వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

జిఈఎమ్ పై మహిళా పారిశ్రామికవేత్తల విజయాన్ని పురస్కరించుకుని జి ఇ ఎమ్ ఆధ్వర్యంలో కార్యక్రమం


"ఉమేనియా" చొరవ ద్వారా
జి ఇ ఎమ్ లో మహిళా పారిశ్రామికవేత్తలు స్వయం సహాయక బృందాల భాగస్వామ్యానికి ప్రోత్సాహం

జి ఇ ఎమ్ లో 1.44 లక్షలకు పైగా రూ.21,265 కోట్ల విలువైన 14 లక్షల ఆర్డర్లను పూర్తి చేసిన ఉమేనియా ఎంఎస్ఇ

Posted On: 14 JAN 2023 10:04PM by PIB Hyderabad

'ఉమెనియా ఆన్ గవర్నమెంట్ ఈమార్కెట్ ప్లేస్ (జీ ఇఎం)' విజయాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని

కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఒక కార్యక్రమం జరిగింది. ఎన్ సియుఐ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీమతి సావిత్రి సింగ్ ముఖ్య అతిథిగాహాజరయ్యారు. చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ డాక్టర్ ఆర్ కె సింగ్, భారత ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (ఎంఎస్ ఎమ్ ఇ) అదనపు అభివృద్ధి కమిషనర్ డాక్టర్ ఇషితా గంగూలీ త్రిపాఠి గౌరవ అతిథులుగా పాల్గొన్నారు

 

స్వయం ఉపాధి మహిళా సంఘం, భారత్ (సేవా భారత్) భాగస్వామ్యంతో జి ఇ ఎం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా పారిశ్రామికవేత్తలు, భాగస్వామ్య సంస్థలు, సంఘాలకు చెందిన వారు పాల్గొన్నారు.

ఆర్థిక అక్షరాస్యతపై మేరాబిల్స్ సహ వ్యవస్థాపకురాలు, సిఇఒ శ్రీమతి పియా బహదూర్ ప్రజెంటేషన్,  డిజిటల్ ఇన్ క్లూజన్ ద్వారా అనధికారిక ఆర్థిక వ్యవస్థలో మహిళా పారిశ్రామికవేత్తలకు కల్పించిన కొత్త అవకాశాలపై సేవా భారత్ జాతీయ కోఆర్డినేటర్ శ్రీమతి సంచితా మిత్రా ప్రజెంటేషన్, జి ఇఎమ్ అమ్మకందారుల ధ్రువీకరణ పత్రాలపై లఘు చిత్రం, సేవా భారత్ ద్వారా "వాయిసెస్ ఫ్రమ్ ది గ్రౌండ్" ,"పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్ లో ఉమేనియా" అనే అంశంపై విధాన నిపుణుల చర్చ ఈ కార్యక్రమంలో ప్రధానాంశాలుగా ఉన్నాయి.

 

2019 లో ప్రారంభించిన "వుమేనియా" చొరవ జి ఇ ఎమ్ పోర్టల్ లో అసంఘటిత రంగానికి చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు , స్వయం సహాయక బృందాల(ఎస్ హెచ్ సి) భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ,మధ్యవర్తులు లేకుండా నేరుగా వివిధ ప్రభుత్వ కొనుగోలుదారులకు వారి ఉత్పత్తులను విక్రయించడానికి వీలు కల్పించింది.

హస్తకళలు ,చేనేత, ఉపకరణాలు, జనపనార ,కాయిర్ ఉత్పత్తులు, వెదురు ఉత్పత్తులు, సేంద్రీయ ఆహారాలు, సుగంధ ద్రవ్యాలు, గృహ అలంకరణ, కార్యాలయ అలంకరణలను జాబితా చేయడానికి జనరిక్ ప్రొడక్ట్ కేటగిరీలను రూపొందించారు.

 

మహిళా పారిశ్రామికవేత్తల నుండి సేకరించిన ఉత్పత్తుల క్యాటలాగ్ లిస్టింగ్

 

ప్రస్తుతం, "ఉమేనియా" అని పిలువబడే 1.44 లక్షలకు పైగా మహిళా సూక్ష్మ, చిన్న సంస్థలు (ఎమ్ఎస్ఇ) జి ఇఎమ్ పోర్టల్ లో అమ్మకందారులు ,సర్వీస్ ప్రొవైడర్లుగా నమోదు అయ్యారు. స్థూల మర్కండైజ్ విలువ (జిఎంవి) లో రూ .21,265 కోట్ల విలువైన 14.76 లక్షల + ఆర్డర్లను నెరవేర్చాయి. ఆర్డర్ విలువ నిష్పత్తి ఉత్పత్తులలో 74 శాతం (%) ,సర్వీస్ కేటగిరీలలో 26 శాతం (%). మహిళలు తమ ఉనికిని నమోదు చేసుకున్న టాప్ ఐదు (5) ఉత్పత్తి వర్గాలలో డెస్క్ టాప్ కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ ఐ ఎస్:13252,

