శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

2వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని జ‌రుపుకున్న సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌సిపిఆర్‌


వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వోప‌న్యాసాన్ని ఇచ్చిన ప్రొఫెస‌ర్ బి.ఎన్‌.జ‌గ‌త‌ప్‌

సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌సిపిఆర్ బ‌లాన్ని & సుసంప‌న్న‌మైన వార‌స‌త్వాన్ని చ‌ర్చించిన ప్రొఫెస‌ర్ రంజ‌నా అగ‌ర్వాల్

Posted On: 14 JAN 2023 6:29PM by PIB Hyderabad

సిఎస్ఐఆర్‌- నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ క‌మ్యూనికేష‌న్ అండ్ పాల‌సీ రీసెర్చ్ (సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌సిపిఆర్‌) 13 జ‌న‌వ‌రి 2023న త‌న 2వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని జ‌రుపుకుంది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్‌)లో భాగ‌మైన  ఎన్ఐఎస్‌సిపిఆర్ ఒక ప్ర‌యోగ‌శాల‌. రెండు అంత‌ర్జాతీయంగా  గుర్తింపు పొందిన సిఎస్ఐఆర్ సంస్థ‌లైన సిఎస్ఐఆర్ - నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ క‌మ్యూనికేష‌న్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ రీసోర్సెస్ (సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌సిఎఐఆర్‌),  నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌, టెక్నాల‌జీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్ (సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌టిఎడిఎస్‌) అన్న రెండు సంస్థ‌లు 14 జ‌న‌వ‌రి 2021న విలీనం కావ‌డంతో సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌సిపిఆర్ ఆవిర్భ‌వించింది. అప్ప‌టి నుంచి, సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌సిపిఆర్ శాస్త్రీయ విధాన ప‌రిశోధ‌న‌, శాస్త్రీయ స‌మాచార మార్పిడి రంగంలో అంత‌ర్జాతీయంగా గౌర‌వాన్ని అందుకునే సంస్థ‌గా అవ‌త‌రించేందుకు ఈ రెండు పూర్వ సంస్థ‌ల సుసంప‌న్న‌మైన 100 సంవ‌త్స‌రాల వార‌సత్వాన్ని, అంత‌ర్గ‌తంగా వాటికి గ‌ల బ‌ల‌మైన సామ‌ర్ధ్యాల‌ను ఉప‌యోగించుకొని త‌న కార్య‌క‌లాపాల‌ను నిర్దేశించింది.  త‌న కృషి ద్వారా అంద‌రు భాగ‌స్వాముల‌లో నూత‌న సంస్థ శాస్త్ర‌, సాంకేతిక & ఆవిష్క‌ర‌ణ (ఎస్‌టి&ఐ) విధాన అధ్య‌య‌నాలు, శాస్త్రీయ స‌మాచార వ్యాప్తిని ప్రోత్స‌హించేందుకు, శాస్త్ర‌, సాంకేతిక‌, ప‌రిశ్ర‌మ‌, స‌మాజ‌పు వినిమ‌యసీమకు ఒక వంతెన‌గా వ్య‌వ‌హ‌రించ‌డంలో ముంద‌డుగు వేసింది. 

ఇమేజ్ -
వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తున్న సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌సిపిఆర్ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్‌ రంజ‌నా అగర్వాల్ (కుడి వైపు చివ‌ర‌)

