మాట్లాడుతూ ,దేశంలోని స్టార్టప్ లకు ఫండింగ్, మెంటర్ షిప్ ఇంకా ఎన్నో విషయాల్లో ప్రభుత్వం ఏ విధంగా తోడ్పాటును అందిస్తోందో వివరించారు. నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ జ్యూరీ సంజీవ్ బిఖ్ చందానీ మాట్లాడుతూ, స్టార్టప్ ఇండియా, డీపీఐఐటీ కృషిని అభినందిస్తూ స్టార్టప్ లను ప్రోత్సహించడంలో ప్రభుత్వ కీలక పాత్రను వివరించారు.

 

ఈ సందర్భంగా 'నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022 రిపోర్ట్'ను విడుదల చేశారు. గత నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ గుర్తింపు పొందిన స్టార్టప్స్, నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022 విజేతలకు అందించిన మద్దతు గురించి ఈ నివేదిక సమగ్ర అంతర్దృష్టిని అందిస్తుంది. మెంటార్షిప్, అడ్వైజరీ, అసిస్టెన్స్, రెసిస్టెన్స్, గ్రోత్ కు ప్రతీకగా నిలిచే మార్గ్ ప్లాట్ఫామ్ ను ఈ కార్యక్రమంలో ప్రారంభించారు. స్టార్టప్ లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మధ్య రంగాలు, దశలు, ఫంక్షన్ల మధ్య మెంటర్ షిప్ ను సులభతరం చేయడానికి ఈ వేదికను రూపొందించారు.ప్రస్తుతం ఈ ప్లాట్ఫామ్ లో 600కు పైగా మెంటర్లు, 800కు పైగా స్టార్టప్ లు రిజిస్టర్ అయ్యాయి. ఈ పోర్టల్ ఇప్పుడు స్టార్టప్ లతో మెంటర్ లను లైవ్ మ్యాచ్ మేకింగ్ చేయడానికి అనుమతిస్తుంది, స్టార్టప్ లు భారతదేశం ,ప్రపంచవ్యాప్తంగా ఎదగడానికి ,వారి ప్రభావాన్ని పెంచడానికి సహాయపడే మార్గదర్శకత్వాన్ని యాక్సెస్ చేయడానికి సహాయపడుతుంది.

 

అత్యుత్తమ స్టార్టప్ లను గుర్తించి రివార్డులు ఇచ్చేందుకు డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) నేషనల్ స్టార్టప్ అవార్డులను రూపొందించింది. భారీ స్థాయిలో ఉపాధి, సుస్థిర ఆర్థికాభివృద్ధికి దోహదపడే వినూత్న పరిష్కారాలను అందించే వివిధ కేటగిరీల్లో అసాధారణ స్టార్టప్ లను జాతీయ స్టార్టప్ అవార్డులు గుర్తిస్తాయి. నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ మొదటి ఎడిషన్ 2020 అక్టోబర్ లో ముగిసింది. ఆయా కేటగిరీల్లో 36 స్టార్టప్ లు, 1 ఇంక్యుబేటర్, 1 యాక్సిలరేటర్ విజేతలుగా నిలిచాయి.

 

నేషనల్ స్టార్టప్ అవార్డుల మూడో ఎడిషన్ 2022 ఫిబ్రవరి 1న ప్రారంభమైంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కు అనుగుణంగా, నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022 భారతదేశ అభివృద్ధి కథలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో, ఆర్థిక లాభాల పరంగా మాత్రమే కాకుండా సమాజంపై కొలవగల ప్రభావాన్ని ప్రదర్శించడంలో కీలక పాత్ర పోషించిన స్టార్టప్ లు , దోహద కారులను గుర్తిస్తుంది.

 

నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022 వైవిధ్యం, సమ్మిళితం ,ఆవిష్కరణలపై విస్తృతంగా దృష్టి సారించింది. నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022 కింద కవర్ చేయబడిన రంగాలు ,ఉప రంగాలు మునుపటి ఎడిషన్ ల నుండి వరుసగా 17 ,50 కి పెంచబడ్డాయి, తద్వారా స్టార్టప్ ఎకోసిస్టమ్ కవరేజీ పెరిగింది. 2 సెక్టార్లు, 5 సబ్ సెక్టార్లు, 2 స్పెషల్ కేటగిరీలను ఈ ఎడిషన్ లో చేర్చారు. ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మాన్యుఫ్యాక్చరింగ్ ఎక్సలెన్స్, స్టార్టప్ లను మరింత ప్రోత్సహించేందుకు కొత్తగా చేర్చిన రెండు ప్రత్యేక కేటగిరీలు.

 

దేశవ్యాప్తంగా 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి స్టార్టప్ లు, ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్ల నుంచి మొత్తం 2,667 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను 50 మందికి పైగా జ్యూరీ సభ్యులు పరిశీలించి మదింపు చేశారు.

ఈ జ్యూరీ సభ్యులుగా సీనియర్ ప్రభుత్వ అధికారులు, వెంచర్ క్యాపిటలిస్టులు (వీసీలు), స్టార్టప్ సీఈవోలు, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రఖ్యాత విద్యావేత్తలు ఉన్నారు.

 

ఈ మూడో ఎడిషన్ లో ఆయా కేటగిరీల్లో 41 స్టార్టప్ లు, 2 ఇంక్యుబేటర్లు, 1 యాక్సిలరేటర్ విజేతలుగా నిలిచాయి. టైర్ -2, టైర్ -3 నగరాల నుండి విజేతలు ఆవిర్భవించారు, ఇది దేశంలో చివరి మైలులో వ్యవస్థాపకత , ఆవిష్కరణల స్ఫూర్తి వ్యాప్తిని సూచిస్తుంది.

 

విజేతగా నిలిచిన స్టార్టప్ లకు (ఒక్కో కేటగిరీకి) రూ.5 లక్షలు, గెలిచిన ఇంక్యుబేటర్, యాక్సిలరేటర్ కు వరుసగా రూ.15 లక్షలు అందజేస్తారు. నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2022 ఫలితాలను స్టార్టప్ ఇండియా  వెబ్ సైట్ లో చూడవచ్చు.

 

(https://www.startupindia.gov.in/nsa2022results/).

 

నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ అనేది సుదీర్ఘ నిరంతర ప్రయాణం. నేషనల్ స్టార్టప్ అవార్డ్స్ 2023 కోసం దరఖాస్తుల స్వీకరణ త్వరలో ప్రారంభం కానుంది. వివరాలకు,

 

https://www.startupindia.gov.in/ may be seen.

 

అవార్డు గ్రహీతల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

 ********


(Release ID: 1891716) Visitor Counter : 191