స్పెషల్ టెలిఫోన్లు (స్మార్ట్ ఫోన్ ఫర్ ఐ సి డి ఎస్ ), స్మార్ట్ ఫోన్ అండ్ హాపర్ టిప్పర్ డంపర్ ఇంకా మ్యాన్‌పవర్ అవుట్‌సోర్సింగ్ సేవలు - కనీస వేతనం, సేవల కోసం అనుకూల బిడ్, హ్యూమన్ రిసోర్స్ అవుట్‌సోర్సింగ్ సర్వీస్, మంత్లీ బేసిస్ క్యాబ్ అండ్ టాక్సీ హైరింగ్ సర్వీసెస్, మ్యాన్‌పవర్ అవుట్‌సోర్సింగ్ సర్వీసెస్ - ఫిక్స్‌డ్ రెమ్యూనరేషన్ వంటి ఐదు ప్రధాన మైనవి ఉన్నాయి.

 

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్ సియుఐ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీమతి సావిత్రి సింగ్ మాట్లాడుతూ , సమాజంలో పారిశ్రామికవేత్తలుగా మహిళల భాగస్వామ్యాన్ని వివరించారు. భారతదేశంలోని ఈశాన్య ,అభివృద్ధి చెందని ప్రాంతాల్లోని సహకార సంఘాలకు స్వయం సహాయక సంఘాల నుండి మహిళల న్యాయవాద, ఔట్ రీచ్, సమీకరణ ,సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా మహిళల సామాజిక-ఆర్థిక వృద్ధికి అనుగుణంగా ఎన్ సియుఐ కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ప్రాజెక్టుల కార్యక్రమాలను గురించి వివరించారు. గౌరవ అతిథులు డాక్టర్ ఆర్.కె.సింగ్, డాక్టర్ ఇషితా గంగూలీ త్రిపాఠి కూడా సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళా పారిశ్రామికవేత్తల ప్రయోజనం కోసం సిడ్బీ, ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ ద్వారా అందుబాటులో ఉన్న వివిధ ప్రభుత్వ పథకాల గురించి హాజరైన వారికి వివరించారు.

 

ఎసిఇఒ అండ్ సిఎఫ్ఒ శ్రీ వై కె పాఠక్,

జి ఇఎమ్ లో సామాజిక సమ్మిళితం ప్రధాన విలువగా పేర్కొన్నారు. ప్రభుత్వ కొనుగోలుదారులతో “ఉమేనియా" చొరవ అద్భుతమైన విజయంపై మహిళా పారిశ్రామికవేత్తలందరినీ అభినందించారు. ముఖ్యంగా వ్యాపార వర్గాల సభ్యులకు, వర్ధమాన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు , మహిళలు, గిరిజన, ఎస్సీ, ఎస్టీ ఎంఎస్ఇలు, స్వయం సహాయక సంఘాలు, చేతివృత్తులు, నేత కార్మికులు ,స్టార్టప్ లు ప్రదర్శించిన ఉత్సాహానికి, జి ఇ ఎమ్ పోర్టల్ లో పాల్గొన్నందుకు అభినందించారు.

 

పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్ మార్కెట్లను యాక్సెస్ చేసుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటున్న మహిళా ఎంటర్ ప్రెన్యూర్ షిప్ ను సమాజం అంచుల్లో అభివృద్ధి చేయడం, మహిళా యాజమాన్యంలోని, నేతృత్వంలోని ఎంఎస్ ఈలు, గిరిజన పారిశ్రామికవేత్తలు, దివ్యాంగులు, స్టార్టప్ లు, స్వయం సహాయక బృందాలు, హస్తకళాకారులు ,నేత కార్మికులు వంటి తక్కువ సేవలందించే విక్రేత సమూహాల లింగ సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించడానికి కృషి చేయడం "వుమేనియా" లక్ష్యం. మహిళా యాజమాన్యంలోని ,నేతృత్వంలోని

ఎం ఎస్ ఇ ల కోసం ప్రభుత్వ సేకరణలో మూడు (3) శాతం (%) లక్ష్యాన్ని నిర్దేశించే ప్రభుత్వ చొరవకు "వుమేనియా" చక్కగా సరిపోతుంది.