త‌న స్వాగ‌తోప‌న్యాసంలో సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌సిపిఆర్ డైరెక్ట‌ర్ ప్రొఫెస‌ర్ రంజ‌నా అగ‌ర్వాల్ ఎన్ఐఎస్‌సిపిఆర్ బ‌లాల‌ను, సుసంప‌న్న‌మైన వార‌స‌త్వాన్ని చ‌ర్చించారు. స‌మాజానికి వాటిని ప్ర‌త్య‌క్షంగా క‌నిపించేలా, అనుభ‌వ‌నీయంగా, ఫ‌ల‌వంతం అయ్యేందుకు మ‌న కార్య‌కలాపాల‌ను పెంచుతూ పోవాల‌ని ఆమె అన్నారు. 
అనంత‌రం ఐఐటి బాంబే, ఫిజిక్స్ విభాగం సీనియ‌ర్ ప్రొఫెస‌ర్ & సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌సిపిఆర్ ప‌రిశోధ‌నా మండ‌లి చైర్‌ప‌ర్స‌న్ ప్రొఫెస‌ర్ బి.ఎన్. జ‌గ‌త‌ప్ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ ఉప‌న్యాసాన్ని చేశారు. ఆయ‌న ఇంగ్లీ షు విద్యా చ‌ట్టం 1835 నుంచి నూత‌న విద్యావిధానం 2020 ప‌రిణామాన్ని వివ‌రించారు. ఆయ‌న ఉప‌న్యాసం ఆలోచ‌నాత్మ‌కంగా, ఉత్తేజ‌క‌రంగా ఉంది. 

ఇమేజ్ - 

సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌సిపిఆర్‌లో వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ ఉప‌న్యాసాన్ని ఇస్తున్న ఐఐటి బాంబే సీనియ‌ర్ ప్రొఫెస‌ర్ బి.ఎన్‌. జ‌గ‌త‌ప్‌

ఎన్ఐఎస్‌సిపిఆర్ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ వేడుక‌ల‌లో అనేక శాస్త్రీయ ప్ర‌చుర‌ణ‌లు విడుద‌లయ్యాయి.
 
ఈ ప్ర‌త్యేక సంద‌ర్బంగా, అనేక శాస్త్రీయ ప్ర‌చుర‌ణ‌లను విడుద‌ల చేశారు.  - ఇండ‌స్ట్రీ 4.0ః ఎ వే ఫార్వార్డ్ ఫ‌ర్‌సెల్ఫ్ రిల‌యెన్స్ అండ్ స‌స్టైన‌బిలిటీ (ప‌రిశ్ర‌మ 4.0ః స్వ‌యం స‌మృద్ధి & సుస్థిర‌తకు ఒక మార్గం) పై దృష్టిపెట్టిన జ‌ర్న‌ల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండ‌స్ట్రియ‌ల్ రీసెర్చ్ (జెఎస్ఐఆర్‌) ప్ర‌త్యేక సంచికను విడుద‌ల చేశారు. వీటితో పాటుగా, టిఆర్ఎల్ అసెస్‌మెంట్ బులిటెన్‌, సైన్స్ & టెక్నాల‌జీ క్విజ్ః సెలిబ్రేటింగ్ ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్‌, ట్రెజ‌ర్ ఆఫ్ ఇండియ‌న్ ట్రెడిష‌న్స్ అన్న శీర్షిక క‌లిగిన ఫ్లిప్ బుక్‌ల‌ను కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన‌ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్‌విఎఎస్‌టిఐకె ఫోటోగ్ర‌ఫీ పోటీ విజేత‌ల పేర్ల‌ను కూడా ప్ర‌క‌టించారు. ఈ పోటీని 2022లో నిర్వ‌హించారు. 
వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వ వేడుక‌ల సంద‌ర్భంగా, సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌సిపిఆర్ కు చెందిన పిహెచ్‌డి విద్యార్ధులు త‌మ ప‌రిశోధ‌న‌, ఫ‌లితాల‌ను పోస్ట‌ర్ ప్రెజెంటేష‌న్ ద్వారా ప్ర‌ద‌ర్శించారు.  సిఎస్ఐఆర్‌- ఎన్ఐఎస్‌సిపిఆర్ సీనియ‌ర్ ప్ర‌ధాన శాస్త్ర‌వేత్త డాక్ట‌ర్ యోగేష్ సుమ‌న్ వంద‌న స‌మ‌ర్ప‌ణ చేశారు. 

***



(Release ID: 1891428) Visitor Counter : 134


Read this release in: English , Urdu , Marathi , Hindi