 

జి ఇఎమ్ లో "ఉమేనియా" ప్రమోషన్ కోసం కొత్త వ్యాపార ప్రక్రియలు ,ఫంక్షనాలిటీలను అభివృద్ధి చేయడానికి అమలు చేయడానికి జి ఇఎమ్ అనేక చర్యలు తీసుకుంది.

 

గుర్తించదగిన దశలలో ఇవి ఉన్నాయి: హస్తకళలు, చేనేత, ఖాదీ ,సృజనాత్మక ఉత్పత్తుల అంతరాయం లేని జాబితా కోసం ప్రత్యేక ఉత్పత్తి కేటగిరీలను అభివృద్ధి చేయడం, తక్కువ సేవలందించే విక్రేత సమూహాల నుండి ఉత్పత్తులను ప్రోత్సహించడానికి జిఈఎమ్ అవుట్ లెట్ స్టోర్లను సృష్టించడం, ,ఎస్సీ/ ఎస్టీ పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ఉత్పత్తులను వేరు చేయడానికి మార్కెట్ ఫిల్టర్లు ,మార్కెట్ ఐకాన్ లు, ప్రభుత్వ కొనుగోలుదారులకు "వుమేనియా" ప్రత్యేకంగా తయారు చేసిన ఉత్పత్తులను గుర్తించడంలో సహాయపడటం, పోర్టల్ లో కొత్త సర్వీస్ వర్టికల్ "స్టిచింగ్ అండ్ టైలరింగ్ సర్వీసెస్" ను ప్రారంభించడం.  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సిబ్బందికి ,ప్రభుత్వ కార్యాలయాలకు కార్యాలయ అలంకరణ/ ఉపకరణాలు, ఆశా/ అంగన్ వాడీ కార్యకర్తలు, పాఠశాలలు, ఆసుపత్రులు, రాష్ట్ర పోలీసులు, పారా మిలటరీ దళాలు, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతరులకు యూనిఫాంలు అందించడానికి అద్భుతమైన హైపర్-లోకల్ "మార్కెట్లకు ప్రాప్యత" అవకాశాలు ఉన్నాయి.

 

మహిళా నేతృత్వంలోని సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు, మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వ సేకరణలో శిక్షణ, సహాయం, వీలు కల్పించేందుకు స్వయం ఉపాధి మహిళా సంఘం (సేవా)తో, పబ్లిక్ ప్రొక్యూర్ మెంట్ లో సర్వీస్ ప్రొవైడర్లుగా మహిళలకు శిక్షణ ఇవ్వడానికి ఉషా సిలాయ్ పాఠశాలతో జీఈఎం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. స్థానిక సంస్థలు, సహకార సంఘాలు, పంచాయితీరాజ్ సంస్థలు వంటి చివరి మైలు భాగస్వాములు, కార్పొరేట్లు, ప్రైవేట్ కంపెనీలు, కళాశాలలు, శాస్త్ర ,సాంకేతిక పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు వంటి ప్రభుత్వ సేకరణ వాటాదారులు, "ఉమేనియా" చొరవ వృద్ధి ,విజయం నుండి ప్రయోజనం పొందుతారు.

 

మహిళా పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న "మార్కెట్లకు ప్రాప్యత", "ఫైనాన్స్ ప్రాప్యత" "విలువ-జోడింపుకు ప్రాప్యత" అనే మూడు సవాళ్లను పరిష్కరించడానికి "ఉమేనియా" చొరవ ప్రయత్నిస్తుంది. భారతదేశంలోని చివరి మైలు ఉత్పత్తిదారులు ,సర్వీస్ ప్రొవైడర్ల ఉపయోగించని వ్యవస్థాపక శక్తిని స్థానిక ప్రభుత్వ కొనుగోలుదారులతో అనుసంధానించడానికి ప్రయత్నిస్తుంది.

ఇది హైపర్-లోకల్ సేకరణను ప్రోత్సహిస్తుంది, తద్వారా ప్రభుత్వ "వోకల్ ఫర్ లోకల్" ,"మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమాల ద్వారా స్థానిక విలువ-గొలుసులను ఏకీకృతం చేస్తుంది, తద్వారా స్వయం సమృద్ధ "ఆత్మనిర్భర్ భారత్" లక్ష్యాన్ని ముందుకు తీసుకువెళుతుంది.

 

******



(Release ID: 1891354) Visitor Counter : 150


Read this release in: English , Urdu , Hindi